WhatsApp Cyber Scam : బాబోయ్.. వాట్సాప్‌లో అతిపెద్ద సైబర్ స్కామ్.. ఈ చిన్న పొరపాటు చేసినా ఖతమే.. మీ అకౌంట్ హ్యాక్ అయినట్టే..!

WhatsApp Cyber Scam : ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. వాట్సాప్‌లో అతిపెద్ద స్కామ్ బయటపడింది. ఈ స్కామ్ గురించి తెలిస్తే మీరు కూడా షాక్‌కు గురవుతారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.

WhatsApp Cyber Scam : బాబోయ్.. వాట్సాప్‌లో అతిపెద్ద సైబర్ స్కామ్.. ఈ చిన్న పొరపాటు చేసినా ఖతమే.. మీ అకౌంట్ హ్యాక్ అయినట్టే..!

WhatsApp Cyber Scam

Updated On : March 23, 2025 / 2:25 PM IST

WhatsApp Cyber Scam : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వాట్సాప్ అతిపెద్ద సైబర్ స్కామ్ బయటపడింది. మీరు చేసే చిన్న తప్పుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఎట్టిపరిస్థితుల్లో కూడా మీ వాట్సాప్ కు సంబంధించి OTP ఎవరికి షేర్ చేయొద్దు. సైబర్ నేరగాళ్లు మీ వాట్సాప్ అకౌంట్ ఏ క్షణమైనా హ్యాక్ చేయొచ్చు తస్మాత్ జాగ్రత్త..

ప్రముఖ క్రికెట్ కామెంటర్ హర్ష భోగ్లే మార్కెట్లో జరిగే కొత్త వాట్సాప్ స్కామ్‌ను బయటపెట్టారు. ఈ డేంజరస్ స్కామ్ గురించి ఆయన వాట్సాప్ యూజర్లను గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇటీవలే తన బంధువులు ఈ స్కామ్ బారిన పడ్డారంటూ చెప్పుకొచ్చారు. వాట్సాప్ అనగానే అందరూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అని భావిస్తుంటారు.

Read Also : Vivo X200 Ultra : వారెవ్వా.. కొత్త వివో X200 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

ఎందుకంటే.. ఈ యాప్‌తో ఎవరి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేయడం అంత సులభం కాదు. కానీ, మీరు చేసే ఈ చిన్న పొరపాటు కారణంగా మీ వాట్సాప్ అకౌంట్ మొత్తం హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. అందుకే వాట్సాప్ యూజర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హర్షా భోగ్లే సూచిస్తున్నారు. ఈ విషయం తెలియగానే వాట్సాప్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ స్కామ్ అంటే ఏంటి? :
హ్యాకర్లు మీ వాట్సాప్ అకౌంటుకు ఒక OTP పంపుతారు. పొరపాటున మీకు ఓటీపీ వచ్చిందని నమ్మిస్తారు. అది మీరు నిజమే అని వారికి మీ ఓటీపీ షేర్ చేశారంటే అంతే సంగతులు.. మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అవుతుంది.

ఆ తర్వాత మీ వాట్సాప్ అకౌంట్ నుంచి లాగ్ అవుట్ అయిపోతారు. ఇక ఆ స్కామర్ మీ వాట్సాప్ అకౌంట్ నుంచి మీ పేరుతో మీ ఫోన్ కాంటాక్టుల్లోని అందరికి ఇదే విధంగా ఓటీపీలను పంపుతాడు. అలా అందరి వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేస్తారు అనమాట.. వాట్సాప్‌లో OTP కోడ్‌లను అడగడం లేదా డబ్బులు అవసరమని చెప్పి వాట్సాప్ అకౌంట్లను హైజాక్ చేస్తారు.

అంతటితో ఆగదు.. మీ వాట్సాప్ గ్రూపు అడ్మిన్లను మార్చేస్తారు. మీ బ్యాకప్ ఇమెయిల్ ఐడీ మార్చేస్తారు. ఇకపై మీరు మీ డివైజ్ నుంచి వాట్సాప్ తిరిగి లాగిన్ అవ్వలేరు. మీ మెసేజ్‌లను యాక్సస్ చేయలేరు. వాట్సాప్ యూపీఐ ఐడీతో పాటు ఫొటోలు, వీడియోలు, కాంటాక్టులు, ఇతర డాక్యుమెంట్లు ఏది కూడా మీ కంట్రోల్లో ఉండవని గమనించాలి.

ఈ వాట్సాప్ స్కామ్.. ఒక్క మెసేజ్ తోనే ఆరంభమవుతుందని భోగ్లే హెచ్చరిస్తున్నారు. మీకు తెలిసిన బంధువు లేదా స్నేహితుడి నుంచే మొదలవుతుంది. కేవలం రిప్లయ్ చేస్తే చాలు. మీకు తెలియకుండానే మీ కాంటాక్టుల్లోని అందరి వాట్సాప్ అకౌంట్లు హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. ఇప్పటికే 5 లక్షలకు పైగా మంది వాట్సాప్ యూజర్లు ఈ స్కామ్ బారినపడ్డారు.

Read Also : Post Office Schemes : పోస్టాఫీస్‌‌లో అద్భుతమైన స్కీమ్స్.. ఇందులో మీ డబ్బు డిపాజిట్ చేస్తే.. బ్యాంకుల్లో కన్నా భారీ వడ్డీ వస్తుంది..!

ఈ వాట్సాప్ స్కామ్ గురించి తెలిసిన వెంటనే నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన వాట్సాప్ స్కామ్ అంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఈ రకమైన మోసాలు చాలా సాధారణం అవుతున్నాయని మరో యూజర్ పేర్కొన్నారు. ఓటీపీలు షేర్ చేయడం ఆపివేయడం లేదా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానిస్తే.. సైబర్ మోసగాళ్ళు మోసం చేయడం అంత సులభం కాదని మరో యూజర్ తెలిపాడు.

ఈ వాట్సాప్ సైబర్ స్కామ్‌లో ఎక్కువగా వెరిఫికేషన్ కోడ్ అడిగి హ్యాక్ చేస్తారు. ఆపై హ్యాక్ చేసిన అకౌంట్ ఉపయోగించి ఫోన్ కాంటాక్ట్‌లను లక్ష్యంగా చేసుకుని స్కామ్ చేస్తుంటారు. SMS ద్వారా అందుకున్న ఏవైనా కోడ్‌లను షేర్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.