Facebook : ఫేస్‌బుక్‌లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
Facebook : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ తమ ప్లాట్ పాంపై యూజర్ల ప్రైవసీపైనే ఎక్కువగా దృష్టిపెడుతోంది.

Facebook Will Now Let Users Manage Who Sees Their Posts
Facebook : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ తమ ప్లాట్ పాంపై యూజర్ల ప్రైవసీపైనే ఎక్కువగా దృష్టిపెడుతోంది. అందులో భాగంగానే మెటా యాజమాన్యం ఇటీవలే ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే యూజర్ల ప్రైవసీ పాలసీలో అనేక మార్పులు చేసింది. కొత్త ప్రైవసీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త ప్రైవసీ విధానాలు కేవలం ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తాయి. మెటా సొంత యాప్ వాట్సాప్ యూజర్లకు వర్తించదు.
ఈ మేరకు మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. అంతేకాదు.. ఆడియోన్స్ కంట్రోలింగ్ కూడా యూజర్లకు అందించనుంది. ఏయే కేటగిరీ ఆడియోన్స్‌కు ఏయే యాడ్స్ కనిపించేలా కంట్రోల్ చేయవచ్చు. ఇలా అన్నింటిపై కంట్రోలింగ్ యూజర్లకు అందించనుంది. ఈ పాలసీ అప్‌డేట్ ఆధారంగా పవర్ డేటాను కొత్త మార్గాల్లో సేకరించడం, ఉపయోగించడం లేదా షేర్ చేయడం లేదని మెటా స్పష్టం చేసింది. Meta గతంలో డేటా పాలసీలో ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసినట్టు వెల్లడించింది. దీనికి సంబంధించి యూజర్లకు నోటిఫికేషన్‌లను కూడా పంపింది.

Facebook Will Now Let Users Manage Who Sees Their Posts
ఇప్పుడు తాజాగా ఫేస్ బుక్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్‌లో మీ పోస్ట్‌లను ఎవరు చూస్తారు అనేది మీరే కంట్రోల్ చేయొచ్చు. ఈ కొత్త సెట్టింగ్‌ను రూపొందిస్తున్నట్లు మెటా పేర్కొంది. అయితే యూజర్లు మీ Future Posts సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు. దీని అవసరం లేకుండానే మీకు అవసరమైన ఆడియోన్స్ ఎంపిక చేసుకోవచ్చు. వారికి మాత్రమే మీ పోస్టు కనిపించేలా కంట్రోల్ చేయొచ్చు. అంటే.. ఇక్కడ మీరు ఏదైతే పోస్టు ఏయే ఆడియోన్స్ కు మాత్రమే కనిపించాలని భావిస్తారో వారికి మాత్రమే కనిపించేలా ఈ కొత్త సెట్టింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.
ఫేస్ బుక్ యూజర్లు తమ ఫ్యూచర్ పోస్ట్‌ల కోసం డిఫాల్ట్ ఆడియోన్స్ ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు పబ్లిక్‌కి అందుబాటులో ఉండే పోస్ట్‌ను చేస్తే.. మీ తర్వాతి పోస్ట్‌లు కూడా అలాగే ఉంటాయి. ఈ కొత్త సెట్టింగ్‌లతో మీరు ప్రత్యేకించి మీ ఆడియోన్స్ ఎంచుకోవచ్చు. మీరు పోస్టు చేసిన ఏదైనా పోస్టును కొత్త సెట్టింగ్ ద్వారా వారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. దీనికి మీ మునుపటి పోస్ట్‌లోని సెట్టింగ్‌లతో సంబంధం ఉండదని గుర్తించాలి. మీ ఫ్రెండ్స్ లిస్టులో ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే మీ పోస్ట్ కనిపించేలా చేయవచ్చు.
మీ ఆడియోన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే? :
– Facebook టాప్ రైట్ కార్నర్‌వైపు Click చేయండి.
– Settings > Privacy Option
– Click చేయండి
– Settingsపై క్లిక్ చేయండి
– ఆపై Privacy క్లిక్ చేయండి.
– మీ యాక్టివిటీ ఫీడ్‌కు వెళ్లండి.
– మీ ఫ్యూచర్ పోస్ట్‌లను ఎవరు చూడగలరు?
– Edit బటన్‌పై క్లిక్ చేయండి.
– డ్రాప్‌డౌన్ మెను ద్వారా డిఫాల్ట్‌గా మీకు కావలసిన ఆడియోన్స్ ఎవరో ఎంచుకోండి.
– వెంటనే Save చేయండి.
ఫేస్ బుక్ ఆడియెన్స్‌తో పాటు, Facebook యూజర్లు కూడా న్యూస్ ఫీడ్‌లో చూసే యాడ్స్ కంట్రోల్ చేయొచ్చు. Meta యాడ్ టాపిక్స్, ఇంట్రెస్ట్ కేటగిరీస్ కంట్రోల్స్‌ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు అని మెటా పేర్కొంది. కొత్త సెట్టింగ్ యాడ్ టాపిక్‌ల కోసం ప్రాధాన్యతలను సెట్ చేసేందుకు యూజర్లకు సింగిల్ కంట్రోల్‌ని సెట్ చేసేందుకు అనుమతిస్తుంది.
Read Also : Facebook Lock : ఫేస్‌బుక్‌పై యూజర్ల ఆగ్రహం.. కారణం లేకుండానే అకౌంట్లు లాక్..!