Happy Holi 2023 : హోలీ 2023.. వాట్సాప్‌లో స్టిక్కర్లను ఎలా క్రియేట్ చేయాలి? మీ స్నేహితులకు ఎలా పంపాలో తెలుసా? పూర్తి వివరాలివే..!
Happy Holi 2023 : హోలీ పండుగ (Holi Festival) వచ్చేసింది.. రంగులు, స్వీట్లతో పండుగను కుటుంబం, స్నేహితులతో జరుపుకునే సమయం.. అందరూ ఒకేచోట చేరి సరదాగా హోలీ వేడుకలను జరుపుకోవచ్చు.

Happy Holi 2023 How to create and send personalised WhatsApp stickers and GIFs to wish friends and family
Happy Holi 2023 : హోలీ పండుగ (Holi Festival) వచ్చేసింది.. రంగులు, స్వీట్లతో పండుగను కుటుంబం, స్నేహితులతో జరుపుకునే సమయం.. అందరూ ఒకేచోట చేరి సరదాగా హోలీ వేడుకలను జరుపుకోవచ్చు. ఇంటికి లేదా స్నేహితులకు దూరంగా ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో కూడా హోలీ శుభాకాంక్షలను తెలపవచ్చు. అందుకు (WhatsApp) బెస్ట్ ప్లాట్ ఫారం. వాట్సాప్ ద్వారా హోలీ పండుగ శుభాకాంక్షలను మెసేజ్‌లతో షేర్ చేయొచ్చు.
GIFలు, హోలీ స్టిక్కర్‌లను పంపుకోవచ్చు. మీ ప్రియమైనవారికి సరదాగా రంగురంగుల హోలీ శుభాకాంక్షలు తెలియజేసేందుకు Android ఫోన్ లేదా iPhoneలో కస్టమైజ్ చేసిన WhatsApp స్టిక్కర్‌లు, Gifలను ఎలా క్రియేట్ చేసి పంపుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ స్టిక్కర్లను ఎలా క్రియేట్ చేయాలంటే? :
వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్‌లను క్రియేట్ చేయడానికి (WhatsApp)లో స్పెషల్ ఫీచర్ ఏదీ అందుబాటులో లేదు. మరిన్ని స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేయడం లేదా హోలీ కోసం మీ సొంత కస్టమైజడ్ WhatsApp స్టిక్కర్‌లను రూపొందించవచ్చు. థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు.
– గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి స్టిక్కర్ మేకర్ (Sticker Maker) యాప్ కోసం సెర్చ్ చేయండి.
– ఇప్పుడు మీరు ఉపయోగించాలనుకునే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
– మీరు స్టిక్కర్ మేకర్, WhatsApp కోసం కస్టమైజడ్ స్టిక్కర్లు, స్టిక్కర్ స్టూడియోతో సహా కొన్ని పాపులర్ స్టిక్కర్ తయారీదారుల యాప్‌లను కూడా ప్రయత్నించవచ్చు.
– స్టిక్కర్ మేకర్ యాప్‌ను ఓపెన్ చేసి.. కొత్త స్టిక్కర్ ప్యాక్ ఆప్షన్ క్రియేట్ అని ట్యాప్ చేయండి.
– మీ సొంత స్టిక్కర్‌లను క్రియేట్ చేసేందుకు ఇలా ఫాలో అవ్వండి :
– మీ స్టిక్కర్ ప్యాక్‌కి పేరు పెట్టండి.
– అందుకోసం ఒక ఐకాన్ యాడ్ చేయండి.
– స్టిక్కర్‌లను సేవ్ చేసిన తర్వాత, ‘Add to WhatsApp’పై నొక్కండి.
– మీ WhatsApp యాప్‌కి స్టిక్కర్‌లను యాడ్ చేయండి.
– వాట్సాప్‌లోని మీ స్టిక్కర్ ప్యాలెట్‌కి స్టిక్కర్లు యాడ్ అవుతాయి.
ఆండ్రాయిడ్‌లో WhatsApp స్టిక్కర్లను ఎలా పంపాలంటే? :
– వాట్సాప్ ఓపెన్ చేసి.. హోలీ స్టిక్కర్లను పంపాలనుకునే చాట్ విండోను ఓపెన్ చేయండి.
– ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్‌లోని ఎమోజీ ఐకాన్‌పై నొక్కండి.
– స్టిక్కర్ సెక్షన్ ఓపెన్ చేయడానికి ఎడమవైపుకు Swipe చేయండి.
– మీరు ఇప్పుడే క్రియేట్ చేసిన స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకోండి.
– మీ కస్టమైజడ్ స్టిక్కర్‌ని Tap చేసి పంపండి.

Happy Holi 2023 How to create and send personalised WhatsApp stickers
ఐఫోన్ యూజర్లు కూడా WhatsApp స్టిక్కర్లను క్రియేట్ చేసే ప్రక్రియ Andorid మాదిరిగా ఉంటుంది. iOS 16.0తో తమ iPhoneలను అప్‌డేట్ చేసిన యూజర్లు ఫొటోల యాప్‌లో సేవ్ చేసిన ఫొటోలను ఉపయోగించి WhatsApp స్టిక్కర్‌లను రూపొందించడానికి మరొక పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు.
ఐఫోన్‌లో వాట్సాప్ స్టిక్కర్లను ఎలా క్రియేట్ చేయాలంటే? :
ఆపిల్ ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం (WhatsApp)లో కస్టమ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేయొచ్చు. మీరు iOS 16 కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలి. డ్రాగ్ డ్రాప్ ఆప్షన్ ద్వారా నేరుగా WhatsAppలో షేర్ చేసేందుకు అనుమతిస్తుంది.
– మీ iPhoneలో ఫొటోల యాప్‌ను ఓపెన్ చేయండి.
– వేరు చేయడానికి ఫోటోను ఎంచుకుని, దానిపై ఎక్కువసేపు నొక్కండి.
– మీరు మీ కస్టమైజడ్ స్టిక్కర్‌ని పంపే WhatsApp చాట్‌లోకి సబ్జెక్ట్‌ని Long Press చేయండి.
– ఫొటో లోడ్ అయిన తర్వాత స్టిక్కర్‌గా మార్చాలని WhatsApp మిమ్మల్ని అడుగుతుంది.
– స్టిక్కర్ క్రియేట్ చేసిన తర్వాత మీ WhatsApp స్టిక్కర్‌పై కూడా సేవ్ అవుతుంది.
– మీరు ఇతర చాట్‌లలో కూడా అదే స్టిక్కర్‌లను ఉపయోగించవచ్చు.
WhatsAppలో GIFలను ఎలా క్రియేట్ చేయాలి? :
వాట్సాప్‌లో GIFలను క్రియేట్ చేసి పంపే ప్రాసెస్ Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లకు సమానంగా ఉంటుంది.
– WhatsApp ఓపెన్ చేసి.. మీరు GIFని పంపాలనుకుంటున్న చాట్‌కి వెళ్లండి.
– ఇప్పుడు అటాచ్‌మెంట్ ఐకాన్‌పై Tap చేసి ఆపై వీడియోపై Tap చేయండి.
– ఆ తర్వాత గ్యాలరీ నుంచి మీరు GIFగా మార్చాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి.
– WhatAppలో వీడియో ప్రివ్యూ విండో, వీడియో ఆప్షన్ GIFకి టోగుల్ చేయండి.
– ఈ ఆప్షన్ మీ వీడియోను GIFగా మారుస్తుంది. చాట్‌లో పంపడానికి GIFపై Tap చేయండి.
Read Also : Nothing Phone (2) : నథింగ్ ఫోన్ (2) ఫోన్ వచ్చేస్తోంది.. ఇదిగో కీలక ఫీచర్ లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?