Apple iPhone 15 Price : న్యూ ఇయర్ సేల్ మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ 15పై కిర్రాక్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

Apple iPhone 15 Price : న్యూఇయర్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15పై ఖతర్నాక్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 15 Price : న్యూ ఇయర్ సేల్ మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ 15పై కిర్రాక్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

apple iphone 15 price

Updated On : December 26, 2025 / 3:48 PM IST

Apple iPhone 15 Price : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? మీరు సరసమైన ధరలో ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు విజయ్ సేల్స్ ఇయర్ ఎండ్ సేల్ సమయంలో ఐఫోన్ 15తో సహా మొత్తం ఐఫోన్ రేంజ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 15 దాదాపు రూ.79,900కి ధరకు లాంచ్ అయింది.

డ్యూయల్ కెమెరా సెటప్, ఆపిల్ డిజైన్, డైనమిక్ ఐలాండ్ మరెన్నో ఫీచర్లను అందిస్తుంది. అన్ని డిస్కౌంట్ల తర్వాత ఐఫోన్ దాదాపు రూ.53,500కి కొనుగోలు చేయవచ్చు. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ధర :
విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ధర రూ.56,900గా ఉంది. లాంచ్ ధర కన్నా రూ.23వేలు తగ్గింది. మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.3,500 సేవ్ చేయవచ్చు. తద్వారా ధర దాదాపు రూ.53,400కి తగ్గుతుంది. నెలకు రూ.2,554 నుంచి ఈఎంఐతో మీరు ఈ ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Read Also : January 2026 Holidays : విద్యార్థులు పండగ చేస్కోండి.. 2026 జనవరిలో స్కూళ్లకు 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..

అయితే, మీరు ఫైల్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులుగా అదనపు మొత్తాన్ని చెల్లించాలి. కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుని వర్కింగ్ కండిషన్ బట్టి అదనంగా కొనుగోలుదారులు రూ.427 విలువైన 427 పాయింట్లను కూడా పొందవచ్చు. ఆ తర్వాత ఏదైనా కొనుగలు చేస్తే ఈ పాయింట్లను రీడీమ్ చేసుకుని పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల OLED ప్యానెల్, 60Hz రిఫ్రెష్ రేట్ 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. A16 బయోనిక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 3,349mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అయితే, ఈ ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇవ్వదు. కెమెరా విషయానికొస్తే.. ఈ ఐఫోన్ 48MP మెయిన్ 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 12MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.