Fake Smartphones Sale : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొత్త ఫోన్ కొంటున్నారా? ఒరిజినల్ లేదా ఫేక్ ఫోన్ ఎలా గుర్తించాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
Fake Smartphones Sale : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బిగ్ అలర్ట్.. తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్ ఒరిజినల్ లేదా ఫేక్ మొబైల్ ఫోన్ అని ఇలా తెలుసుకోండి.

Fake Smartphones Sale
Fake Smartphones Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 23 నుంచి మెగా ఫెస్టివ్ సేల్స్ మొదలయ్యాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. మీరు కొనే ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ ఏదైనా భారీ తగ్గింపుతో ఆఫర్లను పొందవచ్చు.
అయితే, మీరు కొనే మొబైల్ ఫోన్ అసలు (Fake Smartphones Sale) ఒరిజినల్ లేదా ఫేక్ అనేది ఎలా తెలుసుకోవడం.. ఆన్‌లైన్ సేల్ సమయంలో ఐఫోన్ పేరు ఫేక్ మొబైల్స్ ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను అమ్మేస్తుంటారు. ఇలాంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈ సేల్ ద్వారా అనేక మంది కొనుగోలుదారులు భారీ డీల్స్ పొందేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
అందిన నివేదికల ప్రకారం.. చాలా మంది వినియోగదారులు బ్రాండ్-న్యూ ఫోన్లకు బదులుగా ఫేక్, రియింబర్స్‌డ్ లేదా అసలు వర్క్ చేయని ఫోన్‌లను అందుకున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసాలను నివారించేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ లేదా ఫేక్ అనేది ధృవీకరించుకునేందుకు అద్భుతమైన మార్గాన్ని అందించింది. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా మీరు కొనుగోలు చేసిన ఫోన్ ఒరిజినల్ అవునో కాదో తెలుసుకోవచ్చు.
మీ స్మార్ట్‌ఫోన్ ఒరిజినాలిటీ ఎలా గుర్తించాలంటే? :
మీ స్మార్ట్‌ఫోన్ అథెంటికేషన్ ఎలా ధృవీకరించాలంటే.. ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు 15 అంకెల IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్ ఉంటుంది. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఈ నంబర్‌ను చెక్ చేయాలి. తద్వారా వినియోగదారులు మీరు కొన్న మొబైల్ ఫోన్ ఒరిజినల్ లేదా ఫేక్ అనేది తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
- అధికారిక పోర్టల్ (sancharsaathi.gov.in)ను విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్‌ను ఎంచుకోండి.
- నో యువర్ మొబైల్ (KYM)/IMEI వెరిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
- OTP కోసం కాప్చా, మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ఆపై OTP ఎంటర్ చేయండి.
- మీ స్మార్ట్‌ఫోన్ 15-అంకెల IMEI నంబర్‌ను ఎంటర్ చేసి Submit ఆప్షన్ క్లిక్ చేయండి.
- ఆ తర్వాత సిస్టమ్ డివైజ్ స్టేటస్, బ్రాండ్, మోడల్, తయారీదారు, మోడల్ వంటి వివరాలను చూడొచ్చు.
మీ ఫోన్ చెక్ చేసేందుకు ఇతర మార్గాలివే :
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ వాడుతుంటే.. (Google Play Store) లేదా (Apple App Store) నుంచి Sanchar Saathi యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ వెంటనే మీ ఫోన్ IMEI నంబర్ చూసేందుకు KYM <15-అంకెల IMEI నంబర్> ఫార్మాట్‌లో 14422కు SMS పంపండి లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లో *#06# డయల్ చేయండి.
పండుగ అమ్మకాలు దగ్గర పడుతున్న వేళ కొనుగోలుదారులు ఫోన్ డెలివరీ తర్వాత వెంటనే తమ కొనుగోళ్లను ధృవీకరించుకోవాలని సూచించారు. తద్వారా మీరు కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్ 100 శాతం ఒరిజినల్ అవునో కాదో తెలుసుకోవచ్చు.