BSNL Learners Plan : స్టూడెంట్స్ కోసం BSNL కొత్త ప్లాన్.. 100GB హైస్పీడ్ డేటా, ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు.. 2 రోజులు మాత్రమే.. ధర జస్ట్ ఎంతంటే?
BSNL Learners Plan : బీఎస్ఎన్ఎల్ లెర్నర్స్ ప్లాన్ ద్వారా 100GB డేటా, ఫ్రీ కాల్స్ జస్ట్ రూ. 9కే అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.
BSNL Learners Plan
BSNL Learners Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్లపై యూజర్లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ కంపెనీ తక్కువ ధరకే అద్భుతమైన బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది.
స్పెషల్ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను అందిస్తోంది. ఉదాహరణకు.. ఇటీవలే బాలల దినోత్సవం రోజున బీఎస్ఎన్ఎల్ విద్యార్థుల కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్, 100GB డేటాను అందించే స్పెషల్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ కేవలం 2 రోజుల్లో ముగియనుంది. బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకునేందుకు యూజర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్.. ఈ రీఛార్జ్ ప్లాన్ ఫీచర్ల గురించి పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ సరసమైన రూ. 251 లెర్నర్స్ ప్లాన్ :
ఈ సరసమైన బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251తో కంపెనీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ప్రకటించింది.
వ్యాలిడిటీ : విద్యార్థుల కోసం స్పెషల్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది.
కాలింగ్ : వినియోగదారులు భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ పొందుతారు.
డేటా : ఇందులో 100GB హై-స్పీడ్ డేటా ఉంటుంది. విద్యార్థులకు మెయిన్ బెనిఫిట్స్ ఏమిటంటే.. డేటా వినియోగానికి రోజువారీ లిమిట్ లేదు.
SMS : వినియోగదారులు రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు.
గడువు తేదీ ఇదే :
ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ ప్రైవేట్ కంపెనీలు అందించే ప్లాన్లతో పోలిస్తే చాలా సరసమైనది. వినియోగదారులకు అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ సరసమైన రీఛార్జ్ ఆఫర్ కోసం బీఎస్ఎన్ఎల్ గడువు విధించింది. ఈ ప్లాన్‌ను పొందేందుకు వినియోగదారులు డిసెంబర్ 13, 2025 లోపు తమ నంబర్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.
బీఎస్‌ఎన్‌ఎల్ వార్షిక ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ సరసమైన 365 రోజుల ప్లాన్ విషయానికి వస్తే.. ధర రూ.2,399కు అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో తన 5G సర్వీసును ప్రారంభించనుంది. బహుశా ఢిల్లీ, ముంబైతో ప్రారంభించనుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ :
వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ రావడంతో బీఎస్ఎన్ఎల్ పాపులర్ రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో 30 రోజుల పాటు ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్ ఉన్నాయి.
