సంక్రాంతికి TikTok వీడియోలను Reverse చేసుకోండిలా!

సంక్రాంతి పండుగ వచ్చేసింది.. పతంగులు ఎగరవేస్తుంటారు.. పిండి వంటలు చేస్తుంటారు.. సరదగా ఫ్యామిలీతో కలిసి హంగామా చేస్తుంటారు. భోగిమంటల సందడిలో పాల్గొంటారు. పచ్చని పొలాల్లో ఎడ్లబండ్లపై తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కొత్త ఏడాదిలో మరవలేని ఎన్నో మదుర జ్ఞాపకాలను భద్రంగా దాచుకోవాలని స్మార్ట్ ఫోన్లలో ఫొటోలు వీడియోల్లో రికార్డు చేస్తుంటారు. ఈసారి సంక్రాంతి పండక్కి రికార్డు చేసే వీడియోలన్నీ TikTok Reverse Videos చేయండి..
ఇంతకీ TikTok వీడియో Reverse చేయడం తెలుసా? సాధారణంగా టిక్ టాక్ వీడియోను రికార్డు చేసినట్టుగా రీవర్స్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్లు మ్యూజిక్, ఇతర వీడియోలను అనుగుణంగా డ్యాన్స్ లేదా డైలాగ్ చెప్పవచ్చు. రెగ్యులర్ వీడియోలా కాకుండా సరికొత్తగా రివర్స్ వీడియోతో
ఇప్పుడంతా టిక్ టాక్ ట్రెండ్. డిజిటల్ ప్రపంచంలో టిక్ టాక్ వీడియోలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. టిక్ టాక్ వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చైనాకు చెందిన బైట్ డాన్స్ కంపెనీ రూపొందించిన ఈ టిక్ టాక్ యాప్ మిలియన్ల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలే ఎక్కువ శాతం వైరల్ అవుతున్నాయి.
టిక్ టాక్ యూజర్లు యాప్ లోని ఫిల్టర్లు, మ్యూజిక్, ఇతర వీడియోలను అనుగుణంగా డ్యాన్స్ లేదా డైలాగ్ చెప్పడం, హావాభావాలను పలికిస్తుంటారు. సాధారణంగా ఇప్పటివరకూ రికార్డు చేసిన వీడియోలను TikTok యాప్ ద్వారా తమకు నచ్చిన విధంగా క్రియేట్ చేస్తున్నారు కదా.
అలానే అదే వీడియోను వెనుక నుంచి ముందుకు Reverse వీడియో చేసుకోవచ్చు. టిక్ టాక్ యాప్ లో Reverse అనే ఎఫెక్ట్ ద్వారా ఈజీగా యూజర్లు క్రియేట్ చేసుకోవచ్చు. టిక్ టాక్ యాప్ లో రివర్స్ ఎఫెక్ట్ ఎలా వర్క్ అవుతుంది.. అదెలా యాక్సస్ చేసుకోవాలో ఓసారి చూద్దాం.
టిక్ టాక్ రివర్స్ వీడియోను ఎప్పటిలానే మీకు నచ్చిన ఫార్మాట్ లో సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ టిక్ టాక్ వీడియోకు ఈ రివర్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి చూడండి.
ఇదిగో ప్రాసెస్ :
* మీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో TikTok app ఓపెన్ చేయండి.
* TikTok app అకౌంట్లోకి Login అవ్వండి.
* Screen కింది మిడిల్ సెక్షన్ (+) sign పై Tap చేయండి.
* Red బటన్ పై నొక్కి పట్టుకోండి.
* మీ Video రికార్డు Start అవుతుంది.
* రికార్డు పూర్తికాగానే Red Check మార్క్ Select చేయండి.
* స్ర్కీన్ కిందిభాగంలో Clock మాదిరిగా ఐకాన్ కనిపిస్తుంది.
* ఆ Clock ఐకాన్ దగ్గర Effects ఆప్షన్ పై Tap చేయండి.
* మీకు Hold to Apply ఎఫెక్ట్స్ అనే కొత్త Efftects కనిపిస్తాయి.
* Visual, Effects తోపాటు Time అనే ఆప్షన్ ఉంటుంది.
* Time ఆప్షన్ పై Tap చేయండి.
* Reverse అనే ఆప్షన్ Select చేయగానే ఎఫెక్ట్ అప్లయ్ అవుతుంది.
* మీరు రికార్డు చేసిన వీడియో Preview Reverse డిస్‌ప్లే అవుతుంది.
* Reverse ఎఫెక్ట్ మీకు నచ్చితే Top-right కార్నర్ లో Save పై Tap చేయండి.
* Tap చేశాక.. స్ర్కీన్.. కుడివైపు పైభాగంలో రివర్స్ వీడియో కనిపిస్తుంది.