wifinanscan : ఇంటర్నెట్ లేకుండా లార్జ్ డేటా షేర్ చేయాలా? అయితే ఇది మీ కోసమే!
గూగుల్ ప్లే స్టోర్‌లో డెవలపర్‌ల కోసం wifinanscan అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఇతర పరికరాలతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది, అంతేకాదు ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చాలా పనులు చేయవచ్చు.

Google Wifinanscan App Uses Google Releases Wifinanscan App For Developers
wifinanscan : గూగుల్ ప్లే స్టోర్‌లో డెవలపర్‌ల కోసం wifinanscan అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఇతర పరికరాలతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది, అంతేకాదు ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చాలా పనులు చేయవచ్చు. ఈ Wi-Fi అవేర్ ప్రోటోకాల్ ఉపయోగించి రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఖచ్చితమైన దూరాన్ని కూడా కొలవచ్చు.
wifinanscan యాప్ ను ప్రత్యేకంగా డెవలపర్లు, విక్రేతలు మరియు విశ్వవిద్యాలయాల కోసం టెస్టింగ్ సాధనంగా రూపొందించారు. ఈ యాప్ తో, ఒకటి నుండి 15 మీటర్ల వరకు ఉన్న పరికరాల మధ్య దూరాన్ని ఖచ్చితత్వంతో కొలవవచ్చు. డెవలపర్లు పీర్-టు-పీర్ రేంజ్, డేటా బదిలీతో వైఫై అవేర్ / NAN API ల ఆధారంగా రెండు ఫోన్ల మధ్య దూరం లేదా పరిధిని కొలవడానికి ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు.
వై-ఫై అవేర్ నెట్‌వర్క్ కనెక్షన్ బ్లూటూత్‌తో పోలిస్తే ఎక్కువ రేంజ్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఫోటో-షేరింగ్ తోపాటు వినియోగదారుల మధ్య పెద్ద మొత్తంలో డేటాను పంచుకునేందుకు ఈ రకమైన కనెక్షన్లు ఉపయోగపడతాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా లార్జ్ డేటా షేరింగ్ కోసం డెవలపర్లు ఈ యాప్ ను ఆశ్రయించవచ్చు.