Itel A05s Smartphone : ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అదిరిందిగా.. దిమ్మతిరిగే ఫీచర్లతో ఐటెల్ A05s ఫోన్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Itel A05s Smartphone : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐటెల్ A05s ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో ధర ఎంతంటే?

Itel A05s Smartphone : ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అదిరిందిగా.. దిమ్మతిరిగే ఫీచర్లతో ఐటెల్ A05s ఫోన్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Itel A05s Launched in India Price, Specifications Details in Telugu

Itel A05s Smartphone : భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ (Itel A05s Launch) మోడల్ వచ్చేసింది. ఆక్టా-కోర్ SoC ద్వారా పవర్ అందించే ఈ ఫోన్ 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. USB టైప్-C కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్, 4 కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది.

సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా, ముందు కెమెరాతో వస్తుంది. Itel ఇటీవల MediaTek డైమెన్సిటీ 6080 SoC, 5,000mAh బ్యాటరీతో Itel P55 5Gని లాంచ్ చేసింది. గత సెప్టెంబర్‌లో 12nm Unisoc T616 SoCతో Itel S23+ని కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

Read Also : Best Smartphones in India : అక్టోబర్ 2023లో రూ. 35వేల లోపు ధరకే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

భారత్‌లో Itel A05s ధర ఎంతంటే? :
ఐటెల్ A05s ఫోన్ క్రిస్టల్ బ్లూ, గ్లోరియస్ ఆరెంజ్, మేడో గ్రీన్, నెబ్యులా బ్లాక్ అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ 2GB + 32GB వేరియంట్ ధర రూ. 6,499 నుంచి అందుబాటులో ఉంటుంది.

Itel A05s Launched in India Price, Specifications Details in Telugu

Itel A05s Smartphone Launched in India

ఐటెల్ A05s స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ నానో SIM-సపోర్టు ఉన్న (Itel A05s) ఫోన్ 6.6-అంగుళాల HD+ (1,612 x 720 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేతో 60Hz రిఫ్రెష్ రేట్, 270ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీతో ఆక్టా-కోర్ Unisoc SC9863A SoC ద్వారా పవర్ అందిస్తుంది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి హ్యాండ్‌సెట్ స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ అవుట్-ఆఫ్-ది-బాక్స్ రన్ అవుతుంది.

కెమెరా విభాగంలో.. ఐటెల్ A05s 5MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. LED ఫ్లాష్ యూనిట్‌తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 5MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది. ఐటెల్A05s మోడల్ 4,000mAh బ్యాటరీని అందిస్తుంది.

Itel A05s Launched in India Price, Specifications Details in Telugu

Itel A05s Launched  Price, Specifications

4G LTE, Wi-Fi, బ్లూటూత్, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C కనెక్టివిటీని అందిస్తుంది. భద్రత విషయానికి వస్తే.. ఈ ఫోన్ 9.18mm మందంగా, బ్యాక్ ప్యానల్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Apple Unsold iPhones : కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్.. ఆపిల్ స్టోర్లలో విక్రయించని ఐఫోన్లలో ఐఓఎస్ అప్‌డేట్ ఎలా చేస్తుందంటే?