Nothing Phone 2 Discount : కొత్త ఫోన్ కావాలా? నథింగ్ ఫోన్ 2పై ఏకంగా రూ.10వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 2 Discount : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే 2024 సేల్ సందర్భంగా నథింగ్ ఫోన్ 2 రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 34,999కి తగ్గింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Nothing Phone 2 Discount : కొత్త ఫోన్ కావాలా? నథింగ్ ఫోన్ 2పై ఏకంగా రూ.10వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 2 will be available at Rs 10,000 discount

Nothing Phone 2 Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ సొంత బ్రాండ్ నథింగ్ ఫోన్ (2)పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే 2024 సేల్ ఇంకా ప్రకటించలేదు. ఫ్లిప్‌కార్ట్ సొంత రిపబ్లిక్ డే సేల్‌ జనవరి 14 నుంచి ప్రారంభమవుతుంది.

Read Also : Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.50వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సొంతం చేసుకోండి

అంతకంటే ముందుగానే.. నథింగ్ ఫోన్ (2) వేరియంట్‌ల కోసం ప్రత్యేకంగా భారీ తగ్గింపును నథింగ్ వెల్లడించింది. కొత్త ఆఫర్ ప్రకారం.. నథింగ్ ఫోన్ (2) 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.44,999 ఉండగా.. రూ.10వేల తగ్గింపుతో రూ.34,999కి అందుబాటులో ఉంటుంది.

అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లకు నథింగ్ కూడా ప్రత్యేక రూ. 2వేలు తగ్గింపును ప్రకటించింది. దాంతో పాటు, కస్టమర్లు మరొక స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడింగ్ చేసినప్పుడు రూ. 3వేలు బోనస్‌కు కూడా పొందవచ్చు. నథింగ్ ప్రకారం.. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ 2024 రిపబ్లిక్ డే సేల్ వ్యవధికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Nothing Phone 2 will be available at Rs 10,000 discount

Nothing Phone 2 discount

నథింగ్ ఫోన్ 2 డీల్ పొందాలంటే? :
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, క్లీనర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. స్పెసిఫికేషన్‌ల పరంగా పెద్ద అప్‌గ్రేడ్ కలిగి ఉంటుంది. అయినప్పటికీ, భారత్ వంటి ధర-సెన్సిటివ్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ (2) ధర కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా, నథింగ్ ఫోన్ 2 బెస్ట్ డివైజ్ కాగా.. దీని అసలు ధర రూ. 44,999 కన్నా కొంచెం తక్కువగా ధరకు పొందవచ్చు. అంటే.. ఇప్పుడు, రూ. 10వేల తగ్గింపుతో నథింగ్ ఫోన్ 2 రూ. 34,999 వద్ద సొంతం చేసుకోవచ్చు.

నథింగ్ ఫోన్ 2 మోడల్ నథింగ్ ఓఎస్ 2.5, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, 50ఎంపీ + 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు, 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ, 4,700ఎంఎహెచ్ బ్యాటరీ ద్వారా పవర్ అందిస్తుంది. 6.7-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డార్క్ గ్రే అండ్ వైట్ అనే రెండు రంగుల వేరియంట్‌లలో వస్తుంది.

Read Also : MG Astor 2024 Launch : కొంటె ఇలాంటి కారు కొనాల్సిందే.. రూ.9.98 లక్షలకు ఎంజీ ఆస్టర్ 2024 వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?