BSNL Flash Sale : BSNL ఫ్లాష్ సేల్ ఆఫర్లు.. ఇలా రీఛార్జ్ చేస్తే.. 400GB హైస్పీడ్ డేటా పొందొచ్చు.. డోంట్ మిస్..!

BSNL Flash Sale : జూన్ 28 నుంచి BSNL యూజర్లు రూ. 400 విలువైన కొత్త స్పెషల్ డేటా రీఛార్జ్ ప్యాక్‌ అందిస్తోంది.

BSNL Flash Sale : BSNL ఫ్లాష్ సేల్ ఆఫర్లు.. ఇలా రీఛార్జ్ చేస్తే.. 400GB హైస్పీడ్ డేటా పొందొచ్చు.. డోంట్ మిస్..!

BSNL Flash Sale

Updated On : July 1, 2025 / 11:40 AM IST

BSNL Flash Sale : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. అతి త్వరలో BSNL క్వాంటం 5G బ్యానర్ కింద కమర్షియల్ 5G సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ రంగ టెల్కో టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 90వేల టవర్లు అందుబాటులో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ లిమిటెడ్-టైమ్ ప్రమోషనల్ “ఫ్లాష్ సేల్” ఈవెంట్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా GBకి రూ.1 చొప్పున 400GB హై-స్పీడ్ 4G డేటాను అందిస్తోంది.

BSNL యూజర్ల కోసం కొత్తగా రూ. 400 స్పెషల్ డేటా రీఛార్జ్ ప్యాక్‌ను అందిస్తోంది. 40 రోజుల వ్యాలిడిటీతో 400GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ జూలై 1 వరకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ప్రస్తుత యాక్టివ్ ప్లాన్‌తో కలిపి డేటా రీఛార్జ్ కొనుగోలు చేయాలి. కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ ఉండవు. కేవలం 400GB డేటా మాత్రమే వస్తుంది. 400GB తర్వాత స్పీడ్ 40kbpsకి తగ్గుతుంది.

Read Also : Bank Holidays July : మీకు బ్యాంకులో పని ఉందా? జూలైలో మొత్తం 13 రోజులు సెలవులు.. ఏయే రోజుల్లో పనిచేయవంటే? ఫుల్ లిస్ట్ మీకోసం..!

ఇటీవలే BSNL 5G సర్వీసులను వాణిజ్య, సంస్థ క్వాంటం 5G లేదా Q-5G పేరుతో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రోల్ అవుట్ ప్రారంభంలో భాగంగా BSNL ఎంపిక చేసిన సర్కిల్స్, నగరాల్లోని ఎంటర్‌ప్రైజెస్ కోసం FWA లేదా క్వాంటమ్ 5G FWA అనే​ స్థిర వైర్‌లెస్ యాక్సెస్ సర్వీసును ఆవిష్కరించింది. వినియోగదారులకు సిమ్ కార్డ్ అవసరం లేకుండా హై-స్పీడ్ కనెక్టివిటీకి యాక్సెస్ లభిస్తుంది.

ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, భోపాల్, కోల్‌కతా, పాట్నా, హైదరాబాద్, చెన్నైలలో కమర్షియల్ ఉపయోగం కోసం 5G ట్రయల్స్‌ను రన్ చేస్తోంది. BSNL 5G నెక్ట్స్ జనరేషన్ టెలికాం నెట్‌వర్క్‌ రాబోతుంది. రాబోయే కొన్ని నెలల్లో మరింతగా విస్తరించనుంది. దేశవ్యాప్తంగా 5G సేవల కోసం BSNL 4G టవర్లను రెట్టింపు చేస్తోంది. 5G రెడీ టవర్లు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో లక్ష టవర్లను అందించే లక్ష్యంతో బీఎస్ఎన్ఎల్ ముందుకు సాగుతోంది.