Cut, Copy, Paste కనిపెట్టిన కంప్యూటర్ సైంటిస్ట్ ఇక లేరు

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 08:32 AM IST
Cut, Copy, Paste కనిపెట్టిన కంప్యూటర్ సైంటిస్ట్ ఇక లేరు

Updated On : April 28, 2020 / 8:32 AM IST

టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ పర్సనల్ కంప్యూటర్ వాడకమూ పెరిగిపోయింది. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్‌లా పేరు సంపాదించుకోకపోయినా.. అతను కనిపెట్టిన కట్, కాపీ, పేస్ట్ దాదాపు 90శాతం మందికి ఉపయోగపడుతుంది. పర్సనల్ కంప్యూటర్ వాడుతున్న వారికీ, పరోక్షంగా లాభపడుతున్నవారికీ ల్యారీ టెస్లర్ తెలియకుండానే సేవలందించారు. ల్యారీ సోమవారం కన్నుమూశారు. 

న్యూయార్క్‌లో 1945లో పుట్టిన టెస్లర్.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. యాంటీ-వార్, యాంటీ-కార్పొరేట్ మోనోపలి మూమెంట్లు రావడానికి దోహదపడ్డాయి ఈయన పరిశోధనలు. IBMలాంటి కంపెనీని టార్గెట్ చేసుకుని టెక్నాలజీలో పెనుమార్పులు తీసుకొచ్చారు. 

 

ఈయన 1973లో జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్ (పార్క్) కంపెనీలో చేరి 1980వరకూ పనిచేశారు. mouse కదలికల్లో గ్రాఫిక్స్‌ క్రియేట్ చేయడం ఈ కంపెనీ నుంచి వచ్చిందే. టెస్లర్.. టిమ్ మోట్‌తో కలిసి వర్డ్ ప్రోసెసింగ్ కోసం గిప్సీ అనే పదాన్ని కనిపెట్టారు. దీని సహాయంతో కట్, కాపీ, పేస్ట్ అనే కమాండ్‌లతో టెక్స్ట్‌ను సులువుగా మార్చుకోవచ్చు.