Free Internet : ఫ్రీగా ఇంటర్నెట్ సేవలు..ఎన్ని నెలలు తెలుసా ?
ఇంటర్నెట్ సేవలు ఉచితమా ? అని నోరెళ్లెబెడుతున్నారా ? కానీ మీరు విన్నది నిజమే. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఆఫర్లు ప్రకటిస్తోంది.

Bsnl
BSNL Offers : ఇంటర్నెట్ సేవలు ఉచితమా ? అది నాలుగు నెలల పాటా ? అని నోరెళ్లెబెడుతున్నారా ? కానీ మీరు విన్నది నిజమే. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఆఫర్లు ప్రకటిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొస్తోంది. అందులో భాగంగానే…ఇంటర్నెట్ సేవలపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్ (BSNL) బ్రాడ్ బ్రాండ్, భారత్ ఫైబర్, డీఎస్ఎల్, బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, ఓవర్ వైఫై కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.
Read More : Madhya Pradesh : ఆ బంక్‌లో మూడు రోజులు పెట్రోల్ ఫ్రీ
ఈ ఆఫర్ ను పొందాలంటే..ఓ కండీషన్ ఓకే చెప్పాల్సి ఉంటుంది. 36 నెలల ఇంటర్నెట్ ప్లాన్ సేవల కోసం ఒకేసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారికి మాత్రమే…మరో నాలుగు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ (BSNL) బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఇంటర్నెట్ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ఆఫర్ ను పొందాలని అనుకుంటే…కస్టమర్లు…1800 00345 1500 నెంబర్ కు కాల్ చేసి..ఈ ఆఫర్ ను పొందవచ్చు. లేకపోతే..దగ్గరలో ఉన్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సేవా కేంద్రాన్ని సంప్రదించి..ఈ ఆఫర్ ను పొందచవచ్చు.