Best Mobile Phones 2024 : ఈ డిసెంబర్‌లో రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Mobile Phones 2024 : ప్రస్తుతం మార్కెట్లో డిసెంబర్ 2024లో రూ. 40వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు టాప్ ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Best Mobile Phones 2024 : ఈ డిసెంబర్‌లో రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best mobile phones in India

Updated On : December 29, 2024 / 11:19 PM IST

Best Mobile Phones 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రతి నెలా సరికొత్త ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్ కొనాలో ఎంచుకోవడం కష్టమే.
ప్రస్తుతం మార్కెట్లో డిసెంబర్ 2024లో రూ. 40వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు టాప్ ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ జాబితాలో వన్‌ప్లస్, రియల్‌మి, మోటోరోలా, వివో వంటి బ్రాండ్‌ల ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

డిసెంబర్ 2024లో రూ. 40వేల లోపు బెస్ట్ ఫోన్‌ల జాబితా :
1) వన్‌ప్లస్ 12ఆర్ :
వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ ప్రోఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను ఎల్టీపీఓ4.0తో కలిగి ఉంది. డైనమిక్ 1-120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్, అడ్రినో 740 జీపీయూ హుడ్ కింద ఉన్నాయి. గరిష్టంగా 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని అందిస్తుంది. 5,500mAh బ్యాటరీ 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జర్‌తో వేగవంతమైన ఛార్జింగ్‌ని అనుమతిస్తుంది.

Read Also : Income Tax Calendar 2025 : పన్నుచెల్లింపుదారులకు అలర్ట్.. వచ్చే జనవరికి సంబంధించి కీలక గడువు తేదీలివే..!

కెమెరా సెటప్ 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో కూడిన 50MP సోనీ IMX890 ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం, 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరా యాప్ ఇంటర్వెల్ షూటింగ్, నైట్‌స్కేప్, ప్రో మోడ్, మూవీ మోడ్ మరియు మరిన్నింటిని అందిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో NFC, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, GPS మరియు డ్యూయల్ నానో-సిమ్ స్లాట్‌లు ఉన్నాయి.

2) వివో టీ3 అల్ట్రా :
వివో టీ3 అల్ట్రా 5జీ 1.5కె రిజల్యూషన్ (2800 x 1260)తో 6.78-అంగుళాల 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 1.07 బిలియన్ రంగుల వరకు రెండరింగ్ చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14లో రన్ అవుతుంది.

హుడ్ కింద వివో టీ3 అల్ట్రా మీడియాటెక్ డైమన్సిటీ 9200+ చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. వివో ఫోన్ 1.6 మిలియన్లకు మించి ఆకట్టుకునే (Antutu) బెంచ్‌మార్క్ స్కోర్‌ను సాధించిందని పేర్కొంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5500mAh బ్యాటరీని అందిస్తుంది.

కెమెరా ఫ్రంట్ సైడ్ వివో టీ3 అల్ట్రా బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 50ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. లో-లైటింగ్ పరిస్థితుల్లో మెరుగైన ఫోటోగ్రఫీ కోసం వివో సైన్ ‘ఆరా రింగ్ లైట్’ కూడా ఇందులో ఉంది.

3) రియల్‌మి జీటీ 6 :
రియల్‌మి జీటీ 6లో 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే 6,000 నిట్స్ గరిష్ట ప్రకాశం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. గ్రాఫిక్స్ హెవీ టాస్క్‌ల నిర్వహణకు అడ్రినో 735 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు 4.0 స్టోరేజీకి సపోర్టు అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 షూటర్, 50ఎంపీ సోనీ జేఎన్5 టెలిఫోటో లెన్స్, 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్355 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 4కే వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇచ్చే 32ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 షూటర్ ఉంది.

4) మోటోరోలా ఎడ్జ్ 50ప్రో :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 5జీ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇందులో 2.63GHz సింగిల్ కోర్, 2.4GHz ట్రై-కోర్, 1.8GHz క్వాడ్-కోర్ కాన్ఫిగరేషన్‌తో కూడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ సెటప్ ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో వినియోగదారులు మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్, అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. మోటోరోలా ఫోన్ 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ పీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

గేమింగ్, స్ట్రీమింగ్ రెండింటికీ అనువైనది. అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. ఫొటోగ్రఫీ ఔత్సాహికులు డివైజ్ 50ఎంపీ+ 13ఎంపీ+10ఎంపీ ట్రిపుల్-కెమెరా రేంజ్ పొందవచ్చు. అయితే, 50ఎంపీ ఫ్రంట్ కెమెరా హై క్వాలిటీ సెల్ఫీలను అందిస్తుంది. 4500mAh బ్యాటరీ, టర్బో పవర్ ఛార్జింగ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో పాటు, పవర్ మేనేజ్‌మెంట్, స్విఫ్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.

Read Also : WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. త్వరలో గూగుల్ ఫొటోలను రివర్స్ సెర్చ్ చేయొచ్చు.. ఇదేలా ఎలా పనిచేస్తుందంటే?