Elon Musk : మరో 3 నెలల్లో 10శాతం టెస్లా ఉద్యోగుల కోత తప్పదు..!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Elon Musk Says Tesla Will Fire 10 Per Cent Of Workforce In Next 3 Months
Elon Musk : ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టెస్లా ఉద్యోగుల విషయంలో కూడా మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే మూడు నెలల్లో టెస్లా కంపెనీలోని ఉద్యోగుల్లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగించున్నట్టు కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ స్పష్టం చేశాడు. ఇప్పటికే టెస్లా కంపెనీలో ఉద్యోగుల కోత విధించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కనీసం పదిశాతం ఉద్యోగుల కోత అవసరమని నిర్ణయించారు. దీనికి సంబంధించి కంపెనీ ప్రతినిధులకు మస్క్ పంపిన మెయిల్ పంపారు. ఇప్పుడా ఆ మెయిల్ లీక్ అయింది. లీకైన ఆ మెయిల్‌లో కంపెనీలో ఉద్యోగుల కోత అవసరమని మస్క్ నిర్ణయం తీసుకున్నట్టు ఉంది.
ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా టెస్లా కంపెనీల్లో కొత్త ఉద్యోగాల ఎంపిక ఇప్పుడే వద్దని మస్క్ ఆదేశించినట్టు తెలుస్తోంది. వెంటనే ఉద్యోగుల ప్రక్రియ నిలిపివేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాల కోత వల్ల కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.5 శాతం తగ్గుతుందని బ్లూమ్‌బెర్గ్ ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో మస్క్ చెప్పారు. ఈ నెల ప్రారంభంలో.. మస్క్ ఉద్యోగాల కోతలు ఉంటాయని ఇంటర్నల్ ఈమెయిల్ ద్వారా ప్రకటించాడు. ఇప్పటి వరకు, మస్క్ లేదా టెస్లా తొలగింపులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు. టెస్లా ఉద్యోగులు ఖచ్చితంగా కఠినమైన సమయాన్ని ఎదుర్కొనున్నారు.

Elon Musk Says Tesla Will Fire 10 Per Cent Of Workforce In Next 3 Months
ఉద్యోగుల తొలగింపులతో పాటు.. మస్క్ టెస్లా ఉద్యోగులందరినీ ఆఫీసు నుంచి పని చేయమని కోరాడు. ఆఫీసు నిబంధనలను పాటించని వ్యక్తులను వెళ్లిపోవాల్సిందిగా స్పష్టంగా పేర్కొన్నారు. టెస్లా ఉద్యోగులకు వారానికి 40 గంటల పనిని తప్పనిసరి చేశాడు. సబ్జెక్ట్ లైన్ కింద రాసిన మరొక ఈమెయిల్‌లో.. రిమోట్ పని ఇకపై ఆమోదయోగ్యం కాదని మస్క్ పేర్కొన్నాడు. రిమోట్ వర్క్ చేయాలనుకునే ఎవరైనా కనీసం 40 గంటలు ఆఫీసులో ఉండాలని సూచించాడు. గత ఏడాదిలో జాక్ డోర్సే CEOగా ఉన్నప్పుడు, ట్విట్టర్ ఉద్యోగులను ఇంటి నుంచి లేదా వారు కోరుకున్న చోట పని చేసేందుకు అనుమతించింది. ట్విట్టర్ బాస్‌గా మస్క్ బాధ్యతలు చేపట్టనుండటంతో మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి వస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం వదిలి ఆఫీసులకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
Read Also : Elon Musk: టెస్లాలో పది శాతం ఉద్యోగాల కోత అవసరం: ఎలన్ మస్క్