Jio NewYear Offer : జియో యూజర్లకు న్యూ ఇయర్ గ్రేట్ ఆఫర్.. డోంట్ మిస్..!

రిలయన్స్ జియో స్పెషల్ ఆఫర్ ప్రవేశపెట్టింది. జియో తమ యూజర్ల కోసం లిమిటెట్ పిరియడ్‌తో న్యూ ఇయర్ గ్రేటర్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 7 వరకు మాత్రమే..

Jio NewYear Offer : జియో యూజర్లకు న్యూ ఇయర్ గ్రేట్ ఆఫర్.. డోంట్ మిస్..!

Jio Users, Now You Will Be Able To Take Advantage Of This Great Offer

Updated On : January 4, 2022 / 10:37 AM IST

Jio NewYear Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో స్పెషల్ ఆఫర్ ప్రవేశపెట్టింది. జియో తమ యూజర్ల కోసం లిమిటెట్ పిరియడ్‌తో న్యూ ఇయర్ గ్రేటర్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం జనవరి 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు రిలయన్స్ జియో కస్టమర్ అయితే ఇదే సరైన అవకాశం. ఈ ప్రత్యేక లిమిటెడ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. వాస్తవానికి.. కొత్త సంవత్సరానికి ముందు రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఈ గ్రేట్ ఆఫర్‌ను ప్రకటించింది.

రిలయన్స్ జియో 2,545 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులను చేసిన సంగతి తెలిసిందే. 336 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని 365 రోజులకు పెంచింది. అయితే, ఈ ప్లాన్ లిమిటెడ్ పిరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. Jio వెబ్‌సైట్ ప్రకారం.. జియో యూజర్లు ముందుగా ఈ ఆఫర్‌ను జనవరి 2, 2022 వరకు ఉపయోగించుకోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫర్‌ను జనవరి 7 వరకు పొడిగించినట్టు జియో ఒక ప్రకటనలో వెల్లడించింది.

జియో రూ. 2545 ప్లాన్ : 
రిలయన్స్ జియో రూ. 2545 ప్లాన్‌ ద్వారా యూజర్లు రోజుకు 1.5 GB డేటాను పొందవచ్చు. Jio యూజర్లు మొత్తం 504 GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే కొత్త ఏడాది సందర్భంగా జియో తమ యూజర్ల కోసం రిలయన్స్ జియో ప్లాన్ వ్యాలిడిటీని 365 రోజులకు పెంచింది.

ఈ ప్లాన్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 7 తర్వాత జియో యూజర్లకు ఈ ఆఫర్‌ అందుబాటులో లేదు. ఈ కొత్త జియో ప్లాన్‌లో బెనిఫిట్స్ ఏమున్నాయంటే.. అన్ని నెట్‌వర్క్‌లలో రోజుకు 100 SMS పంపుకోవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్స్ చేసుకోవచ్చు. అంటే.. మీరు ఎవరితోనైనా గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. అంతేకాదండోయ్.. ఈ ప్లాన్‌లో జియో యాప్‌ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Read Also : WhatsApp ban: 18లక్షల అకౌంట్లు బ్యాన్ చేసిన వాట్సప్