Apple iPhone 14 Plus Discount : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. రూ. 32,400 కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

Apple iPhone 14 Plus Discount : ఫ్లిప్‌కార్ట్ వారి బిగ్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ను భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. కొన్ని షరతులలో ఈ ఐఫోన్ ధర రూ. 32,400 కన్నా తక్కువ వరకు కొనుగోలు చేయొచ్చు.

Apple iPhone 14 Plus Discount : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. రూ. 32,400 కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

Apple iPhone 14 Plus available under Rs 40,000 on Flipkart

Apple iPhone 14 Plus Discount : మీరు ఐఫోన్‌ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఇప్పుడు, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ కొన్ని ప్రముఖ ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పాటు ఐఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

ముఖ్యంగా ఐఫోన్ 14 ప్లస్‌పై ఆకర్షణీయమైన డీల్ అందిస్తోంది. పెద్ద స్క్రీన్‌తో ఐఫోన్ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. అదే.. ఐఫోన్ ప్రో మోడల్‌ కొనాలంటే లక్షకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌లతో, మీరు ఈ డివైజ్‌ను రూ. 32,400 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 15 Discount : ఐఫోన్ 14 కన్నా అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డీల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.66,900గా జాబితా అయింది. అసలు ధర కన్నా దాదాపు 13వేలు తక్కువ. అయితే, మీరు పాత ఐఫోన్ 13ని కలిగి ఉంటే.. మీ ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూను రూ. 34,500 వరకు పొందవచ్చు. అంటే.. మీ కొత్త ఫోన్ ధరను రూ. 32,400కి తగ్గిస్తుంది.

ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ కూడా ఐఫోన్ 14కి మాదిరిగానే ఉంటుంది. కానీ. ఇందులో పెద్ద తేడా ఉంది. ఫోన్లలో డిస్‌ప్లే పరిమాణంలో వ్యత్యాసం ఉంటుంది. ఐఫోన్ 14 ప్లస్ పెద్ద 6.7-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పరిమాణంలో ఉంటుంది. కానీ, వేరే మోడల్ నాచ్‌తో ఉంటుంది. ఇందులో ఐఫోన్ ప్రో మాక్స్ వైడ్ నాచ్‌ను కలిగి ఉంది.

Apple iPhone 14 Plus available under Rs 40,000 on Flipkart

Apple iPhone 14 Plus

ఐఫోన్ 14 ప్లస్ డైనమిక్ ఐలాండ్ స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. ఒకవేళ, మీరు పెద్ద స్క్రీన్‌తో కూడిన ఐఫోన్ కోసం చూస్తుంటే.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదని భావిస్తే.. ఐఫోన్ 14 ప్లస్ మీకు సరైన ఎంపిక కావచ్చు. హుడ్ కింద, ఐఫోన్ 14 ప్లస్ ఏ15 బయోనిక్ చిప్ మెరుగైన వెర్షన్‌తో రన్ అవుతుంది. ఐఫోన్ 13 లైనప్‌లో కూడా ఇదే ఫీచర్లు ఉంటాయి. తద్వారా వేగవంతమైన పర్ఫార్మెన్స్ పొందవచ్చు.

కెమెరా విషయానికొస్తే.. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 12ఎంపీ ప్రధాన కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 కెమెరా పర్ఫార్మెన్స్ మునుపటి మోడల్‌ల కన్నా మెరుగ్గా ఉందని పేర్కొంది, మీరు అద్భుతమైన ఫొటోలు, వీడియోలను సులభంగా క్యాప్చర్ చేయవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండూ ఐఓఎస్ ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉండటంతో వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

Read Also : Apple iPhone Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 8వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?