Honor 100 Series Launch : ఈ నెల 23న హానర్ 100 సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Honor 100 Series : హానర్ కొత్త సిరీస్ ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ నెల 23న గ్లోబల్ మార్కెట్లో హానర్ 100 సిరీస్ ఫోన్ ప్రవేశపెట్టనుంది. రాబోయే కొత్త ఫోన్ ఏయే ఫీచర్లు ఉండనున్నాయో ఓసారి లుక్కేయండి.

Honor 100 Series Launch : ఈ నెల 23న హానర్ 100 సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Honor 100 series confirmed to launch on November 23 in China

Updated On : November 17, 2023 / 4:34 PM IST

Honor 100 Series Launch : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి రెడీగా ఉంది. హానర్ ఈ కొత్త లైనప్‌ను గత నెలలో అమెరికాలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించింది. ఇటీవలే హానర్ మ్యాజిక్ 6 సిరీస్‌ను లాంచ్ చేసింది. రాబోయే మరో స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో హానర్ 100 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో రెండు మోడల్‌లు ఉంటాయి. హానర్ 100, హానర్ 100 ప్రో మోడల్ గత ఏడాదిలో హానర్ 90 లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అందించనుంది.

Read Also : Honor Play 8T Launch : భారీ బ్యాటరీతో హానర్ ప్లే 8T ఫోన్ వచ్చేసింది.. ధర, స్పెషిఫికేషన్ల పూర్తి వివరాలివే..!

హానర్ 100 సిరీస్ లాంచ్ తేదీ సంబంధించి కంపెనీ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో రివీల్ చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌ హానర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, క్యాంపెయిన్ వీడియోను కూడా షేర్ చేసింది. వెయిబో పోస్ట్ ప్రకారం.. హానర్ 100, హానర్ 100 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను నవంబర్ 23న చైనాలో వెల్లడించనుంది. అయితే, కంపెనీ హోమ్ టర్ఫ్‌లో ఫోన్‌ల లభ్యత వివరాలను వెల్లడించలేదు. హానర్ స్మార్ట్‌ఫోన్ లైనప్ గ్లోబల్ లభ్యత గురించి ఎలాంటి వివరాలను కూడా షేర్ చేయలేదు.

హానర్ 100 సిరీస్ స్పెషిఫికేషన్లు (అంచనా) :

హానర్ 100, హానర్ 100 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు రెండూ పెద్ద కెమెరా మాడ్యూల్స్ వంటి క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయని కంపెనీ చెబుతోంది. అయితే, రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో మునుపటి మోడల్‌లలోని సింగిల్ కెమెరాతో పోలిస్తే.. రెండు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉంటాయి. నోట్‌బుక్‌చెక్ నివేదిక ప్రకారం.. హానర్ 100 ప్రో గత వెర్షన్ల మాదిరిగానే అల్ట్రా-వైడ్-యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, హానర్ 100 ప్రో అదనంగా బ్యాక్ సైడ్ కెమెరాను కలిగి ఉంటుంది.

Honor 100 series confirmed to launch on November 23 in China

Honor 100 series launch 

వనిల్లా మోడల్‌లో అందుబాటులో ఉండదు. హానర్ ఇంకా ఫుల్ కెమెరా స్పెసిఫికేషన్‌లను రివీల్ చేయలేదు. వైబోలో షేర్ చేసిన టీజర్ ఫొటోల వివరాలను నిర్ధారించాయి. ఉదాహరణకు, రెండు మోడల్‌లు ఎఫ్/1.9 ఎపర్చరుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటాయి. ఫీచర్లను పోల్చి చూస్తే.. హానర్ 90 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 200ఎంపీ సెన్సార్‌తో వచ్చాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తాయి. 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

Read Also : Honor X50i Plus Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో హానర్ X50i ప్లస్ ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!