iPhone 15 Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.27వేలు తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!
Apple iPhone 15 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌ను మిస్ అయ్యారా? మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లపై భారీ తగ్గింపును పొందవచ్చు.

Apple iPhone 15 available for with Rs 27k discount ( Image Source : Google )
Apple iPhone 15 Discount : మీరు కొత్త ఐఫోన్ 15 కొనాలని చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌ను మిస్ అయ్యారా? అయితే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ అనే మరో ఫెస్టివల్ సేల్‌తో తిరిగి వచ్చింది. ఈ సేల్ సమయంలో 2023లో లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 15 ధరను భారీగా తగ్గించింది.
లేటెస్ట్ ఐఫోన్ 16 కొనలేని యూజర్లు ఐఫోన్ 15 లేదా ఐఫోన్ 15 ప్లస్‌లను భారీగా తగ్గింపు ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 అసలు లాంచ్ ధర 79,990 నుంచి ఏకంగా రూ. 27వేల వరకు తగ్గించింది. ఈ డీల్ పరిమిత కాలానికి మాత్రమే. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లపై భారీ తగ్గింపును ఎలా పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం.
తక్కువ ధరకే ఐఫోన్ 15 :
ఐఫోన్ 16 లాంచ్ తర్వాత, ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ధరను మరింత తగ్గించింది. స్టాండర్డ్ ఐఫోన్ 15 రిటైల్ ధర రూ.69,900కి పడిపోయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మరింత మెరుగైన డీల్‌ను అందిస్తోంది. బిగ్ షాపింగ్ ఉత్సవ్‌లో భాగంగా, ఐఫోన్ 15 మోడల్ రూ. 57,999కి అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కొనుగోలుదారులు ధరను మరింత తగ్గించుకోవచ్చు.
నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కస్టమర్‌లు అదనంగా రూ. 3వేల తగ్గింపును పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 2వేల వరకు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. దాంతో మొత్తం ధరను రూ. 52,499కి తగ్గింది. ఇప్పటివరకు ఐఫోన్ 15లో అత్యుత్తమ డీల్‌లలో ఒకటిగా నిలిచింది.
ఐఫోన్ 15 ప్లస్‌పై డిస్కౌంట్ ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 16 లాంచ్ తర్వాత అసలు ధర రూ.65,999 ఉండగా, ఐఫోన్ 15 ప్లస్ సేల్ సమయంలో రూ.55,999కి విక్రయిస్తోంది. మీరు నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌లతో ఈ ధరను మరింత తగ్గించవచ్చు. అదనంగా రూ. 4,750 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అర్హత కలిగిన డివైజ్ ఎక్స్షేంజ్ ద్వారా రూ. వెయ్యి డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌లతో ఐఫోన్ 15 ప్లస్‌ను రూ. 60,249 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. పెద్ద స్క్రీన్ కోరుకునే వారికి అద్భుతమైన డీల్ అని చెప్పవచ్చు.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ముఖ్య ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం.
డిస్‌ప్లే :
ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్పోర్ట్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేలు రెండూ, ఐఫోన్ 15 6.1-అంగుళాల స్క్రీన్‌ను అందిస్తోంది. ఐఫోన్ 15 ప్లస్ పెద్ద 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ఓఎల్ఈడీ ప్యానెల్‌లు వైబ్రెంట్ కలర్స్, డీప్ బ్లాక్స్, టాప్ హెచ్‌డీఆర్ బ్రైట్‌నెస్ 1600 నిట్‌ల వరకు అందిస్తాయి.
డిజైన్ :
డిజైన్ పరంగా చూస్తే.. ఐఫోన్ 15 సిరీస్ అల్యూమినియం ఫ్రేమ్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ కలిగి ఉంది. ప్రీమియం డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇందులో డిజైన్ మార్పు డైనమిక్ ఐలాండ్, గత మోడళ్లలోని సాంప్రదాయ నాచ్ స్థానంలో ఉంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో మొదటిసారిగా డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చింది. విభిన్న యాప్‌లు, నోటిఫికేషన్‌లకు అనుగుణంగా ఉండే మల్టీఫేస్ ఇంటర్‌ఫేస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. ఆపిల్ 2 మోడళ్లను రోజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ వంటి 5 పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.
కెమెరా :
ఐఫోన్ 14 కెమెరా సిస్టమ్‌తో పోలిస్తే.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లలో ఒకటి. రెండు ఫోన్‌లు 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లలో కనిపించే 12ఎంపీ సిస్టమ్‌తో పోలిస్తే.. గణనీయమైన అప్‌గ్రేడ్ అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు ఇప్పుడు 2ఎక్స్ టెలిఫోటో ఆప్షన్ కూడా యాక్సస్ పొందవచ్చు. ఫొటో క్వాలిటీ జూమ్ సామర్థ్యాలను అందిస్తుంది.
బ్యాటరీ-ఛార్జింగ్ :
ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రెండింటికీ “రోజంతా బ్యాటరీ లైఫ్” అందిస్తుంది. పెద్ద ఐఫోన్ 15 ప్లస్ పెద్దఫారమ్ ఫ్యాక్టర్ కారణంగా కొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఐఫోన్ 15 సిరీస్‌తో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పొందవచ్చు.