Truth Social App : ఆపిల్ స్టోర్‌లో ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్’ రికార్డు.. అత్యధికంగా డౌన్‌లోడింగ్..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ యాప్ ఆపిల్ స్టోర్‌లో అధిక డౌన్‌లోడ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఒకరోజులోనే యాప్ స్టోర్లలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయింది.

Truth Social App : ఆపిల్ స్టోర్‌లో ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్’ రికార్డు.. అత్యధికంగా డౌన్‌లోడింగ్..

Donald Trump’s Truth Social App Becomes Most Downloaded App On Apple App Store

Updated On : February 22, 2022 / 9:03 PM IST

Truth Social App : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ యాప్ ఆపిల్ స్టోర్‌లో అధిక డౌన్‌లోడ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. లాంచ్ అయిన ఒకరోజులోనే యాప్ స్టోర్లలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా నిలిచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హింసను ప్రేరేపించేలా పోస్టులు చేశారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ట్విట్టర్​ ఆయన అకౌంటును నిషేధించింది. అప్పుడే ట్రంప్​ సొంతంగా సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ను తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 21న అర్ధరాత్రి ఈ యాప్​ iOS వెర్షన్​ లాంచ్ అయింది. ‘ట్రూత్ సోషల్’ పేరుతో ఇది యాపిల్​ స్టోర్​లో విడుదలైంది. సోషల్ మీడియాలో టాప్ ఫ్రీ యాప్ గా యాప్ స్టోర్‌లో ట్రంప్ యాప్ అందుబాటులోకి వచ్చింది.

Donald Trump’s Truth Social App Becomes Most Downloaded App On Apple App Store (1)

Donald Trump’s Truth Social App Becomes Most Downloaded App On Apple App Store 

యాప్‌ను విడుదల చేయడానికి ముందు ముందస్తు ఆర్డర్ చేసిన యూజర్లకు ఈ యాప్ ఆటోమేటిక్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ యాప్‌ లాంచ్ అయిన తర్వాత టెక్నికల్ లోపాలు ఎక్కువగా ఎదురయ్యాయి. యూజర్లు ఎవరూ తమ అకౌంట్లను యాప్‌లో చేసుకోలేకపోయారు. చాలా మంది యూజర్లకు వెయిట్‌లిస్ట్‌ అనే మెసేజ్ వచ్చినట్టు తెలిపారు.

వాస్తవానికి ఈ ట్రూత్ సోషల్ యాప్ ట్విట్టర్ మాదిరిగానే ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ప్రముఖ వ్యక్తులతో పాటు ఇతర యూజర్లు ఈ ఫాలో కావొచ్చు. ఈ యాప్ యూజర్లు తాము అనుసరించే వ్యక్తులకు వ్యక్తిగత మెసేజ్ లను పంపడానికి అనుమతిస్తుంది. తమ ట్వీట్లను రీపోస్ట్ చేయవచ్చు. వారి ట్వీట్లపై కామెంట్ చేయొచ్చు. యాప్ డార్క్ థీమ్‌తో కూడా వస్తుంది, హ్యాష్‌ట్యాగ్‌లను క్రియేట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.

Read Also : Trump Truth Social App : ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ యాప్ వచ్చేస్తోంది.. ఆపిల్ App Storeలో రేపే లాంచ్..!