Android 16 Beta : బిగ్ అలర్ట్.. ఈ షావోమీ, వన్‌ప్లస్ ఫోన్లలో కొత్త ఆండ్రాయిడ్ 16బీటా రిలీజ్.. మీ ఫోన్ ఇలా అప్‌డేట్ చేసుకోండి..!

Android 16 Beta : షావోమీ, వన్‌ప్లస్ యూజర్లకు అలర్ట్.. కొత్త ఆండ్రాయిడ్ 16బీటా రిలీజ్ అయింది. ఈ ఫోన్ల జాబితాలో మీ ఫోన్ ఉంటే వెంటనే ఇన్‌‌స్టాల్ చేసుకుని అప్‌డేట్ చేసుకోండి.

Android 16 Beta

Android 16 Beta : ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆండ్రాయిడ్ 16బీటా వెర్షన్ వచ్చేసింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ తయారీదారు కంపెనీలు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 బీటాను రిలీజ్ ప్రారంభించాయి. గూగుల్ నెక్స్ట్ మెయిన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది.

ముఖ్యంగా OnePlus, Xiaomi రెండూ ఫోన్లలో డెవలపర్ బిల్డ్‌లకు సపోర్టు అందిస్తున్నాయి. ఇదివరకే ఈ టెస్ట్ స్టేజ్ ముగిసింది. షావోమీ నుంచి షావోమీ 15, షావోమీ 14T ప్రో కోసం ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూను రిలీజ్ చేసింది.

Read Also : Vivo V50e Vs Vivo V50 : వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. ఈ రెండు వివో 5G ఫోన్లలో ఏది కొంటే బెటర్? మీ బడ్జెట్‌ ధరలో వచ్చేది ఇదే..!

అయితే, వన్‌ప్లస్ కంపెనీ కూడా రాబోయే వన్‌ప్లస్ 13 ఫ్లాగ్‌షిప్ కోసం త్వరలో ఆండ్రాయిడ్ 16 బీటా 2ను రిలీజ్ చేయనుంది. గూగుల్ గతంలో ఆండ్రాయిడ్ 16 బీటా బిల్డ్‌లను పిక్సెల్ ఫోన్లకు మాత్రమే పరిమితం చేసింది. కానీ, ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు కూడా ఆండ్రాయిడ్ 16 బీటాను రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ కింది ఫోన్లలో మీ ఫోన్ ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోండి.

Google Pixel :

  • Pixel 6, Pixel 6 Pro
  • Pixel 6a
  • Pixel 7, Pixel 7 Pro
  • Pixel 7a
  • Pixel Fold
  • Pixel Tablet
  • Pixel 8, Pixel 8 Pro
  • Pixel 8a
  • Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL, Pixel 9 Pro Fold

Xiaomi :
Xiaomi 15
Xiaomi 14T Pro

OnePlus :
OnePlus 13

షావోమీ (Xiaomi) స్మార్ట్‌ఫోన్‌లలో Android 16 బీటా బిల్డ్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? :  

  • ఈ ప్రాసెస్ మీ ఫోన్లలో మొత్తం డేటాను డిలీట్ చేస్తుందని గమనించాలి. ముందుగా మీ డేటాను బ్యాకప్ తీసుకోవాలి.
  • కంపెనీ వెబ్‌సైట్ నుంచి ఆండ్రాయిడ్ 16 బీటా బిల్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ROM అప్‌గ్రేడ్ ప్యాకేజీని ఫోన్ స్టోరేజ్‌కి కాపీ చేయండి.
  • Settings -> About Phone -> “OS Version”పై 10 సార్లు క్లిక్ చేసి, ఆపై డెవలపర్ మోడ్‌లోకి వెళ్లండి.
  • Settings -> About Phone -> system iconపై క్లిక్ చేయండి -> టాప్ రైట్ కార్నర్‌లో “Three Dots” ఐకాన్‌పై క్లిక్ చేయండి
  • “Choose update package” ఆప్షన్ ఎంచుకోండి.
  • సరైన ROM అప్‌గ్రేడ్ ప్యాకేజీని ఎంచుకున్న తర్వాత మీ ఫోన్ అప్‌గ్రేడ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది.

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 16 బీటా బిల్డ్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? : 

  • షావోమీ (Xiaomi) మాదిరిగానే OnePlus కూడా అప్‌గ్రేడ్ మెథడ్ ఒకేలా ఉంటుంది.
  • మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేస్తే కంటెంట్‌ మొత్తం డిలీట్ అవుతుంది. వినియోగదారులు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయాలి.
  • వన్‌ప్లస్ నుంచి లేటెస్ట్ ROM అప్‌గ్రేడ్ జిప్ ప్యాకేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ROM అప్‌గ్రేడ్ ప్యాకేజీని ఫోన్ స్టోరేజ్‌కి కాపీ చేయండి.
  • Settings -> About Device -> Version -> Build నంబర్‌ను 7 సార్లు క్లిక్ చేసి పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. డెవలపర్ మోడ్‌లోకి వెళ్తారు.
  • Settings -> About device -> Up to date -> Top Right button క్లిక్ చేయండి  -> Local install -> సంబంధిత ఇన్‌స్టాలేషన్ ప్యాకేజీపై క్లిక్ చేయండి
  • Extract -> Upgrade -> System Upgrade 100% అవుతుంది.
  • అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత Restart ఆప్షన్ క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూ, బీటాలో కొత్త ఫీచర్లు ఇవే : 

Read Also : Samsung Galaxy A55 5G : అమెజాన్‌లో ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

  • బ్లూటూత్ లో ఎనర్జీ (LE) డివైజ్‌ల్లో ఆడియో షేరింగ్.
  • స్క్రీన్-ఆఫ్ ఫింగర్ ఫ్రింట్ యాక్సెస్.
  • ఫోల్డబుల్స్ బిగ్-స్క్రీన్ డివైజ్‌ల కోసం అప్‌గ్రేడ్ యాప్ సపోర్టు
  • ఫుడ్ డెలివరీల మానిటరింగ్ కోసం పర్యవేక్షించడానికి లైవ్ అప్‌డేట్స్
  • అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ వీడియో (APV) కోడెక్‌కు సపోర్టు
  • డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో కొత్త ఎక్స్‌ట్రా డిమ్ ఫీచర్.
  • గూగుల్ వ్యాలెట్ పవర్ బటన్ షార్ట్‌కట్‌ను రెండుసార్లు ట్యాప్ చేయండి.