యురేనస్‌ చుట్టూ ఏలియన్స్ దాగి ఉన్నారా? భూగ్రహం అవతల జీవం ఉందా?

యురేనస్‌ చుట్టూ ఏలియన్స్ దాగి ఉన్నారా? భూగ్రహం అవతల జీవం ఉందా?

Updated On : December 27, 2020 / 1:42 PM IST

Are there aliens hiding around Uranus : ఏలియన్స్ ఉన్నారా? సౌర వ్యవస్థలో భూగ్రహం మాదిరిగా ఇతర గ్రహాలపై జీవం ఉందా? విశ్వంలో మనమేనా? మనతోపాటు ఇతర గ్రహాలవారు ఎవరైనా జీవిస్తున్నారా? అంతుచిక్కని ప్రశ్న.. నిజంగా ఏలియన్స్ ఉన్నారంటే? కచ్చితమైన ఆధారాలు ఇప్పటికీ లేవని అంటున్నారు సైంటిస్టులు. శతాబ్దాలు, దశబ్దాల నుంచి ఏలియన్స్ మనుగడ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. సౌర వ్యవస్థలో గ్రహాంతర జీవితాన్ని కనుగొనడం నమ్మశక్యం కాని విషయమే కావొచ్చు. కానీ, సైంటిస్టులు మన సౌర వ్యవస్థలోని కొన్ని గ్రహాల్లో మంచునీటి మూలం ఆధారంగా జీవం పుట్టే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

బృహస్పతి, శని వంటి గ్రహాల చుట్టూ ఉన్న అతిశీతలమైన ప్రాంతాల్లో జీవం పుట్టుక ఉండొచ్చునని అంటున్నారు. ఆ గ్రహాల్లో ఉపరితలం కింద ద్రవపు నీరు ఉందని చెబుతున్నారు. మంచుతో కూడిన ఈ నీరు అంతరిక్షంలోకి రోజూ విరజిమ్ముతూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ, ఇప్పటివరకూ అక్కడికి వెళ్లి చూసింది లేదు. అయితే ఇప్పుడు యురేనస్ గ్రహం చుట్టూ భారీగా మంచు ఆవరించి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే.. అక్కడ జీవం పుట్టే అవకాశం ఉండొచ్చునని అంటున్నారు. అదేగాని నిజమైతే యురేనస్ లో గ్రహాంతరవాసులు (ఏలియన్స్) మనుగడ సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.

యురేనస్ గ్రహం చుట్టూ ఏలియన్స్ దాగి ఉన్నారని సైంటిస్టులు భావిస్తున్నారు. యురేనస్ గ్రహం చుట్టూ ఉన్న కొన్ని చంద్రులను అతి దగ్గరగా పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. యురేనస్ లో ఉండే చంద్రులు ఎక్కువగా సగం మంచునీరు, మిగతా సగం రాళ్లతో నిండి ఉంటాయి. ఈ చంద్రుల్లో మిరందా, ఏరియల్, ఉబ్రెయిల్, టైటానియా, ఒబ్రెయిన్ అన్నింటిల్లో మంచు, రాళ్లతో మిక్స్ అయి ఉంటాయి. వీటి ఉపరితలాల్లో ఎక్కడైనా ఏదైనా జీవం దాగి ఉందా? అనే కోణంలో సైంటిస్టులు పరిశోధిస్తున్నారు.

యురేనస్ గ్రహం చుట్టూ ఉన్న మంచు చంద్రుల్లో ద్రవపు నీరు ఉందో లేదో ధ్రువీకరించడం సాధ్యపడొచ్చునని రీసెర్చర్లు విశ్వసిస్తున్నారు. ఇందుకోసం ఒక మిషన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మిషన్ ద్వారా యురేనస్ చుట్టూ మ్యాగ్నటిక్ ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయో గుర్తించనున్నారు. యురేనస్ చంద్రుల ఉపరితలంపై నీరు ఉంటే.. కచ్చితంగా అక్కడ అధిక మొత్తంలో ఉప్పు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. దీని కారణంగా వాటి ఉపరితలాలపై సొంత మ్యాగ్నటిక్ ఫీల్డ్స్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సౌర వ్యవస్థలో అన్ని చోట్ల జీవం మనుగడ సాధ్యమా? కాదా అనేది యురేనస్ మిషన్‌ ఆధారంగా సైంటిస్టులు తేల్చేయనున్నారు.