Apple iPhone Battery : రాబోయే ఆపిల్ ఐఫోన్లలో సరికొత్త టెక్నాలజీ.. ఇకపై బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కూడా చేసుకోవచ్చు..!

Apple iPhone Battery : ఎలక్ట్రానిక్స్‌పై రిమూవబుల్ బ్యాటరీలను తప్పనిసరి చేయాలని భావిస్తున్న ఇన్‌కమింగ్ ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఆపిల్ నిర్ణయం ఉండనున్నట్టు తెలుస్తోంది.

Apple iPhone Battery : రాబోయే ఆపిల్ ఐఫోన్లలో సరికొత్త టెక్నాలజీ.. ఇకపై బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కూడా చేసుకోవచ్చు..!

Apple New Technology to iPhone Battery Replacement Process ( Image Source : Google )

Apple iPhone Battery : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రాబోయే ఐఫోన్ మోడళ్ల కోసం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. భవిష్యత్ ఐఫోన్ మోడల్‌లలో బ్యాటరీని మార్చే ప్రక్రియకు సంబంధించి కొత్త టెక్నాలజీ ఉపయోగించడాన్ని ఆపిల్ అన్వేషిస్తోంది.

నివేదిక ప్రకారం. కుపెర్టినో కంపెనీ తన బ్యాటరీ కేసింగ్ డిజైన్‌ కోసం మళ్లీ పనిచేస్తుందని తెలిపింది. ఐఫోన్ నుంచి బ్యాటరీని డీకప్ చేసే ప్రక్రియను సులభతరం చేసే కంపెనీ ప్రయత్నాలలో భాగమని చెప్పవచ్చు. ఐఫోన్ బ్యాటరీలను మార్చే టెక్నాలజీపై ఆపిల్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రణాళికలను ప్రకటించలేదు.

Read Also :  Whatsapp Events : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూప్ చాట్స్‌లో ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు!

ఐఫోన్ బ్యాటరీ తొలగించాలంటే? :
ఎలక్ట్రానిక్స్‌పై రిమూవబుల్ బ్యాటరీలను తప్పనిసరి చేయాలని భావిస్తున్న ఇన్‌కమింగ్ ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఆపిల్ నిర్ణయం ఉండనున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రణాళికలపై నివేదిక ప్రకారం.. రాబోయే ఐఫోన్లలో బ్యాటరీని రిప్లేస్ చేయడానికి ఆపిల్ కొత్త మెథడ్‌పై పనిచేస్తోందని సమాచారం. “విద్యుత్ ప్రేరిత స్టిక్కీ డీబాండింగ్” టెక్నాలజీతో వినియోగదారులను బ్యాటరీకి ఒక కొద్దిగా విద్యుత్తును అందించడం ద్వారా ఐఫోన్ లోపలి నుంచి బ్యాటరీని తొలగించడానికి అనుమతిస్తుంది.

మెటల్ బాడీతో రానున్న ఐఫోన్ బ్యాటరీలు? :
ఆపిల్ ప్రస్తుత ఐఫోన్ మోడల్‌లు రేకుతో కవర్ చేసిన బ్యాటరీలతో అమర్చి ఉంటాయి. ఈ బ్యాటరీ లేయర్‌పై అంటుకునే స్ట్రిప్స్‌ని ఉపయోగిస్తారు. అంటే.. వినియోగదారులు హ్యాండ్‌సెట్ ఫ్రేమ్ నుంచి యూనిట్‌ను బయటకు తీయడానికి పట్టకార్లను ఉపయోగించాలి. యూజర్ ఫ్రెండ్లీ ప్రక్రియ కాదని గమనించాలి. మీరు ఆపిల్ సపోర్టు పేజీలో దీని గురించి మరింత తెలుసుకోవచ్చు.

నివేదిక ప్రకారం.. కంపెనీ ఫ్యూచర్ ఐఫోన్ బ్యాటరీలను రేకుకు బదులుగా మెటల్‌తో తీసుకురానుంది. కొత్త టెక్నాలజీ బ్యాటరీని సులభంగా రిమూవ్ చేయగలిగేలా అవసరమైతే మరో బ్యాటరీ రిప్లేస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ నుంచి బ్యాటరీని బయటకు తీయడానికి ప్రయత్నించడం కన్నా ఇది చాలా సులభం అయినప్పటికీ, కంపెనీ యూజర్లకు వారి సొంతంగా రిపేర్లు చేయవద్దని సూచనలు చేస్తోంది.

ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో బ్యాటరీ రీప్లేస్ ప్రాసెస్ :
ఈ సంవత్సరం ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఒక మోడల్‌ను సులభమైన బ్యాటరీలతో రీప్లేస్ చేయాలని ఆపిల్ యోచిస్తోందని నివేదిక పేర్కొంది. అయితే టెక్నికల్‌గా వచ్చే ఏడాది అన్ని మోడళ్లలో ఈ తరహా బ్యాటరీ అందుబాటులో ఉండనుంది. గత ఏడాదిలో మెటల్ షెల్‌తో ఐఫోన్ 16 ప్రో బ్యాటరీ ఫొటో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఆపిల్ ఫోన్లను ఆవిష్కరించే వరకు హార్డ్‌వేర్ మార్పులు, అప్‌గ్రేడ్స్ వివరాలను రివీల్ చేయదు. రాబోయే నెలల్లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ సమయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also : CMF Phone 1 Launch : పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో సీఎంఎఫ్ ఫోన్ 1 వస్తోంది.. ఫీచర్లు ఇవేనా? భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?