Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ప్రీ-ఆర్డర్ చేసుకోండి.. అక్టోబర్ 17నే సేల్.. ధర, స్పెసిఫికేషన్‌లు వివరాలివే!
Google Pixel 9 Pro Pre Order Sale : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ప్రీ-ఆర్డర్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ పిక్సెల్ 9 ప్రో ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

Google Pixel 9 Pro Pre-Orders ( Image Source : Google )
Google Pixel 9 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో ఈ ఏడాది ఆగస్టులో గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ కొత్త మోడల్ పిక్సెల్ 9 ప్రో లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లాంచ్ అయ్యాయి. ఇందులో పిక్సెల్ ప్రో వేరియంట్ ఇదివరకే దేశంలో విక్రయానికి వచ్చింది.
తాజాగా ఈ వారంలో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంటుంది. ఈ పిక్సెల్ ప్రో ఫోన్ ధర, కలర్ ఆప్షన్లను గతంలో కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం ధృవీకరించింది. పిక్సెల్ 9 ప్రో టైటాన్ ఎమ్2 సెక్యూరిటీ చిప్‌సెట్‌తో పాటు టెన్సర్ జీ4 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. అలాగే, ఈ పిక్సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది.
Read Also : WhatsApp Accounts Ban : ప్రైవసీ రూల్స్ బ్రేక్.. ఒకే నెలలో 80 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం!
భారత్‌లో పిక్సెల్ 9ప్రో ప్రీ-ఆర్డర్ సేల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో 16జీబీ+256జీబీ ఆప్షన్ ధర రూ. 1,09,999కు లాంచ్ అయిందని కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు, అక్టోబర్ 17న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ప్రీ-ఆర్డర్ సేల్ ప్రారంభం కానుంది. పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ వేరియంట్ మాదిరిగానే హాజెల్, పోరసెలియన్, రోజ్ క్వార్ట్జ్, అబ్సిడియన్ కలర్‌వేస్‌లో అందిస్తుంది.
పిక్సెల్ 9ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9ప్రో 6.3-అంగుళాల 1.5కె (1,280 x 2,856 పిక్సెల్‌లు) సూపర్ అక్టవా (LTPO) ఓఎల్ఈడీ డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 3,000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. టైటాన్ ఎమ్2 సెక్యూరిటీ చిప్‌సెట్‌తో పాటు టెన్సర్ జీ4 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల 9ప్రో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 48ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన మరో 48ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం కెమెరా నుంచి 42ఎంపీని అందిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9ప్రో ఫోన్ 4,700mAh బ్యాటరీని 45డబ్ల్యూ వైర్డుతో పాటు క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, గూగుల్ క్యాస్ట్, జీపీఎస్, డ్యూయల్ బ్యాండ్ జీఎన్ఎస్ఎస్, జీఎల్ఓఎన్ఎఎస్ఎస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఎవిఐసీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
Read Also : Tata Group Jobs : టాటా గ్రూపులో వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. వీటికే ఫుల్ డిమాండ్!