Android Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ వాట్సాప్ లింక్ క్లిక్ చేస్తే ఏమౌతుందో తెలుసా..? తస్మాత్ జాగ్రత్త!
Android Users Alert : వాట్సాప్ యూజర్లు ఈ లింక్ ద్వారా క్లిక్ చేస్తే అంతే మరి.. మీ యాప్ వెంటనే క్రాష్ అయిపోతుంది జాగ్రత్త..

Android Users Alert : This WhatsApp link can crash the app immediately
Android Users Alert : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. వాట్సాప్ ఆండ్రాయిడ్ (WhatsApp Android) యాప్‌లో కొత్త బగ్ కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వాట్సాప్ సెట్టింగ్‌లకు సంబంధించిన లింక్‌ను వ్యక్తిగత యూజర్ లేదా గ్రూప్ చాట్‌ను యూజర్ ఓపెన్ చేసిన వెంటనే అందులోని బగ్ వాట్సాప్‌ను క్రాష్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. మెటా యాజమాన్యంలోని యాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అనేక ప్రైవసీ ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపర్చేందుకు కొత్త ఫీచర్లను యాడ్ చేసేందుకు సెక్యూరిటీ పరమైన భద్రతను మెరుగుపరచడానికి, బగ్‌లను ఫిక్స్ చేసేందుకు వాట్సాప్ (WhatsApp) సాధారణ యాప్ అప్‌డేట్‌లతో పాటు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వస్తుంది. అయితే, ఇటీవల వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌ను బగ్ క్రాష్ చేస్తోంది.
ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ క్రాష్ అయ్యే బగ్‌ను ఎదుర్కొంటోంది. యూజర్లు నిర్దిష్ట లింక్ (wa.me/settings)ని కలిగిన వ్యక్తిగత లేదా గ్రూపు చాట్‌ను ఓపెన్ చేసినప్పుడు బగ్ సమస్య ఎదురువుతుంది. సాధారణంగా, ఈ లింక్ WhatsApp యాప్ సెట్టింగ్‌ల పేజీని ఓపెన్ చేయాలి. కానీ, బగ్ కారణంగా ప్రస్తుతం ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో క్రాష్‌లకు కారణమవుతోంది. వాట్సాప్ బిజినెస్‌తో సహా పర్సనల్, గ్రూపు చాట్‌లను బగ్ ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. ఈ సమస్యాత్మక లింక్‌తో చాట్‌ను ఓపెన్ చేయగానే క్రాష్‌కు కారణమవుతుందని నివేదిక పేర్కొంది.
Read Also : iQOO Neo 7 Launch : ఐక్యూ నియో 7 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెలాఖరులోనే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు తెలుసా?
అయితే, నిర్దిష్ట మెసేజ్ థ్రెడ్‌ని మళ్లీ విజిట్ చేయకపోతే మాత్రం వాట్సాప్ సాధారణంగా రీస్టార్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్ (WhatsApp 2.23.10.77) వెర్షన్‌ను బగ్ ప్రభావితం చేస్తుందని రిపోర్టు తెలిపింది. అయినప్పటికీ, ఇతర వాట్సాప్ వెర్షన్‌లు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా, వాట్సాప్ బగ్ మొదట @BruteBee హ్యాండిల్‌తో ట్విట్టర్ యూజర్ ద్వారా రిపోర్టు చేశారు. వాట్సాప్ బిజినెస్ వెర్షన్ 2.23.10.77ని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. వాట్సాప్ స్టేటస్‌లో URLని షేర్ చేసేందుకు ప్రయత్నిస్తే బగ్ యాప్ క్రాష్ అయ్యేలా చేస్తుందని యూజర్లు ధృవీకరించారు.

Android Users Alert : This WhatsApp link can crash the app immediately
వాట్సాప్ బగ్‌ని ఎలా ఫిక్స్ చేయాలి? :
మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. ఒక సాధారణ పరిష్కారం ఉంది. వాట్సాప్ బ్రౌజర్ వెర్షన్ అయిన వాట్సాప్ వెబ్ ఈ బగ్ వల్ల ప్రభావితం కాలేదని తెలుస్తోంది. అందువల్ల, మీరు మీ బ్రౌజర్ ద్వారా (WhatsApp Web)కి లాగిన్ చేసి.. క్రాష్ అయ్యే మెసేజ్ లేదా చాట్‌ను డిలీట్ చేయొచ్చు. ఆ తర్వాత, మీరు మళ్లీ అదే సమస్యాత్మక లింక్‌ను చూస్తే తప్ప మీ ఫోన్‌లోని మీ వాట్సాప్ క్రాష్ కాదు. బగ్ రిపోర్ట్‌కి అప్‌డేట్‌గా, @BruteBee నుంచి ట్వీట్‌పై స్పందించిన వాట్సాప్ బగ్‌ను పరిష్కరించిందని వెల్లడించింది.
ఈ ట్వీట్‌లో, “@WhatsApp బగ్‌ను పరిష్కరించినట్లు కనిపిస్తోంది. ఈ ట్వీట్‌ను వైరల్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పటికీ వాట్సాప్ సెట్టింగ్ దగ్గర బగ్ ఇప్పటికీ క్రాష్‌కు కారణమవుతుందో లేదో చెక్ చేస్తామని చెప్పారు. కానీ, లింక్ బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. వాట్సాప్ యాప్ క్రాష్ చేయలేదు. అయినప్పటికీ, మీరు ఇప్పటికీ సమస్యను ఎదుర్కొంటే.. Google Play Store నుంచి మీ వాట్సాప్ అప్‌డేట్ చేసుకోవాలి.