boAt Lunar Pro LTE : జియో ఇ-సిమ్ సపోర్టుతో బోట్ లూనార్ ప్రో ఎల్టీఈ స్మార్ట్‌వాచ్ వస్తోంది.. మీ దగ్గర ఫోన్ లేకున్నా కాల్స్ చేయొచ్చు..!

boAt Lunar Pro LTE Smartwatch : రిలయన్స్ జియో ఇ-సిమ్ టెక్నాలజీతో బోట్ కంపెనీ నుంచి లూనార్ ప్రో ఎల్‌టీఈ స్మార్ట్‌వాచ్ వచ్చేస్తోంది. మీ ఫోన్ వెంట తీసుకువెళ్లకపోయినా ఈజీగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

boAt Lunar Pro LTE Smartwatch : ప్రముఖ భారత ఆధారిత వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ నుంచి సరికొత్త లూనార్ ప్రో ఎల్‌టిఇ స్మార్ట్‌వాచ్‌ వచ్చేస్తోంది. ప్రత్యేకించి రిలయన్స్ జియో ఇ-సిమ్ టెక్నాలజీతో ఈ కొత్త లూనర్ ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్ కానుంది. వేరబుల్ బ్రాండ్ లూనర్ ప్రో ఎల్టీఈ స్మార్ట్‌వాచ్‌ కోసం టెలికాం దిగ్గజం జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వాచ్ నిరంతరాయమైన కనెక్టివిటీ, ఫుల్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. వినియోగదారులు కనెక్ట్ అయ్యే విధానంలో జియో ఇసిమ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

ట్రావెల్ చేసే యూజర్లకు బెస్ట్ ఆప్షన్ :
ఈ కూల్ టీమ్-అప్ అంటే.. మీ ఫోన్‌ని ఎక్కడికైనా తీసుకెళ్లకుండానే ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. బోట్ లూనర్ ప్రో ఎల్‌టీఈ స్మార్ట్‌వాచ్‌తో యూజర్ల మధ్య కనెక్టివిటీని అవాంతరాలు లేకుండా అందించనుంది. ఇసిమ్‌తో మీ ఫోన్‌ని తీసుకెళ్లకుండానే కాల్‌లు చేయవచ్చు. మెసేజ్‌లు పంపవచ్చు. నిరంతరం కనెక్ట్ అయి ఉండవచ్చు. మీ ఫోన్ బ్యాటరీ లేదా సిగ్నల్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఎల్లప్పుడూ ట్రావెల్ చేసే యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Read Also : Apple iPhone 14 Plus Discount : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. రూ. 32,400 కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

బోట్ వాచ్‌లో మరెన్నో హెల్త్ ఫీచర్లు :
లూనార్ ప్రో ఎల్‌టీఈలో ఇంటర్నల్ జీపీఎస్ కనెక్ట్ అయి ఉంటుంది. మీరు రన్నింగ్, సైక్లింగ్ లేదా హైకింగ్ చేస్తుంటే.. ఈ వాచ్ మీ మార్గాలను కచ్చితంగా ట్రాక్ చేయగలదు. మీరు ఎంత దూరం వెళ్ళారు అనేది కూడా మార్గాన్ని చూపుతుంది. బహిరంగ కార్యకలాపాలను ఇష్టపడే వ్యక్తులకు ఇది బెస్ట్ వాచ్ అని చెప్పవచ్చు. అదనంగా, స్పష్టమైన 1.39-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా చాలా సులభంగా డిస్‌ప్లే చూడవచ్చు.

మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్నట్లయితే.. మీ ఆరోగ్యానికి మంచిది కాదని, కొద్దిసేపు అయినా లేచి నడవాలని మీకు గుర్తు చేస్తుంది. మీ యాక్టివిటీని ట్రాక్ చేసేందుకు అన్ని ఫీచర్లు ఉన్నాయి. లూనార్ వాచ్‌లో హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఫిట్‌నెస్ ట్రాకర్ వంటి టూల్స్ కూడా ఉన్నాయి. మీ ఆరోగ్యం, ఫిట్‌నెస్ లక్ష్యాలపై నిఘా ఉంచడంలో సాయపడుతుంది.

boAt Lunar Pro LTE smartwatch

త్వరలో రిటైల్ స్టోర్లలోకి అందుబాటులోకి :
జియోతో భాగస్వామ్యంపై బోట్ సహ వ్యవస్థాపకుడు, సీఎమ్ఓ అమన్ గుప్తా మాట్లాడుతూ.. ‘ఎల్‌టీఈ స్మార్ట్‌వాచ్ తయారీకి జియోతో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికీ టాప్ టెక్నాలజీని అందించడంలో సాయపడుతుంది. ఈ వాచ్ కనెక్ట్ అయ్యే విధానాన్ని మారుస్తుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. జియో బలమైన 4జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే ఈ ఎల్‌టీఈ స్మార్ట్‌వాచ్‌లో బోట్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని జియో ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఈ భాగస్వామ్యం జియో కస్టమర్‌లకు సరికొత్త టెక్నాలజీని అందించడంలో సాయపడుతుందని అన్నారు. బోట్ లూనర్ ప్రో ఎల్‌టీఈ స్మార్ట్‌వాచ్ త్వరలో రిటైల్ స్టోర్‌లలోకి రానుంది. ఈ లాంచ్ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. భారత మార్కెట్లో స్మార్ట్ వాచ్ ఎప్పుడు అందుబాటులోకి రానుందని అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు.

Read Also : Tata Car Discounts 2023 : ఈ డిసెంబర్‌లో టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. సఫారి టు టిగోర్‌ వేరియంట్లపై రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు!

ట్రెండింగ్ వార్తలు