గూగుల్ ఏరివేత : 29 ‘బ్యూటీ కెమెరా’ యాప్స్ తొలగింపు 

గూగుల్ ప్లే స్టోర్ లో రోజుకూ ఎన్నో యాప్ లు వచ్చి చేరుతున్నాయి. ఇందులో ఏ యాప్ సేఫ్.. ఏ యాప్ డేంజరస్ అనేది గుర్తించలేం. కొన్ని యాప్ లకు ఫేక్ స్టార్ రివ్యూలతో యూజర్లను తప్పుదోవ పట్టించేలా ట్రిక్స్ ప్లే చేస్తుంటారు.  

  • Published By: sreehari ,Published On : February 4, 2019 / 03:40 PM IST
గూగుల్ ఏరివేత : 29 ‘బ్యూటీ కెమెరా’ యాప్స్ తొలగింపు 

Updated On : February 4, 2019 / 3:40 PM IST

గూగుల్ ప్లే స్టోర్ లో రోజుకూ ఎన్నో యాప్ లు వచ్చి చేరుతున్నాయి. ఇందులో ఏ యాప్ సేఫ్.. ఏ యాప్ డేంజరస్ అనేది గుర్తించలేం. కొన్ని యాప్ లకు ఫేక్ స్టార్ రివ్యూలతో యూజర్లను తప్పుదోవ పట్టించేలా ట్రిక్స్ ప్లే చేస్తుంటారు.  

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల యుగం. అరచేతిలోనే ప్రపంచాన్నే చుట్టేయొచ్చు. స్మార్ట్ టెక్నాలజీ వచ్చాక క్షణాల్లో ఏ సమాచారమైనా ఇట్టే చేరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజూకీ కొన్ని మిలియన్ల డేటా షేర్ అవుతోందట. ఇలా ఒకరి నుంచి మరొకరికి షేర్ అయ్యే డేటా ఎంతవరకు సేఫ్ అన్నది చెప్పడం కష్టమే మరి. ఆండ్రాయిడ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పుట్టగొడుగుల్లా యాప్స్ పుట్టకొస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ లో రోజుకూ ఎన్నో యాప్ లు వచ్చి చేరుతున్నాయి.

ఇందులో ఏ యాప్ సేఫ్.. ఏ యాప్ డేంజరస్ అనేది గుర్తించలేం. కొన్ని యాప్ లకు ఫేక్ స్టార్ రివ్యూలతో యూజర్లను తప్పుదోవ పట్టించేలా ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. ఇందులో హానికర వైరస్ (మాలసియస్)తో కూడిన పాప్ అప్ యాప్స్ పెడుతుంటారు. అది తేలియని యూజర్లు ఏదో తమకు పనికి వస్తుందని, అవసరం ఉన్నా లేకున్నా డౌన్ లోడ్ చేసుకుంటుంటారు. మీకు తెలియకుండానే మీ సిస్టమ్, స్మార్ట్ ఫోన్ లోకి యాడ్స్ రూపంలో మాల్షియస్ వైరస్ చొరబడుతుందని, మీ వ్యక్తిగత సమాచారం చోరీ అవుతుందని గ్రహించలేకపోతున్నారు.

ఇండియాలోనే అధికం..
ఒక్క భారత్ లోనే ఇలా యాప్స్ ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగలిస్తున్నట్టు అమెరికా ఆధారిత సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో నివేదిక తెలిపింది. ఈ క్రమంలో గూగుల్ ఏరివేత స్టార్ట్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో అనుమానిత యాప్స్ ను గుర్తించి ఏరిపారేస్తోంది. ఇప్పటివరకూ ప్లే స్టోర్ నుంచి ‘బ్లూ కెమెరా‘ వంటి 29 మాల్షియస్ (malicious Apps) యాప్స్ ను గూగుల్ తొలగించింది. ఈ యాప్స్ లో ఎక్కువగా పోర్నోగ్రాఫిక్ కంటెంట్, యూజర్లకు ఫార్వార్డ్ చేస్తున్నారట.

అందులో ఆసియాలోని ఒక్క భారత్ లోనే ఈ తరహా యాప్స్ ను భారీగా మిలియన్ల సార్లు డౌన్ లోడ్ చేయగా, ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఇక్కడి నుంచే షేర్ అవుతున్నట్టు గుర్తించింది. పిషింగ్ వెబ్ సైట్లకు రీడైరెక్ట్ చేసి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నట్టు ట్రెండ్ మైక్రో పేర్కొంది. ‘‘ఈ యాప్స్ లో ఏదైనా యాప్ ఒకటి యూజర్లు డౌన్ లోడ్ చేసే సమయంలో అనుమానించడం లేదు. ఏదైనా సమస్య తలెత్తితే తప్ప ఆ యాప్ నుంచి డిలీట్ చేయడం లేదు’’ అని ట్రెండ్ మైక్రో అభిప్రాయపడింది.  

ఈ యాప్స్ తో జర జాగ్రత్త
‘బ్యూటీ కెమెరా’ వంటి డేంజరస్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నాక.. ఫుల్ స్ర్కీన్ యాడ్స్ ను డిసిప్లే చేస్తుంటాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎప్పుడు అయితే ఫోన్ అన్ లాక్ చేస్తారో వెంటనే ఈ యాప్స్ .. మాల్షియస్ యాడ్స్ తో పాటు (పోర్నోగ్రాఫిక్ కంటెంట్, ఫ్రాడ్ కంటెంట్)తో బ్రౌజర్లపై పాప్ అప్ యాడ్స్ డిసిప్లే అవుతాయి. ఇలాంటి యాడ్స్  డిసిప్లే అయిన సమయంలో ఆన్ లైన్ పోర్నోగ్రఫీ ప్లేయర్ డౌన్ లోడ్ కోసం పాప్ అప్ యాడ్ డిసిప్లే అయినట్టు గుర్తించామని నివేదిక తెలిపింది.

మిగతా బ్యూటీ కెమెరా యాప్స్ లో వెనుక మాత్రమే మాలసియస్ యాడ్స్ డిసిప్లే అవుతుంటాయి. ఈ యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం చాలా కష్టం. ఇందులో కొన్ని యాప్స్.. ఫిషింగ్ వెబ్ సైట్లకు రీడైరెక్ట్ అయి.. వ్యక్తిగత వివరాలు (మీ అడ్రస్, ఫోన్ నెంబర్) ను ఎంటర్ చేయమని అడుగుతాయి. 

ఉదాహరణకు.. the package com.beauty.camera.project. ఇలా ఓ షార్ట్ కట్ ఐకాన్ క్రియేట్ అవుతుంది. ఈ ఐకాన్ మీకు కనిపించదు. ఆప్లికేషన్ లిస్ట్ లో ఈ ఐకాన్ హైడ్ అయి ఉంటుంది. ఈ యాప్ ను గుర్తించి యూజర్లు అన్-ఇన్స్టాల్ చేయలేరు. యాప్ ను డ్రాగ్ చేయలేరు కదా.. డిలీట్ కూడా చేయలేరని ట్రెండ్ మైక్రో తెలిపింది. తద్వారా మీ వ్యక్తిగత డేటా చోరీకి గురి అవుతోంది. మీరూ కూడా తెలుసో తెలియకో ఇలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారేమో చెక్ చేసుకోండి. విలువైన మీ పర్సనల్ డేటాను భద్రపరుచుకోండి.