Apple WWDC 2024 : ఆపిల్ WWDC ఈవెంట్‌.. కొత్త ఏఐ సిస్టమ్‌ ఆపిల్ ఇంటెలిజెన్స్.. అసలు ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే?

Apple WWDC 2024 Event : టెక్ దిగ్గజం దీనికి ఒక పేరును పెట్టింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే ఆపిల్ ఫోన్లలో ఇంటిగ్రేట్ చేసిన కొత్త ఏఐ సిస్టమ్‌తో ఆపిల్ ఇంటెలిజెన్స్ లాంచ్ చేయనుంది.

Apple WWDC 2024 : ఆపిల్ WWDC ఈవెంట్‌.. కొత్త ఏఐ సిస్టమ్‌ ఆపిల్ ఇంటెలిజెన్స్.. అసలు ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే?

Apple Intelligence may be launched at WWDC 2024 ( Image Source : Google )

Updated On : June 8, 2024 / 5:35 PM IST

Apple WWDC 2024 : అతి త్వరలో ఆపిల్ మెగా ఈవెంట్ జరుగబోతుంది. ఈ నెల (జూన్ 10) నుంచి WWDC 2024 కోసం ఆపిల్ సన్నద్ధమవుతోంది. టెక్ దిగ్గజం ఏఐకి సంబంధించిన అనేక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇతర టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రత్యర్థులు తమ సొంత కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)ను ప్రకటించిన తర్వాత ఆపిల్ అదే రేసును మరో స్థాయికి తీసుకెళ్లనుందని భావిస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024లో ఏఐ మెయిన్ ప్లేయర్‌గా అంచనా వేస్తోంది.

Read Also : Tata Altroz Racer : ఈ కొత్త కారు భలే ఉంది భయ్యా.. టాటా ఆల్ట్రోజ్ రేసర్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

టెక్ దిగ్గజం దీనికి ఒక పేరును పెట్టింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే ఆపిల్ ఫోన్లలో ఇంటిగ్రేట్ చేసిన కొత్త ఏఐ సిస్టమ్‌తో ఆపిల్ ఇంటెలిజెన్స్ లాంచ్ చేయనుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపరేటింగ్ సిస్టమ్‌ల కొత్త వెర్షన్‌లకు వస్తుందని అంచనా. ప్రస్తుత అప్‌డేట్స్ ప్రకారం.. ఆపిల్ ఓపెన్ఏఐతో భాగస్వామ్యాన్ని ఐఓఎస్ 18 చాట్‌బాట్‌తో ఇంటిగ్రేషన్ వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ఏది బయటకు రాలేదు. కంపెనీ ఐఓఎస్ 18 సపోర్టుతో ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకురావచ్చు.

ఆపిల్ ఇంటెలిజెన్స్ ఏంటి? ఇదేలా పనిచేస్తుందంటే? :
ఆపిల్ ఇంటెలిజెన్స్ వినియోగదారుల రోజువారీ పనులను సులభతరం చేసే టెక్నాలజీని వీలైనంత ఎక్కువ యాప్‌లలోకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. నివేదిక ప్రకారం.. ఆపిల్ విస్తృత అప్పీల్‌తో కూడిన ఫీచర్‌లపై దృష్టిపెడుతుంది. ఏఐ ఫీచర్లు ఓపెన్ఏఐ నుంచి సొంత టెక్నాలజీ, టూల్స్ ద్వారా అందించనుంది. ఆపిల్ ఏఐ ఫీచర్లు ఓపెన్ఏఐ నుంచి సొంత టెక్నాలజీ టూల్స్ ద్వారా పవర్ అందించనుంది.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ బట్టి సర్వీసుల్లో ఆన్-డివైస్ ప్రాసెసింగ్ లేదా క్లౌడ్-ఆధారిత కంప్యూటింగ్‌పై ఆధారపడతాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఏదైనా నిర్దిష్ట పనికి ఏ విధానాన్ని తీసుకోవాలో నిర్ణయించే అల్గారిథమ్‌ ఉంటాయి. ఓపెన్ఏఐతో డీల్ అనేక సెక్యూరిటీపరమైన సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఆపిల్ దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఓపెన్ఏఐ చాట్‌బాట్‌ను అధీనంలో తీసుకున్న తర్వాత ఆపిల్ తెలిసినట్లు కనిపిస్తోంది. టెక్ దిగ్గజం దీన్ని ఆప్ట్-ఇన్ ఫీచర్‌గా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ ఫీచర్ నియంత్రణ వినియోగదారుల చేతుల్లోనే ఉండనుంది.

ఐఓఎస్ 18తో ఏఐ సఫారి బ్రౌజర్‌లో స్టోరీలు, వెబ్ పేజీలను త్వరగా రీక్యాప్ చేయగల ఫీచర్లను ఆపిల్ ప్లాన్ చేస్తోంది. మీటింగ్ నోట్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, ఇమెయిల్‌లను పంపే సమ్మరైజేషన టూల్ కలిగి ఉంటుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే.. సిరి(SIRI)కి కొత్త పవర్ రాకపోవచ్చు. ఆపిల్ లార్జ్ లాంగ్వేజీ మోడల్స్ ఆధారంగా వాయిస్-అసిస్టెంట్ మళ్లీ తీసుకురావాలని యోచిస్తోంది. జనరేటివ్ ఏఐ కలిగిన మెయిన్ టెక్నాలజీగా చెప్పవచ్చు. ఆపిల్ మొదటిసారిగా వ్యక్తిగత యాప్‌లను నియంత్రించే సామర్థ్యాన్ని సిరికి అందించవచ్చు. ఏఐ పవర్డ్ ఎమోజీల ఫీచర్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎమోజి లైబ్రరీలో ఉన్న వాటి కన్నా ఎక్కువ ఆప్షన్లను అందిస్తుంది. ఉదాహరణకు.. యూజర్ ఒక పదాన్ని రాసినట్టయితే.. ఏఐ దానిని మరింత సరదాగా సరిపోలే ఎమోజీని క్రియేట్ చేయగలదు.

ఆపిల్ 2024లో ఇతర ఫీచర్లు ఏమి ఉండొచ్చు? :
ఆపిల్ వార్షిక ఈవెంట్‌లో ఏఐ ప్రధాన కేంద్రంగా ఉంటుంది. అయితే అనేక ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఐఓఎస్18తో, ఆపిల్ హోమ్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్, సెట్టింగ్‌ల యాప్, మెసేజెస్ యాప్ వంటి మరెన్నో అనేక మార్పులను తీసుకువస్తుంది. హోమ్ స్క్రీన్ భారీ అప్‌గ్రేడ్‌లను పొందుతుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్తది కానప్పటికీ ఐఓఎస్ 18తో ఆపిల్ ఎక్కడైనా ఐకాన్లను ఉంచడం ద్వారా హోమ్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ప్రస్తుతం, ఐఓఎస్ అనేది ఒక కంట్రోలింగ్ వ్యవస్థ. ఐఓఎస్ 18 రాకతో వినియోగదారులు వాటి మధ్య కొంత గ్యాప్ కాకుండా కోరుకున్న చోట ఐకాన్‌లను సెట్ చేసుకోవచ్చు.

అంతేకాదు.. వినియోగదారులు ఐకాన్ కలర్ కూడా మార్చవచ్చు. వినియోగదారులు తమ అన్ని సోషల్ మీడియా యాప్‌లను బ్లూ లేదా ఫైనాన్స్-సంబంధిత ఐకాన్లుగా మార్చవచ్చు. ఐఫోన్ 17 ఏళ్ల చరిత్రలో హోమ్ స్క్రీన్‌కి ఇది అతిపెద్ద అప్‌గ్రేడ్‌గా రాబోతోంది. కంట్రోల్ సెంటర్ కూడా షార్ట్‌కట్ బటన్‌లను తిరిగి చేర్చడానికి మల్టీ పేజీలలో ఉండేలా మేక్ఓవర్‌ను పొందుతోంది. కొత్త మ్యూజిక్ విడ్జెట్, స్మార్ట్ అప్లియన్సెస్ కంట్రోలింగ్ అప్‌డేట్ ఇంటర్‌ఫేస్‌ను కూడా కలిగి ఉంటుంది. ఐఓఎస్ 18 పర్సనలైజేషన్, కస్టమైజేషన్ సంబంధించినది. ఆపిల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఐఓఎస్ 18ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ఆపిల్ మొగ్గు చూపుతోంది.

Read Also : Apple Days Sale : విజయ్ సేల్స్‌లో ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సిరీస్‌పై టాప్ డీల్స్.. ఏ ఐఫోన్ ధర ఎంతంటే?