Asus ROG Phone 8 Series Sale : విజయ్ సేల్స్‌లో అసూస్ ROG 8 సిరీస్ గేమింగ్ ఫోన్లపై సేల్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతంటే?
Asus ROG Phone 8 Sale : విజయ్ సేల్స్‌లో అసూస్ రెండు గేమింగ్ స్మార్ట్‌ఫోన్లపై సేల్ ఆఫర్ చేస్తోంది. అసూస్ ROG ఫోన్ 8 సిరీస్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Asus ROG Phone 8 Series Goes on Sale in India via Vijay Sales
Asus ROG Phone 8 Series Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్‌లో భారత మార్కెట్లో అసూస్ ROG ఫోన్ 8 సిరీస్ సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేకించి అసూస్ ROG ఫోన్ 8, ROG ఫోన్ 8 ప్రో అనే రెండు మోడల్స్ ఇప్పుడు భారత ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను (CES 2024)లో ఆవిష్కరించగా.. ఆ తరువాత భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ROG ఫోన్ 8 సిరీస్‌లోని రెండు హ్యాండ్‌సెట్‌లు క్వాల్‌కామ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తాయి. 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో పాటు నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు కంపెనీ ఏరోయాక్టివ్ కూలర్ ఎక్స్ స్నాప్-ఆన్ కూలింగ్ ఫ్యాన్‌కి కూడా సపోర్టు ఇస్తాయి.
భారత్‌లో అసూస్ ROG ఫోన్ 8 సిరీస్ ధర వివరాలు :
అసూస్ ROG ఫోన్ 8 ధర రూ. 94,999 ఉండగా.. ఈ హ్యాండ్‌సెట్ సింగిల్ 16జీబీ+512జీబీ ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. అదే సమయంలో అసూస్ ROG ఫోన్ 8 ప్రో ధర రూ. 1,19,999, 24జీబీ ర్యామ్ 1టీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో లభిస్తుంది. రెండోది ఏరోయాక్టివ్ కూలర్ ఎక్స్ కూలింగ్ ఫ్యాన్‌తో వస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ఫాంటమ్ బ్లాక్ షేడ్‌లో అందుబాటులో ఉన్నాయి. అసూస్ ROG ఫోన్ 8 సిరీస్ హ్యాండ్‌సెట్‌లను ఇప్పుడు భారత మార్కెట్లో ఆసుస్ రిటైల్ పార్టనర్ విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
అసూస్ ROG ఫోన్ 8 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
తైవాన్ ఆధారిత టెక్నాలజీ కంపెనీ లేటెస్ట్ ROG ఫోన్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14పై కంపెనీ (ROG UI)తో రన్ అవుతాయి. రెండూ 6.78-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) శాంసంగ్ అమోల్డ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో 165హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 2,500నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు క్వాల్‌కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 3 చిప్‌తో రన్ అవుతాయి. గరిష్టంగా 24జీబీ వరకు ఎల్ పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఆప్షన్ కలిగి ఉన్నాయి.

Asus ROG Phone 8 Series Sale
అసూస్ ROG ఫోన్ 8, ROG ఫోన్ 8 ప్రో రెండింటిలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందచవ్చు. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 1/1.56-అంగుళాల ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32ఎంపీ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు సెన్సార్ టెలిఫోటో కెమెరాతో సెల్ఫీలను క్యాప్చర్ చేయడం లేదా వీడియో కాల్‌లు చేయడానికి లేదా స్వీకరించడానికి 12ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తాయి.
వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు.. మరెన్నో ఆప్షన్లు :
మీరు అసూస్ ROG ఫోన్ 8 సిరీస్‌లో 1టీబీ వరకు స్టోరేజీని పొందవచ్చు. అదే సమయంలో, రెండు ఫోన్‌లు 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీలకు సపోర్టు ఇస్తాయి. ఈ ఫోన్‌లు 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంటాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
అసూస్ ROG ఫోన్ 8, ROG ఫోన్ 8 ప్రో రెండూ క్యూఐ 1.3 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పాటు 65డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయగల 5,000ఎంఎహెచ్ బ్యాటరీలను ప్యాక్ చేస్తాయి. హై-ఎండ్ మోడల్ కంపెనీ ఏరోయాక్టివ్ కూలర్ ఎక్స్ కూలింగ్ ఫ్యాన్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు 163.8×76.8×8.9ఎమ్ఎమ్ కొలతలు, 225గ్రాముల బరువు, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది.