ఎక్సేంజ్ ఆఫర్లు.. క్యాష్ బ్యాక్ : హానర్ వ్యూ20 వచ్చేసింది

ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ హువావే కొత్త స్మార్ట్ ఫోన్ ‘హానర్ వ్యూ20’ ను భారత మార్కెట్లలోకి విడుదల చేసింది. బుధవారం (జనవరి 30, 2019) నుంచి అమెజాన్ ఇండియాలో జోరుగా సేల్స్ మొదలయ్యాయి.

  • Published By: sreehari ,Published On : January 30, 2019 / 11:57 AM IST
ఎక్సేంజ్ ఆఫర్లు.. క్యాష్ బ్యాక్ : హానర్ వ్యూ20 వచ్చేసింది

Updated On : January 30, 2019 / 11:57 AM IST

ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ హువావే కొత్త స్మార్ట్ ఫోన్ ‘హానర్ వ్యూ20’ ను భారత మార్కెట్లలోకి విడుదల చేసింది. బుధవారం (జనవరి 30, 2019) నుంచి అమెజాన్ ఇండియాలో జోరుగా సేల్స్ మొదలయ్యాయి.

ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ హువావే కొత్త స్మార్ట్ ఫోన్ ‘హానర్ వ్యూ20’ ను భారత మార్కెట్లలోకి విడుదల చేసింది. బుధవారం (జనవరి 30, 2019) నుంచి అమెజాన్ ఇండియాలో జోరుగా సేల్స్ మొదలయ్యాయి. హానర్ వ్యూ20 స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ లో ఆఫర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 పలుకుతోంది. హానర్ వ్యూ 20 సేల్ పై అదిరిపోయే ఆఫర్లు స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకర్షించేలా ఉన్నాయి. ఈ ఫోన్ పై ఎక్సేంజ్ ఆఫర్లను కూడా లాంచ్ చేశారు. పాత ఫోన్ పై రూ.8,500 ఎక్సేంజ్ ఆఫర్ తో హానర్ వ్యూ 20 ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 

అదిరిపోయే ఫీచర్లు ఇవే..
హానర్ వ్యూ 20 స్పోర్ట్స్ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిసిప్లే తో పాటు 1080*2310 ఫిక్సల్ రిజిల్యూషన్. ఫ్లాగ్ షిప్ కిరిన్ 980 ప్రాసిసర్, జీపీయూ టర్బో 2.0 సపోర్ట్ చేస్తుంది. ప్రపంచ తొలి 7ఎన్ఎం మొబైల్ ఏఐ చిప్ సెట్.. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256 జీబీ ఇంటర్నెల్ స్టోరేజీతో వివిధ రంగుల్లో లభ్యమవుతోంది. హువావే సొంత మ్యాజిక్ యూఐ 2.0 ఆధారంగా ఆండ్రాయిడ్ ‘9.0పై’ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.

ఈ ఫోన్ మరో ఫీచర్ 25 మెగా ఫిక్సల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఆకట్టుకుంటోంది. డ్యుయల్ కెమెరా సెటప్ తో 48 మెగాఫిక్సల్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 586 ప్రైమరీ సెన్సర్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ (టీఓఎఫ్) 3డీ కెమెరా ఉంది. 4000మెగాహెడ్జ్ సూపర్ పవర్ బ్యాటరీ, 4జీ, వీఓఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ. 

జియో యూజర్లకూ క్యాష్ బ్యాక్ ఆఫర్లు
*
 రిలయన్స్ జియో యూజర్లకు రూ.2,200 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. 
2టీబీ వరకు డేటా పొందొచ్చు. 
ఇందులో ఒక్కో వోచర్ పై రూ.50 చొప్పున 44 క్యాష్ బ్యాక్ వోచర్లు ఉన్నాయి. 
మై జియో యాప్ నుంచి ఎవరైతే 30 జనవరి, 2018 తరువాత తొలి రీచార్జ్ చేయించుకున్నారో వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.  
ఐసీసీ క్రెడిట్, డెబిట్ కార్డుల ఈఎంఐ ట్రాన్స్ జెక్షన్లపై 5 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది.
హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డులపై రూ.3వేలుపైనా ఆర్డర్ చేసినవారికి నో కాస్ట్ ఈఎంఐ అప్లికేబుల్. హెచ్ డీఎఫ్ సీ డెబిట్ కార్డులపై రూ.10వేలకు పైగా ఆర్డర్ చేసినవారికి కూడా నో కాస్ట్ ఈఎంఐ అప్లికేబుల్.
అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి పేమెంట్ చేస్తే 2 శాతం వరకు క్యాష్ బ్యాక్