Apple iOS 17.1 Update : ఈ ఐఫోన్లలో ఆపిల్ iOS 17.1 అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్ ఫీచర్లు, మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Apple iOS 17.1 Update : రాబోయే iOS 17.1 అప్‌డేట్‌లో ఐఫోన్ 12 రేడియేషన్ లెవల్స్ తగ్గించే ఫీచర్ ఉంటుందని ఆపిల్ ఇప్పటికే ధృవీకరించింది. హై రేడియేషన్ సమస్యలను ఫ్రెంచ్ అధికారులు ముందుగా నివేదించారు.

Apple releasing iOS 17.1 update in October

Apple iOS 17.1 Update : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) కొత్త iOS 17.1 అప్‌డేట్‌ను త్వరలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. రాబోయే ఈ కొత్త అప్‌డేట్స్ లాంచ్ తేదీకి సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఫ్రాన్స్ జాతీయ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ, ఏజెన్సీ నేషనల్ డెస్ ఫ్రీక్వెన్సెస్ (ANFR) ఇటీవలి ప్రకటనలో తేదీని లీక్ చేసింది.

ANFR ప్రకారం.. iOS 17.1 అక్టోబర్ 24 నాటికి ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ (iPhone 12) నుంచి అధిక విద్యుదయస్కాంత రేడియేషన్ ఉద్గారాల గురించి నియంత్రణాధికారులు లేవనెత్తిన ఆందోళనలను అప్‌డేట్ పరిష్కరిస్తుంది.

ఈ డివైజ్ అనుమతించిన దానికంటే ఎక్కువ విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేస్తుందని గుర్తించిన ఫ్రాన్స్ సెప్టెంబర్‌లో ఐఫోన్ 12 అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆపిల్ ఫ్రాన్స్‌లో ఐఫోన్ 12ని అప్‌డేట్ చేయనున్నట్టు అంగీకరించింది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ANFR ధృవీకరించింది. ఈ అప్‌డేట్‌ని ఆపిల్ గత కొన్ని రోజులుగా బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Apple releasing iOS 17.1 update in October

ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని ఫ్రెంచ్ ఐఫోన్ 12 యూజర్లందరికి లేటెస్ట్‌గా అక్టోబర్ 24 నాటికి రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ ఉంది. ఆపిల్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసేవరకు ఐఫోన్ 12 మార్కెటింగ్‌పై నిషేధం అమలులో ఉంటుందని ANFR గుర్తుచేసుకుంది. iOS 17.1 అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆపిల్ రీసెలర్లు, ఆపరేటర్లు ఐఫోన్ 12 సేల్ తిరిగి యాక్టివ్ చేయడానికి గ్రీన్ లైట్ అందిస్తుంది.

iOS 17.1 కొత్త ఫీచర్లు :
రాబోయే iOS 17.1 అప్‌డేట్ అనేక ముఖ్యమైన ఫీచర్లను అందిస్తుంది. మ్యూజిక్ యాప్, ఎయిర్‌డ్రాప్, న్యూ స్టాండ్‌బై ఫీచర్‌లతో సహా iOS పర్యావరణ వ్యవస్థలోని వివిధ అప్లికేషన్‌లకు కొత్త యాక్టివేషన్ కూడా అందిస్తాయి.

Read Also : Apple Unsold iPhones : కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్.. ఆపిల్ స్టోర్లలో విక్రయించని ఐఫోన్లలో ఐఓఎస్ అప్‌డేట్ ఎలా చేస్తుందంటే?

మ్యూజిక్ యాప్ : రాబోయే అప్‌డేట్‌తో యూజర్లు తమకు ఇష్టమైన పాటలు, ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు, ఆర్టిస్టులను స్టార్ ఐకాన్‌తో మార్క్ చేయొచ్చు.

AirDrop : ఐఓఎస్ 17.1 మోడల్ (AirDrop)కి అవుట్ ఆఫ్ రేంజ్ ఆప్షన్ కూడా అందిస్తుంది. రెండు డివైజ్ సమీపంలో లేనప్పటికీ ఫైల్‌లను పంపడానికి స్వీకరించడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్ Wi-Fi లేదా సెల్యులార్ డేటా ద్వారా అందిస్తుంది. పెద్ద ఫైల్‌లను షేర్ చేయడానికి ప్రత్యేకంగా అందిస్తుంది.

Apple releasing iOS 17.1 update

కనెక్టింగ్ కార్డ్‌లు : యూకేలో ఐఫోన్ యూజర్లు రాబోయే అప్‌డేట్‌తో ఎంచుకున్న బ్యాంకుల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను వ్యాలెట్ యాప్‌కి యాడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ యాప్‌ను ఓపెన్ చేయకుండానే వారి లేటెస్ట్ లావాదేవీలు, బ్యాలెన్స్‌లను వీక్షించడానికి అనుమతిస్తుంది.

iOS 17.1 సపోర్టు డివైజ్‌లు :
ఆపిల్ ఐఓఎస్ 17 అందుకున్న అన్ని ఐఫోన్ మోడల్‌లు iOS 17.1 అప్‌డేట్ అందుకోనున్నాయి. ఇందులో ఐఫోన్ల ఫుల్ లిస్ట్ అందుబాటులో ఉంది.

* iPhone XR
* iPhone XS
* iPhone XS Max
* iPhone SE (2nd generation)
* iPhone SE (3rd generation)
* iPhone 11
* iPhone 11 Pro
* iPhone 11 Pro Max
* iPhone 12 mini
* iPhone 12
* iPhone 12 Pro
* iPhone 12 Pro Max
* iPhone 13 mini
* iPhone 13
* iPhone 13 Pro
* iPhone 13 Pro Max
* iPhone 14
* iPhone 14 Plus
* iPhone 14 Pro
* iPhone 14 Pro Max
* iPhone 15
* iPhone 15 Plus
* iPhone 15 Pro
* iPhone 15 Pro Max

Read Also : Itel A05s Smartphone : ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అదిరిందిగా.. దిమ్మతిరిగే ఫీచర్లతో ఐటెల్ A05s ఫోన్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ట్రెండింగ్ వార్తలు