Facebook : ఫేస్ బుక్ or ఫేక్ బుక్..? సర్వేలో ఆసక్తికర అంశాలు

ఫేస్ బుక్...ఇప్పుడు ఫేక్ సమాచారంతో యూజర్ ను తప్పుదోవ పట్టించడంలో నెంబర్ వన్ గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Facebook : ఫేస్ బుక్ or ఫేక్ బుక్..? సర్వేలో ఆసక్తికర అంశాలు

Facebook

Updated On : September 7, 2021 / 12:05 PM IST

Facebook Fake Content : ఫేస్ బుక్. సోషల్ మీడియాలో దిగ్గజం. తమకు సంబంధించిన విషయాలు, ఇతరత్రా విషయాలను ఇందుల పోస్టు చేస్తుంటారు. దీనిపై తీవ్రమైన చర్చలు..వాదోపదవాదాలు జరుగుతుంటాయి. కొంతమంది సరదా సరదా పోస్టులు చేస్తూ నవ్విస్తుంటారు. సోషల్ మీడియా ఎంత స్పీడు అంటే..టీవీలు, యూ ట్యూబ్ లాంటి లైవ్ ప్లాట్ ఫామ్స్ కంటే..ముందు సోషల్ మీడియాను ఆశ్రయిస్తుంటారు యూజర్లు. క్విక్ అప్ డేట్స్ అందించే సాధనంగా…యూజర్లు భావిస్తుంటారు.

Read More : 3D Printing Technology : కృత్రిమ చెవులు, ముక్కు..త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీతో సృష్టి

Fakebook

అయితే…సీరియస్ చర్చల ప్లేస్ లో అనవసరమైన అంశాలపై చర్చ జరుగుతుండడం..తప్పుడు సమాచారాన్ని అందించే ప్లాట్ ఫామ్ గా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫేస్ బుక్…ఇప్పుడు ఫేక్ సమాచారంతో యూజర్ ను తప్పుదోవ పట్టించడంలో నెంబర్ వన్ గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వాస్తవ కథనాల కంటే..తప్పుడు, తప్పుడు దోవ పట్టించే…సమాచారాన్ని యూజర్లు క్లిక్ చేయాల్సి వస్తోందంటున్నారు కొందరు.

Read More : లాక్‌డౌన్‌లో సెక్స్ వర్కర్లు కస్టమర్ల కోసం ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నారంటే?

ఫ్రాన్స్ లోని గ్రెనోబుల్ ఆల్ఫ్స్ యూనివర్సిటీ చేపట్టిన…ఓ సర్వేలో…ప్రపంచ వ్యాప్తంగా…ఉన్న లక్షలాది మంది యూజర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తమను తప్పుదారి పట్టిస్తున్న ఫేస్ బుక్ ను Fakebookగా అభివర్ణించడం గమనార్హం. ఫేక్ ప్రచారాల్లో సగం వాటా మీడియా సంస్థల ద్వారా..మరో 20 శాతం రాజకీయాల నాయకుల వాటా ఉంటుండగా..మిగిలిన 30 శాతం ఇతర యూజర్ల నుంచి ఫేస్ బుక్ వాల్ మీదకు చేరుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యూ ట్యూబ్ కూడా ఒకటి. దీనిని కూడా చాలా మంది ఫాలో అవుతుంటారు. అయితే..వాటి వాటి ఛానెల్ కు ఉపయోగించే థంబ్ నెయిల్స్ ఇప్పుడు ఇతర ప్లాట్ ఫామ్ ల మీదకు చేరుతున్నాయి. కనిపించిన ప్రతిదానిని క్లిక్ చేయడం వల్ల…ఫేక్ సమాచారం..తెలియకుండానే..ఆదరణ ఎక్కువగా ఉంటోందని…సర్వే ద్వార తేల్చిచెబుతున్నారు. ఆ మిస్ లీడ్ కంటెంట్ వల్లే యూజర్లు ఆకర్షితులవుతున్నారని…న్యూయార్క్ యూనివర్సిటీ రీసెర్చర్లు (ఆగస్టు 2020, జనవరి 2021) మధ్య ఎన్నికల టైంలో జరిగిన సర్వేను గుర్తు చేస్తున్నారు. అయితే..ఫేస్ బుక్ మాత్రం వీటిని తోసిపుచ్చుతోంది. కంటెంట్ ఎలా ఉన్నా..జనాలు ఎలా ఆకర్షితులవుతారు ? వారికి నచ్చితేనే లైకులు కొట్టి..షేర్లు చేస్తారని ఫేస్ బుక్ ప్రతినిధి…జోయ్ ఓస్ బార్నె. పలు బ్లాగులతో కలిసి..ఫేక్ కంటెంట ను తొలగింపు చేస్తున్నామన్నారు.