Google Pixel 9 Pro : పిక్సెల్ ఫ్యాన్స్ డోంట్ మిస్.. అమెజాన్‌లో పిక్సెల్ 9 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ జన్మలో రాదు..!
Google Pixel 9 Pro : అమెజాన్‌లో అద్భుతమైన డీల్.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో కన్నా ఖతర్నాక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. పిక్సెల్ 10 సిరీస్ మార్కెట్లోకి వచ్చిన కొన్ని నెలలకే గూగుల్ గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 ప్రో భారీగా తగ్గింపు పొందింది. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.24,700 కన్నా ఎక్కువ తగ్గింపుతో కొనేసుకోవచ్చు.

అసలు ధర రూ.89,000 కన్నా తక్కువకు సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ప్రీమియం బిల్డ్, గూగుల్ కస్టమ్ టెన్సర్ చిప్, హై కెపాసిటీ గల ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. టాప్-టైర్ ధర చెల్లించకుండానే ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. మీరు ఈ అదిరిపోయే డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పిక్సెల్ 9 ప్రో అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో అసలు ధర రూ.1,09,999 ఉండగా అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.21,009 ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. తద్వారా పిక్సెల్ 9 ప్రో ధర రూ.88,990కి తగ్గుతుంది. ఈఎంఐ పేమెంట్లతో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలుదారులు అదనంగా రూ.3,750 తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు.

పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9 ప్రో టెన్సర్ G4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,700mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌ను అందించే 6.3-అంగుళాల LTPO డిస్‌ప్లే కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా కలిగి ఉంది.
