Best Budget Smartwatches : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.5వేల లోపు ధరలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లివే..!

Best Budget Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 మరికొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. రూ.5వేల లోపు ధరలో కొన్ని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Best Budget Smartwatches : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.5వేల లోపు ధరలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లివే..!

Best Budget Smartwatches Under Rs. 5k During Amazon Great Republic Day Sale 2024

Best Budget Smartwatches : ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 జనవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, బ్లూటూత్ స్పీకర్‌లను డిస్కౌంట్ ధరలతో అందించనుంది. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు జనవరి 12 అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే సేల్‌కి ప్రత్యేకమైన ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు.

Read Also : MG Astor 2024 Launch : కొంటె ఇలాంటి కారు కొనాల్సిందే.. రూ.9.98 లక్షలకు ఎంజీ ఆస్టర్ 2024 వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఈ సేల్‌కు ముందు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అనేక ప్రొడక్టులపై అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను ప్రారంభించింది. మీరు స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. అమెజాన్ పెద్ద డిస్‌ప్లేలు, బ్లూటూత్ కనెక్టివిటీ, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో సరసమైన ధర ట్యాగ్‌లతో బోట్, ఫైర్-బోల్ట్, నాయిస్ వంటి ప్రముఖ కంపెనీల నుంచి మల్టీ వేరబుల్ డివైజ్‌లను జాబితా చేసింది.

స్మార్ట్‌వాచ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు :
2024 సంవత్సరంలో రాబోయే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఫైర్-బోల్ట్ రింగ్ 3, బోట్ ఎక్స్‌టెండ్, నాయిస్ పల్స్ 2 మాక్స్ వంటి బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు ధర తగ్గింపులను పొందే అవకాశం ఉంది. 1.96-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో అమేజ్‌ఫిట్ పాప్ 3ఎస్ సేల్ సమయంలో ధర తగ్గింపును పొందనుంది. అదేవిధంగా, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 3 తగ్గింపు పొందనుంది. అసలు ధర రూ. 7,999 నుంచి భారీగా తగ్గే అవకాశం ఉంది.

Best Budget Smartwatches Under Rs. 5k During Amazon Great Republic Day Sale 2024

Best Budget Smartwatches 

10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ :
సాధారణ తగ్గింపులతో పాటు, అమెజాన్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇంకా, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్, దాదాపు 2,200 వెల్ కమ్ రివార్డులను అందిస్తోంది.

ఆసక్తిగల కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఈఎంఐ ఆప్షన్లు, కూపన్ డిస్కౌంట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. రూ. 5వేల లోపు అత్యుత్తమ స్మార్ట్‌వాచ్‌ల జాబితాలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ తుది విక్రయ ధరలను ఇంకా వెల్లడించలేదు. కాబట్టి సేల్ లైవ్ అయిన తర్వాత ఈ ధరలు మారే అవకాశం ఉంది.

Read Also : Nothing Phone 2 Discount : కొత్త ఫోన్ కావాలా? నథింగ్ ఫోన్ 2పై ఏకంగా రూ.10వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?