Surya Grahan Google : ఈరోజే సూర్యగ్రహణం.. గూగుల్ సెర్చ్‌లో ఇలా టైప్ చేయండి.. స్పెషల్ సూర్య గ్రహణ్ యానిమేషన్ మ్యాజిక్.. భలే ఉందిగా..!
Surya Grahan Google : గూగుల్ సెర్చ్‌లో 'సూర్య గ్రహణ్' అని ఓసారి టైప్ చేసి చూడండి.. స్పెషల్ సూర్యగ్రహణ యానిమేషన్ కనిపించిందా?

Surya Grahan Google
Surya Grahan Google : ఇంటర్నెట్ యూజర్ల కోసం సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 21న (ఈరోజు) పాక్షిక సూర్యగ్రహణం రాత్రి 10:59 గంటలకి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22న అర్ధరాత్రి 1:11 గంటలకు సంభవించనుంది. ఖగోళ సంఘటన తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది.
ఈ సందర్భంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో స్పెషల్ యానిమేషన్ క్రియేట్ చేసింది. మీరు గూగుల్ సెర్చ్‌లో ‘Surya Grahan’ (Solar Eclipse in Hindi) అని టైప్ చేస్తే.. మీరు ఖగోళ సంఘటనకు సంబంధించి మ్యాజిక్ యానిమేషన్‌ను చూస్తారు. ఈ క్రియేటివిటీ ఫీచర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ వినియోగదారులు ప్రత్యేకమైన యానిమేషన్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియలో షేర్ చేస్తున్నారు.
గూగుల్ స్పెషల్ సూర్యగ్రహణ యానిమేషన్ :
సూర్యగ్రహణం ఏర్పడినప్పుడల్లా గూగుల్ తరచుగా (Surya Grahan Google) ఒక స్పెషల్ ఫీచర్ రూపొందిస్తోంది. ఈసారి, సెర్చ్ బార్‌లో “Surya Grahan” అని టైప్ చేస్తే చాలు ఇంటరాక్టివ్ యానిమేషన్ ప్రారంభమవుతుంది. ఇందులో చంద్రుని గ్రాఫిక్ సూర్యుని మీదుగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. మీ కంప్యూటర్ స్క్రీన్‌పై చిన్న సూర్యగ్రహణం మాదిరిగా కనువిందు చేస్తుంది. యానిమేషన్‌తో పాటు గ్రహణానికి సంబంధించి పూర్తి కంటెంట్ వీక్షించేందుకు ఆప్షన్ కూడా ఉంది.
ఈ ఫీచర్ ఎందుకంటే?? :
ముఖ్యమైన సంఘటనలు, పండుగలు లేదా శాస్త్రీయపరమైన అంశాలపై గూగుల్ తరచుగా ఇలాంటి క్రియేటివిటీ యానిమేషన్లను అందిస్తుంది. సూర్య గ్రహణ్ యానిమేషన్ కూడా అలానే రూపొందించింది. ఈ ఫీచర్ యూజర్లను ఆకర్షించేడమే కాకుండా గ్రహణాల వంటి ఖగోళ సంఘటనలపై అవగాహన పెంచుతుంది.
ఆన్‌లైన్ సూర్యగ్రహణం యానిమేషన్‌పై యూజర్ల స్పందన :
ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు గూగుల్ యానిమేషన్ స్క్రీన్‌షాట్‌లు, షార్ట్ వీడియోలతో స్పందిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు “మ్యాజిక్ టచ్” అంటున్నారు. సాధారణ ప్రజలకు కూడా అవగాహన కల్పించడంపై గూగుల్‌ను ప్రశంసించారు. ఆసక్తి ఉన్న యువ విద్యార్థులు, అంతరిక్ష ఔత్సాహికులకు సూర్యగ్రహణాల గురించి మరింత తెలుసుకోవచ్చు.
‘సూర్యగ్రహణం’ యానిమేషన్ కోసం ఇలా ట్రై చేయండి :
మీరు గూగుల్ సెర్చ్‌కు వెళ్లి ‘Surya Grahan’ అని టైప్ చేయండి.
ఫన్నీ యానిమేషన్ చూడటమే కాకుండా తేదీలు, టైమ్, శాస్త్రీయ వాస్తవాలతో సహా సూర్యగ్రహణం గురించి ఫుల్ డేటా యాక్సెస్ చేయవచ్చు.