పారదర్శకత కోసమే :ఫేస్ బుక్ ” షట్ డౌన్” స్టార్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : January 25, 2019 / 07:24 AM IST
పారదర్శకత కోసమే  :ఫేస్ బుక్ ” షట్ డౌన్” స్టార్ట్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్  తమ యాప్ ని మరింత పారదర్శకంగా ఉంచేందుకు రెడీ అయింది.  ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఇప్పటివరకు ఫేక్ న్యూస్ కట్టడి చేయడం విషయంలో ఫేస్ బుక్ తీసుకున్న చర్యలు పెద్దగా లేవనే చెప్పవచ్చు.  యూజర్లకు మరింత పారదర్శకంగా తమ సేవలు అందించేందుకు ఫేస్ బుక్ చర్యలకు రెడీ అయింది. ఇప్పటికే యూజర్ల డేటా లీక్, యూజర్ల సమాచారాన్ని గతంలో ఫేస్ బుక్ అమ్మకానికి పెట్టిందనే ఆరోపణలతో ఫేస్ బుక్ పై ప్రజల్లో ఆదరణ క్రమక్రమంగా తగ్గుతున్న విషయాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలకు దిగింది.

ఇందులో భాగంగానే కంపెనీ  కమ్యూనిటీ ప్రమాణాలను గతంలో ఉల్లంఘినవారికి చెందిన పేజీలను గురువారం(జనవరి24,2019) నుంచి షట్ డౌన్( మూసివేయడం) ప్రారంభించింది. నిరంతర నిషేథిత కార్యకలాపాల నుంచి వారి నేరపూరిత పేజీలను అడ్డుకొనేందుకు కొన్ని యూజర్ల నకిలీ పేజీలను, గ్రూప్ లను మూసివేయడం మొదలుపెట్టింది. తమ రిసిడివిజమ్(తిరగదోడే) పాలసీని అప్ డేట్ చేస్తున్నట్లు ఫేస్ బుక్ తన బ్లాగ్ లో  పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఫేజ్ క్వాలిటీ పేరుతో ఓ కొత్త ట్యాబ్ ని ప్రవేశపెట్టబోతుంది.  

రష్యాతో లింక్ అయిన వందల పేజీలను, గ్రూప్ లను తొలగించినట్లు గత వారం ఫేస్ బుక్ ప్రకటించింది. అమెరికా బయట ఉన్న వినియోగదారులను టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని రన్ చేస్తున్నట్లు గుర్తించి వారిని తొలగించడం జరిగిందని తెలిపింది. గతేడాది అక్టోబర్ లో కూడా సైట్ రూల్స్ ఉల్లంఘించారని 559 ఫేస్ బుక్ పేజీలను, 251 ఫేస్ బుక్ అకౌంట్లను తొలగించింది.