BSNL Freedom Plan : యూజర్లకు పండగే.. BSNL ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. జస్ట్ రూ. 1కే 30 రోజులు ఫ్రీ కాలింగ్, హైస్పీడ్ డేటా..!

BSNL Freedom Plan : బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్‌ మళ్లీ తీసుకొచ్చింది. కేవలం రూ. 1 రూపాయికే అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టింది.

BSNL Freedom Plan : యూజర్లకు పండగే.. BSNL ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. జస్ట్ రూ. 1కే 30 రోజులు ఫ్రీ కాలింగ్, హైస్పీడ్ డేటా..!

BSNL Freedom Plan

Updated On : December 2, 2025 / 3:57 PM IST

BSNL Freedom Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం కస్టమర్ల డిమాండ్ నేపథ్యంలో రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే 30 రోజుల పాటు ఫ్రీ కాలింగ్, డేటాతో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అధికారిక X హ్యాండిల్ ద్వారా ఫ్రీడమ్ ఆఫర్‌ను తిరిగి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.

ఆసక్తిగల వినియోగదారులు కేవలం రూ.1కి ట్రూ డిజిటల్ ప్లాన్ (BSNL Freedom Plan) పొందుతారని పేర్కొంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.1 రీఛార్జ్‌తో వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ (4G) డేటా, భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, నేషనల్ రోమింగ్‌ కూడా పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

ఈ బీఎస్ఎన్ఎల్ ఆఫర్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు రూ.1కి కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ కొనుగోలు ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ కొత్త బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మాత్రమేనని కంపెనీ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. ఇప్పటికే ఉన్న బీఎస్ఎన్ఎల్ యూజర్లు మాత్రం రూ.1 ఆఫర్‌కు మాత్రం అర్హులు కారని గమనించాలి.

Read Also : Apple iPhone Air : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? :
బీఎస్ఎన్ఎల్ గతంలో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 మధ్య ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రారంభ ఆఫర్ కొత్త BSNL యూజర్లకు రూ.1కి సిమ్ కార్డ్‌ను అందించింది. ఇందులో 30 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, 2GB రోజువారీ హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ ఉన్నాయి.

బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ వ్యాలిడిటీ పొడిగింపు :
బీఎస్ఎన్ఎల్ తరువాత ఫ్రీడమ్ ప్లాన్ వ్యాలిడిటీని 15 రోజులు, సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది.

బీఎస్ఎన్ఎల్ 100GB స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ (లెర్నర్స్ ప్లాన్) :
లెర్నర్స్ ప్లాన్ కేవలం రూ.251కే 28 రోజుల పాటు 100GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. ఇందులో రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 13, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవలే ఢిల్లీ టెలికాం సర్కిల్‌లో 10వేల కొత్త 4G టవర్ల కోసం టెండర్లను ఆహ్వానించింది. BSNL, MTNL నెట్‌వర్క్‌లలో NCR నివాసితులకు మెరుగైన కనెక్టివిటీని అందించనుంది.