iPhone Update Warn : ఆపిల్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్.. మీ ఐఫోన్లు, మ్యాక్‌బుక్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. సేఫ్‌గా ఉండాలంటే?
iPhone Update Warn : సైబర్ దాడుల నుంచి రక్షించడానికి అత్యంత ఇటీవలి సాఫ్ట్‌వేర్‌తో తమ డివైజ్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని (CERT-In) ఆపిల్ యూజర్లను హెచ్చరిస్తోంది.

Govt issues high-risk warning for Apple users, ask them to update iPhone
iPhone Update Warn : భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), ఆపిల్ డివైజ్ యూజర్ల కోసం ‘అధిక’ భద్రతా ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో, CERT-In అనేక భద్రతపరమైన లోపాలను హెచ్చరిస్తుంది. అలానే వదిలేస్తే.. యూజర్ల ఫోన్‌లకు అనధికారిక యాక్సెస్, సున్నితమైన డేటా దొంగలించే ప్రమాదం ఉంది. సఫారీ (Safari) ఇతర బ్రౌజర్‌లు ఉపయోగించే వెబ్‌కిట్ బ్రౌజర్ ఇంజిన్ తీవ్రమైన భద్రతా లోపాలను కలిగి ఉందని CERT-In హెచ్చరించింది.
ఐఫోన్ (iPhone), ఆపిల్ వాచ్ (Apple Watch) వంటి ఆపిల్ డివైజ్‌ల యూజర్లకు తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. హానికరమైన వెబ్‌సైట్‌లను విజట్ చేయడం లేదా హానికరమైన లింకులను ఓపెన్ చేయడానికి యూజర్లను మోసగించడానికి సైబర్ నేరగాళ్లను అనుమతించగలవు. యూజర్ వ్యక్తిగత సమాచారం, ఫైల్‌లకు, యూజర్ డివైజ్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేసే సామర్థ్యాన్ని కూడా యాక్సెస్ చేయగలదు. ఆపిల్ ప్రొడక్టుల్లో అనేక భద్రతా లోపాలు బయటపడ్డాయి.
సైబర్ దాడికి పాల్పడే వ్యక్తి సింగిల్ కోడ్‌ను అమలు చేసేందుకు లక్ష్యంగా చేసుకున్న సిస్టమ్‌పై భద్రతా పరిమితులను అనుమతించగలవని అధికారిక నోట్ తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే.. ఆపిల్ డివైజ్ వినియోగదారులు ఏ లింక్‌లపై క్లిక్ చేస్తారు లేదా ఏ అటాచ్ మెంట్స్ ఓపెన్ చేస్తారు అనే దాని గురించి జాగ్రత్తగా ఉండకపోతే.. వారి వ్యక్తిగత సమాచారం దొంగలించే ప్రమాదం ఉంది. లేదంటే యూజర్ల డివైజ్‌లు మాల్వేర్ బారిన పడే ప్రమాదం ఉంది.
డేంజర్‌లో ఆపిల్ డివైజ్‌లివే.. :
CERT-In నోట్స్ ప్రకారం.. iOS 16.7 కన్నా ముందు iOS వెర్షన్లలో ఈ దుర్బలత్వాలు ఎక్కువగా ఉన్నాయి. హైరిస్క్ ఉన్న ఆపిల్ డివైజ్ జాబితాను ఓసారి చెక్ చేయండి.

iPhone Update Warn
* Apple macOS Monterey వెర్షన్లు 12.7కి ముందు
* Apple macOS వెంచురా వెర్షన్లు 13.6కి ముందు
* 9.6.3కి ముందు (Apple watchOS) వెర్షన్లు
* 10.0.1కి ముందు (Apple watchOS) వెర్షన్లు
* 16.7కి ముందు (Apple iOS) వెర్షన్లు, 16.7కి ముందు iPadOS వెర్షన్లు
* 17.0.1కి ముందు (Apple iOS) వెర్షన్లు 17.0.1కి ముందు ఉన్న iPadOS వెర్షన్‌లు
* 16.6.1కి ముందు ఉన్న (Apple Safari) వెర్షన్లు
ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
వివిధ సాఫ్ట్‌వేర్ రిలీజ్ అంతటా సైబర్ సెక్యూరిటీ సమస్యలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన జాతీయ అధికారం ప్రకారం.. యూజర్ల వ్యక్తిగత డేటాను భద్రపరచడంపై ఆందోళన చెందుతున్న వ్యక్తులు తమ ఆపిల్ డివైజ్‌ల్లో watchOS, tvOS, macOS కోసం ఇటీవలి అప్‌డేట్‌లను వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాలని గట్టిగా సిఫార్సు చేసింది. ఆపిల్ వాచీలు, స్మార్ట్ టీవీలు, ఐఫోన్లు, (MacBooks)లో సాఫ్ట్‌వేర్ దుర్బలత్వాలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అనధికారిక యాక్సెస్‌కు ఈ డివైజ్‌లను బహిర్గతం చేయవచ్చు.
ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ (cert-in.org.in)లో ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అప్‌గ్రేడ్‌లను కూడా అందించింది. ఇంకా, Apple iPhone, iPad, WatchOS యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో మెరుగైన భద్రతా ఫీచర్లు, డివైజ్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి.