సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్

ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ ఇక నుంచి కనిపించదు. అందుబాటులో ఉండదు. డౌన్ లోడ్ చేసుకోలేం. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ లో కనిపించకపోయినా..

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 05:11 AM IST
సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్

Updated On : April 17, 2019 / 5:11 AM IST

ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ ఇక నుంచి కనిపించదు. అందుబాటులో ఉండదు. డౌన్ లోడ్ చేసుకోలేం. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ లో కనిపించకపోయినా..

టిక్ టాక్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్. చైనాకు చెందిన ఈ యాప్ ను నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ ఇక నుంచి కనిపించదు. అందుబాటులో ఉండదు. డౌన్ లోడ్ చేసుకోలేం. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ లో కనిపించకపోయినా.. యాపిల్ స్టోర్ లో మాత్రం ఉంటుంది. టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయటంపై ఆ కంపెనీ కోర్టులో స్టే కోరింది. ఈ పిటీషన్ తిరస్కరణకు గురైంది. ఈ పరిణామంతో గూగుల్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
Read Also : గూగుల్ Trends : TikTok యాప్ కోసం తెగ వెతికేస్తున్నారు

టిక్ టాక్ యాప్ వల్ల యువత చెడిపోతున్నారని.. దీన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ఈ యాప్ ను నిషేధించాలని ఆదేశించింది. ఈ తీర్పు టిక్ టాక్ యాప్ కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికిప్పుడు మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పపట్టలేం అంటూ సమర్థించింది సుప్రీంకోర్టు. అయితే తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన టిక్ టాక్ యాప్ నిషేధం అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగానే గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి యాప్ ను తొలగించింది.
ఒక్క భారతదేశంలోనే టిక్ టాక్ యాప్ ను 240 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 2019 జనవరి ఒక్క నెలలోనే 30 మిలియన్ల మంది ఈ యాప్ ను తమ మొబైల్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకున్నారు. ప్రపంచంలోనే ఈ యాప్ మూడో స్థానంలో ఉంది. గూగుల్, ఆపిల్ తర్వాత టిక్ టాక్ దే హవా. ఇటీవలే అసభ్యకరంగా ఉన్న 60 లక్షల వీడియోలను డిలీట్ చేసిన సంస్థకు ఇప్పుడు ఇది పెద్ద షాక్. అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, హాంకాంగ్ దేశాల్లోనూ టిక్ టాక్ పై నిషేధం ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో ఇండియా చేరింది. 

ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఇప్పుడు డౌన్ లోడ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటిలాగే వర్క్ చేస్తోంది. కొత్తగా డౌన్ లోడ్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యం కాదు. అంటే ఇంకా ఇది పూర్తిగా మాయం కాలేదు. ఒకవేళ మొబైల్ నుంచి యాప్ డిలీట్ అయితే అందుబాటులో లేకుండా పోతుంది. సో.. ప్రజెంట్ వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట.