iPhone 16 Pro : అద్భుతమైన డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 16 ప్రో.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16ప్రో ధర భారీగా తగ్గింది. జియోమార్ట్‌‌లో కొత్త ఐఫోన్ మోడల్ ఎంత తగ్గింపు ధరకే లభిస్తుందంటే?

iPhone 16 Pro : అద్భుతమైన డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 16 ప్రో.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 16 Pro

Updated On : July 10, 2025 / 11:54 PM IST

iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. జియోమార్ట్ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఐఫోన్ 16ప్రో (iPhone 16 Pro) రూ.1,19,900 ధరకు లాంచ్ కాగా, ఈ ఐఫోన్ ఇప్పుడు రూ.1,07,199కి అందుబాటులో ఉంది. తద్వారా రూ.12,701 తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రోపై రూ. 19వేలు డిస్కౌంట్ :
జియోమార్ట్ ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌పై రూ.19వేలు కన్నా భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీ పాత ఐఫోన్‌ లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారుతున్నా ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. ఐఫోన్ 16 ప్రో సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

Read Also : iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌ ఆఫర్లు.. ఐఫోన్ 16పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఏకంగా రూ. 19,901 తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!

ఈ డీల్ ఎలా పొందాలంటే? :
భారత మార్కెట్లో రూ.1,19,900 ధరకు ఆపిల్ ఐఫోన్ 16 ప్రో లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం (JioMart)లో కేవలం రూ.1,07,199 ధరకు లిస్టు అయింది. అంటే.. రూ.12,701 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. BOB బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ.7వేలు తగ్గింపు పొందవచ్చు. దాంతో ఫైనల్ ధర రూ.1,00,199కి తగ్గుతుంది. మొత్తం రూ.19,701 తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు iPhone 16 Pro :
ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్, HDR10 డాల్బీ విజన్‌కు ఫుల్ సపోర్టు అందిస్తుంది. ఆపిల్ లేటెస్ట్ A18 ప్రో చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది.

కెమెరా ఫ్రంట్ సైడ్ పవర్‌ఫుల్ ట్రిపుల్ సెటప్‌ ఉంది. 48MP ప్రైమరీ, 12MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం 12MP ఫ్రంట్ షూటర్ కూడా ఉంది. 25W వైర్డు, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ ఛార్జింగ్‌ సపోర్టుతో 3582mAh బ్యాటరీ కలిగి ఉంది.