Alibaba AI Model : డీప్‌సీక్, చాట్‌జీపీటీని తలదన్నేలా అలీబాబా ఏఐ మోడల్.. మోస్ట్ పవర్‌ఫుల్, అంతకుమించి అంటున్న చైనా కంపెనీ!

Alibaba AI Model : ఓపెన్ఏఐ, మెటా, చాట్‌జీపీటీ, డీప్‌సీక్, లామా వంటి ఏఐ మోడల్స్ కన్నా అలీబాబా క్వెన్ 2.5 ఏఐ మోడల్ అత్యంత శక్తివంతమైనదని పర్ఫార్మెన్స్‌‌లో దీన్ని మించింది లేదని అలీబాబా క్లౌడ్ యూనిట్ చెబుతోంది.

Alibaba AI Model : డీప్‌సీక్, చాట్‌జీపీటీని తలదన్నేలా అలీబాబా ఏఐ మోడల్.. మోస్ట్ పవర్‌ఫుల్, అంతకుమించి అంటున్న చైనా కంపెనీ!

Chinese tech giant Alibaba unveils AI model to challenge DeepSeek

Updated On : January 29, 2025 / 10:15 PM IST

Alibaba AI Model : ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో చైనా వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా చైనాలో ఏఐ పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. డ్రాగన్ దేశం ఏఐ రంగంలో రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తోంది.

నిన్నటికి నిన్న డీప్‌సీక్ (Deepseek) పేరుతో ఒక స్టార్ట్‌అప్ మార్కెట్లోకి కంపెనీ అడుగుపెట్టి అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా చావుదెబ్బ కొట్టింది. ఇప్పుడు తాజాగా మరో చైనా కంపెనీ కొత్త ఏఐ మోడల్ అంటూ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దేశంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన అలీబాబా (Qwen 2.5) ఏఐ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేసింది.

Read Also : Deepseek AI: ఒక్క రోజే అమెరికన్ కంపెనీల రూ.8,65,20,50,00,00,000 డబ్బులు ఫసక్.. ఏంటీ చైనా డీప్ సీక్ ఏఐ

చైనా న్యూ ఇయర్ రోజునే అలీబాబా ఏఐ మోడల్ రిలీజ్ : 
చైనా నూతన సంవత్సరం మొదటి రోజున అలీబాబా ఈ ఏఐ మోడల్ ప్రవేశపెట్టింది. ఇది దేశీయంగా, అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన మోడల్ లేటెస్ట్ వెర్షన్ అయిన డీప్‌సీక్ (DeepSeek-V3) కన్నా పవర్‌ఫుల్ అంటోంది అలీబాబా. డీప్‌సీక్‌ ఏఐ పనితీరు కన్నా చాలా బెటర్‌గా పనిచేస్తోందని కంపెనీ చెబుతోంది.

చైనీయులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్న చంద్ర నూతన సంవత్సరం మొదటి రోజునే ఈ కొత్త ఏఐ మోడల్ ఆవిష్కరించినట్టు తెలిపింది. డీప్‌సీక్ R1 మోడల్ తక్కువ ఖర్చుతో పనిచేయగలదని ప్రకటించిన వెంటనే ఎంతగా హైప్ క్రియేట్ చేసిందో దానికి రెండింతలుగా అలీబాబా ఏఐ మోడల్ కూడా ప్రపంచ పోటీదారులపైనే కాకుండా చైనీస్ టెక్ దిగ్గజాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.

అలీబాబా ఎంట్రీతో ఇతర ఏఐ మోడల్స్ కుదేలు :
ఈ అలీబాబా ఏఐ మోడల్ న్యూ వెర్షన్ (Qwen 2.5-Max) డీప్‌సీక్-V3, జీపీటీ-4o, Llama-3.1-405B వంటి ఇతర ప్రముఖ ఏఐ మోడల్‌లను వివిధ బెంచ్‌మార్క్‌లలో అధిగమించిందని అలీబాబా క్లౌడ్ యూనిట్ పేర్కొంది. జనవరిలో డీప్‌సీక్-V3 తదుపరి R1 మోడల్ విడుదల సిలికాన్ వ్యాలీని దిగ్భ్రాంతికి గురిచేసింది. చైనాలో ఏఐ వేగవంతమైన అభివృద్ధి, చైనీస్ స్టార్టప్‌లు గ్లోబల్ టెక్ ల్యాండ్‌స్కేప్‌కు అంతరాయం కలిగించే అవకాశాలపై మరింత ఆందోళనలను రేకిత్తించింది.

డీప్‌సీక్ ఏఐ మోడల్ రాకతో చైనీస్ టెక్ కంపెనీలలో సొంత ఏఐ మోడల్‌లను అప్‌గ్రేడ్ చేసేలా ప్రేరేపించింది. డీప్‌సీక్-R1 విడుదలైన రెండు రోజుల తర్వాత టిక్‌టాక్ కంపెనీ యజమాని (ByteDance) ఫ్లాగ్‌షిప్ ఏఐ మోడల్‌కు అప్‌డేట్ ఆవిష్కరించింది. బెంచ్‌మార్క్ పరీక్షలో ఓపెన్ఏఐ o1ని అధిగమించిందని పేర్కొంది.

డీప్‌సీక్ R1 మోడల్‌కు సంబంధించి డీప్‌సీక్ సొంత వాదనలను కూడా లేవనెత్తింది. డీప్‌సీక్-V2 విడుదలతో చైనీస్ ఏఐ కంపెనీల మధ్య పోటీ తీవ్రమైంది. ఏఐ పరిశ్రమలో ధరల యుద్ధాన్ని రేకెత్తించింది. డీప్‌సీక్ ఓపెన్-సోర్స్ మోడల్, తక్కువ ధర అలీబాబా, బైడు, టెన్సెంట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు తమ ఏఐ మోడల్‌లపై ధరలను తగ్గించడానికి దారితీసింది.

డీప్‌సీక్ దెబ్బకు అమెరికా కంపెనీల లక్షల కోట్లు ఆవిరి :
ఇంతలో, నివిడియా (Nvidia)తో సహా ప్రధాన టెక్ కంపెనీల స్టాక్ ధర, ఒక రోజులో అమెరికా టెక్ దిగ్గజాల నుంచి 1 ట్రిలియన్‌ డాలర్లను తుడిచిపెట్టింది. అయితే, డీప్‌సీక్ ఏఐ యాప్ ఏఐ కంపెనీలకు షాక్ ఇచ్చిన రెండు రోజుల తర్వాత షేర్లు స్థిరంగా ఉన్నాయి.

తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, డీప్‌సీక్ వ్యవస్థాపకుడు, లియాంగ్ వెన్‌ఫెంగ్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)ని సాధించడంపై దృష్టి సారించారు. ఈ లక్ష్యానికి పెద్ద టెక్ కంపెనీల కన్నా భిన్నమైన విధానం అవసరమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also : Deepseek AI : డీప్‌‍సీక్ ఏఐ.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ చైనా స్టార్టప్ కంపెనీ గురించి 10 ఆసక్తిర విషయాలివే

తక్కువ ధర.. బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు : అలీబాబా 
20 నెలల క్రితమే అలీబాబా ఏఐ కంపెనీ హాంగ్‌జౌలో స్థాపించారు. ఏఐ రంగంలో తక్కువ ధరతో పాటు బెటర్ పెర్ఫామెన్స్‌‌తో కూడిన సర్వీస్ అందిస్తోంది. చైనా కంపెనీలో ఏఐ రంగంలో పెట్టబడులు అగ్రరాజ్యం అమెరికాను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. అమెరికాకు టెక్ కంపెనీల స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయాయి.

111 దేశాల్లో ఆపిల్ స్టోర్, 18 దేశాల ప్లే స్టోర్‌లో డీప్‌సీక్ ఏఐ మోడల్ భారీగా డౌన్‌లోడ్ చేస్తుండగా టాప్ 10 ఏఐ యాప్స్‌లో ఇదే ముందుంజలో నిలిచింది. తక్కువ ధర, అత్యంత వేగవంతంగా కచ్చితమైన డేటా అందించే డీప్‌సీక్ పైథాగరస్ సిద్ధంతాన్ని కేవలం 30 నిమిషాల్లోనే వివరణ ఇవ్వగలదట. ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా అలీబాబా Qwen 2.5 పవర్ ఫుల్‌గా చాలా బెటర్ గా పనిచేస్తోందని చెబుతోంది.