Apple iOS 26.5 Beta : ఆపిల్ లవర్స్ మీకోసమే.. iOS 26.5 బీటా 1 రిలీజ్.. ఫీచర్లు అదుర్స్, డౌన్లోడ్ ఎలా? మీ ఐఫోన్ సపోర్టు చేస్తుందా?
Apple iOS 26.5 Beta : ప్రపంచవ్యాప్తంగా iOS 26.4 రిలీజ్ అయ్యాక ఆపిల్ డెవలపర్ల కోసం iOS 26.5 బీటా 1 రిలీజ్ చేసింది. ఈ బీటా వెర్షన్ మెయిన్ అప్డేట్ల కన్నా అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఓసారి లుక్కేయండి..
Apple iOS 26
- ఐఫోన్ ప్రియుల కోసం అద్భుతమైన బీటా అప్డేట్
- మీకు ఈ iOS అప్డేట్ వచ్చిందో లేదో చెక్ చేశారా?
- iOS 26.5 బీటా 1, ఐఫోన్ 11 సిరీస్, కొత్త మోడళ్లకు సపోర్టు
- RCS మెసేజింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్
Apple iOS 26.5 Beta : ఆపిల్ లవర్స్‌కు పండగే. ఐఫోన్ యూజర్ల కోసం iOS 26.5 బీటా 1 రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా iOS 26.4 లాంచ్ తర్వాత ఈ కొత్త బీటా వెర్షన్ వచ్చింది. సిరిలో మెయిన్ అప్గ్రేడ్లు వస్తాయని రుమర్లు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. బదులుగా, ఈ బీటా సిస్టమ్ మైక్రో అప్ గ్రేడ్స్, కొన్ని చేర్పులపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ కొత్తగా బీటా వెర్షన్ అప్ డేట్లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఓఎస్ 26.5 బీటా 1లో ఫీచర్లు ఏంటి? :
ఐఫోన్ తయారీదారు (Suggested Places) అనే సెక్షన్ ప్రవేశపెట్టింది. మీ రీసెంట్ సెర్చ్, యాక్టివిటీ ఆధారంగా ట్రెండింగ్‌లో ఉన్న లొకేషన్లను చూపిస్తుంది. ఆపిల్ మ్యాప్స్‌ను మరింత ఎక్స్ ప్లోర్ టూల్‌గా మారుస్తున్నట్లు అనిపిస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ కేటగిరీలో యాడ్స్ కూడా కనిపించవచ్చు. బిజినెస్ పరంగా లిస్టులు నేరుగా సెర్చ్ రిజల్ట్స్ కనిపించేలా ఉంటుంది.
మ్యాక్ రుమర్స్ రిపోర్టు ప్రకారం.. ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్ల మధ్య RCS మెసేజింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తిరిగి తీసుకువస్తోంది. ఆపిల్ గతంలో అనేకసార్లు ప్రయోగాలు చేసినప్పటికీ ఫైనల్ పబ్లిక్ రిలీజ్ ముందు విత్ డ్రా చేసుకుంది. ఇప్పుడు ఆ ఫీచర్ మళ్లీ వచ్చింది. ఇక డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. కంట్రోలింగ్ కోరుకునే వారి కోసం సెట్టింగ్స్‌లో ఒక టోగుల్ కూడా అందుబాటులో ఉంది.
ఈ టెక్ దిగ్గజం యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్‌కు అనుగుణంగా ఫీచర్లను అందిస్తుంది. ఇందులో థర్డ్-పార్టీ యాక్సెసరీలను ఈజీగా జాయిన్ చేయడం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇయర్‌బడ్స్ దగ్గరగా ఉంటే వెంటనే ఆటో కనెక్ట్ చేయవచ్చు.
లైవ్ యాక్టివిటీస్ ఇప్పుడు థర్డ్-పార్టీ వేరబుల్స్‌తో ఈజీగా సింక్ అవుతాయి. USB-C యాక్సెసరీ కనెక్షన్లు స్టేబుల్ అనిపిస్తాయి. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారేటప్పుడు ఎన్ని అటాచ్మెంట్లు ట్రాన్స్ ఫర్ అవ్వాలో కంట్రోలింగ్ ఆప్షన్‌ను ఆపిల్ అందిస్తోంది.
iOS 26.5 బీటా 1 ఇన్స్టాల్ ఎలా? :
మీరు రిజిస్టర్డ్ డెవలపర్ అయితే.. అప్డేట్ను ఇన్స్టాల్ చాలా ఈజీ. సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌పై ట్యాప్ చేయండి. ఆపై సాఫ్ట్వేర్ అప్డేట్కు వెళ్లండి. డెవలపర్ బీటా ఆప్షన్‌ను ఎంచుకోండి. ఈ అప్డేట్ ఐఫోన్ 11 సిరీస్, కొత్త మోడళ్లతో సహా iOS 26కు సపోర్ట్ చేసే అన్ని డివైజ్‌లకు అందుబాటులో ఉంది.
మీరు ఇన్స్టాల్ చేయాలా? వద్దా? :
బీటా అప్డేట్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఫీచర్లకు అడ్వాన్స్ యాక్సెస్ లభిస్తుంది. కానీ, స్టేబులిటీ ఉండకపోవచ్చు. మీది ప్రైమరీ ఫోన్ అయితే స్టేబుల్ అప్ డేట్ వచ్చేవరకు ఆగడం బెటర్.
