Elon Musk Xmail : జీమెయిల్‌కు పోటీగా ‘ఎక్స్’మెయిల్ వస్తోంది.. ఎలన్ మస్క్ మళ్లీ వేసేశాడుగా..!

Elon Musk Xmail : ట్విట్టర్ (X) సీఈఓ ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశాడు. జీమెయిల్ సర్వీసుకు పోటీగా ఎక్స్‌మెయిల్ వస్తుందంటూ మస్క్ ధృవీకరించాడు.

Elon Musk Xmail : జీమెయిల్‌కు పోటీగా ‘ఎక్స్’మెయిల్ వస్తోంది.. ఎలన్ మస్క్ మళ్లీ వేసేశాడుగా..!

Elon Musk confirms Xmail is coming amid rumours of Gmail shutting

Elon Musk Xmail : ఈ ఏడాది ఆగస్టులో జీమెయిల్ షట్‌డౌన్ అవుతుందని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. జీమెయిల్ అస్తమిస్తోందంటూ ఇంటర్నెట్లో ఓ ఫేక్ ఫొటో వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు నిజమనే నమ్మారు. ఇది ట్విట్టర్‌‌లో బాగా ట్రెండ్ అయింది. అప్పుడే ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఎంట్రీ ఇచ్చాడు. జీమెయిల్ షట్ డౌన్ అయితేనేం.. మన ఎక్స్‌మెయిల్ (Xmail) వస్తోందంటూ సంచలన ప్రకటన చేశాడు. అంతే.. ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Read Also : Elon Musk Grok AI Chatbot : చాట్‌జీపీటీ, బార్డ్ ఏఐకి పోటీగా ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్.. ఇప్పుడు భారత్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు!

ఎక్స్ (X) సెక్యూరిటీ ఇంజినీరింగ్ బృందంలోని సీనియర్ సభ్యుడు నాథన్ మెక్‌గ్రాడి చేసిన ట్వీట్ తర్వాత ఎక్స్‌‌మెయిల్ ఎప్పుడు వస్తుందాని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీనిపై మస్క్ వెంటనే స్పందిస్తూ.. సర్వీసు ప్రస్తుతం హోరిజోన్‌లో ఉందని నిర్ధారించారు. మస్క్ అన్నట్టుగా ఎక్స్‌మెయిల్ తీసుకొస్తాడో లేదో గానీ ముందుగా ఒక రాయి మాత్రం వేసేశాడు.. మస్క్ ప్రకటనపై స్పందించిన చాలామంది నెటిజన్లు.. మస్క్ మామ మూమూలోడు కాదు.. అన్నంత పనిచేస్తాడని సరదాగా ట్వీట్ చేస్తున్నారు.

గూగుల్ ఈజ్ సన్‌సెట్టింగ్ జీమెయిల్ అనే పేరుతో ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ పోస్ట్ ట్విట్టర్‌‌లో వైరల్ కావడంతో జీమెయిల్ భవిష్యత్తు గురించి యూజర్లలో భయాందోళనలకు దారితీసింది. ఇమెయిల్‌లను పంపడం, స్వీకరించడం లేదా స్టోర్ చేసే సపోర్టును నిలిపివేస్తూ, ఆగస్టు 1, 2024 నాటికి జీమెయిల్ అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుందని ఇమెయిల్ సారాశంలో పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో జీమెయిల్ వినియోగదారుల్లో అనేక సందేహాలు తలెత్తాయి.

జీమెయిల్ బేసిక్ వర్షన్ మాత్రమే : గూగుల్ క్లారిటీ 
గూగుల్ అధికారిక ప్రకటన లేకపోవడంతో చాలా మంది దీన్ని నమ్మలేదు. ఇదే క్రమంలో స్పందించిన గూగుల్ ఊహాగానాలకు చెక్ పెట్టేసింది. జీమెయిల్ అంతరించిపోలేదని ఇకపై కొనసాగుతూనే ఉంటుందని ఎక్స్ ప్లాట్ ఫారం వేదికగా గూగుల్ స్పష్టం చేసింది. జీమెయిల్ డిఫాల్ట్ వ్యూ ఫీచర్ మాత్రమే నిలిచిపోనుందని తెలిపింది. జనవరి 2024లో ‘బేసిక్ HTML’ వెర్షన్ నుంచి మరింత శక్తివంతమైన ఇంటర్‌ఫేస్‌కు మారుతుందని పేర్కొంది.

గూగుల్ ధృవీకరించినప్పటికీ.. జీమెయిల్ నిలిచిపోతుందనే పుకార్లతో జీమెయిల్ సర్వీసుకు ప్రత్యామ్నాయాలేంటి అనే చర్చలకు దారితీసింది. మస్క్ ఎక్స్‌మెయిల్ వస్తుందని ప్రకటించడంతో కొంతమంది (Xmail)ని అద్భుతమైన ఆప్షన్ అంటూ ట్వీట్లు చేశారు. సోషల్ మీడియాలోని వినియోగదారుల్లో ఒకరు జీమెయిల్ పట్ల అపనమ్మకంతో మరో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నాని కామెంట్ చేశారు.

స్పేస్‌ఎక్స్ అధినేత అయిన ఎలన్ మస్క్, అంగారక గ్రహం, చంద్రుని స్థావరంపై నగరాలను నిర్మించాలనే ఆలోచన రేకిత్తించారు. భూమిని దాటి మానవాళిని ఇతర గ్రహాలకు విస్తరించాలని గట్టిగానే నిర్ణయించుకున్నాడు. 1969లో అపోలో 11 మిషన్ చారిత్రిక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. చంద్రుని ఉపరితలంపై మానవులు మొదటిసారిగా కాలు మోపినప్పటి నుంచి అర్ధ శతాబ్దం గడిచిపోయిందని మస్క్ తన నిరాశను వ్యక్తం చేశాడు.

Read Also : Google Gmail Shutdown : ఆగస్టు 2024లో జీమెయిల్ పూర్తిగా నిలిచిపోనుందా? పుకార్లను నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చిన గూగుల్!