Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 15 Pro : ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్‌లో రూ. 99,900 ప్రారంభ ధరతో జాబితా అయింది. ఈ ఐఫోన్ భారత మార్కెట్లో రూ. 1,34,999 వద్ద లాంచ్ అయింది.

Apple iPhone 15 Pro gets Rs 35,099 discount without conditions
Apple iPhone 15 Pro : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 15 ప్రోను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్ కలిగి ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఐఫోన్ 15 ప్రో వెర్షన్‌ను ప్రస్తుతం ఏ ఇతర ఇ-కామర్స్ సైట్ అందించనంత తక్కువ ధరకు అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్‌లో రూ. 99,900 ప్రారంభ ధరతో జాబితా అయింది. ఈ ఐఫోన్ భారత మార్కెట్లో రూ. 1,34,999 వద్ద లాంచ్ అయింది. అంటే వినియోగదారులు ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 35,099 భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఆసక్తికరంగా, ఐఫోన్ ప్రో వెర్షన్‌పై రూ. 10వేలు అదనపు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఐఫోన్ ధర రూ.89,900కి తగ్గుతుంది.
ఎందుకంటే.. ఈ ధరకు విక్రయించే ప్రో వెర్షన్‌ను చాలా అరుదుగా చూస్తారు. ప్రస్తుతానికి, ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్‌ను ఈ ధరకు విక్రయిస్తోంది. ఈ ఆఫర్ ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఇతర బ్యాంక్ కార్డ్‌లపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే, పైన పేర్కొన్న బ్యాంక్ కార్డ్‌లతో పోలిస్తే.. డిస్కౌంట్ మొత్తం తక్కువగా ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ మాదిరిగానే ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ఈ కొత్త ఐఫోన్ 16 ప్రోతో పోల్చినప్పుడు.. ఐఫోన్ 15 ప్రో ఇప్పటికీ ఆకర్షణీయమైన ఆప్షన్ అనే చెప్పవచ్చు.
ఈ రెండు మోడల్‌ల మధ్య ధర వ్యత్యాసం రూ. 20వేలుగా ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో భారత మార్కెట్లో రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 16 ప్రో మెరుగైన అల్ట్రా-వైడ్ కెమెరా, పవర్‌ఫుల్ చిప్, స్పేషియల్ ఆడియో క్యాప్చర్ వంటి మెరుగైన ఆడియో ఫీచర్లను అందిస్తుంది.
చాలా మంది యూజర్లకు ఐఫోన్ 15 ప్రో స్మార్ట్ ఆప్షన్‌గా ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. నాలుగు ఏళ్లకు పైగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందుకుంటూనే ఉంటుంది. అదనంగా, ఐఫోన్ 15 ప్రో పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.
లేటెస్ట్ కెమెరా లేదా ఆడియో అప్‌గ్రేడ్ అవసరం లేని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 15ప్రో లేటెస్ట్ మోడల్‌పై అదనపు ఖర్చు లేకుండా ఐఫోన్ ప్రో సిరీస్‌ను కొనుగోలు చేయొచ్చు. పర్ఫార్మెన్స్ లేదా ఫీచర్లపై రాజీ పడకుండా సరసమైన ధరకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అరుదైన అవకాశాన్ని పొందవచ్చు.
Read Also : Lava Yuva 4 Launch : 50ఎంపీ ప్రైమరీ కెమెరా, భారీ బ్యాటరీతో లావా యువ 4 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!