Android Spyware : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పైవేర్ ఉందని తెలుసా? ఇలా చెక్ చేసుకోండి!

Android Spyware : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పైవేర్ దాగి ఉందని మీకు తెలుసా? అయినా, ఆందోళన అక్కర్లేదు.. మీ విలువైన డేటా సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఇలా చెక్ చేసుకోండి..

Android Spyware : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పైవేర్ ఉందని తెలుసా? ఇలా చెక్ చేసుకోండి!

How To Check For Spyware On Your Android Smartphone

Updated On : October 18, 2024 / 9:33 PM IST

Android Spyware : మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో స్పైవేర్ ఉందని ఆందోళన చెందుతున్నారా? స్పైవేర్ అనేది ఒక రకమైన మాల్వేర్.. మీ డివైజ్‌లపై దాడి చేయగలదు. ఆ తర్వాత థర్డ్ పార్టీ యాప్‌లకు మీ డేటాను దొంగిలిస్తుంది జాగ్రత్త.. సాధారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో స్పైవేర్ యాప్ సాధారణ యాప్‌గానే కనిపిస్తుంది. కానీ, మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తుంది. (MakeUseOf) వివరణ ప్రకారం.. చీటింగ్, బ్లాక్ మెయిల్, వ్యక్తిగత డేటా విక్రయం వంటి ప్రయోజనాల కోసం ఇతర వ్యక్తులకు మీ డేటా పంపుతుంది.

స్పైవేర్ అత్యంత సాధారణ రకాల్లో ఆడియో, వీడియో, పాస్‌వర్డ్ దొంగిలించేవిగా ఉంటాయి. అందులో కీలాగర్‌లు, కుకీ ట్రాకర్‌లు, బ్యాంకింగ్ ట్రోజన్‌లను రికార్డ్ చేస్తుంటాయి. తరచుగా ఇలాంటి స్పైవేర్ పొరపాటున ఏదైనా క్లిక్ చేయడం ద్వారా మీ ఆండ్రాయిడ్‌లోకి చొరబడుతుంది. అయితే, మీ ఫోన్‌లో స్పైవేర్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో స్పైవేర్ చెక్ చేయాలంటే? :

స్మార్ట్‌ఫోన్‌లో స్పైవేర్ ఉన్నప్పుడు.. డివైజ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఫోన్ పనితీరు స్లో కావడం, వేడెక్కడం, బ్యాటరీ ఛార్జింగ్ వేగంగా ఖాళీ అవ్వడం, డేటా డ్రైనేజ్, పాప్-అప్‌లు హైడింగ్ యాప్స్ లాంటివి ఉంటాయి. ఇలాంటి స్పైవేర్ యాప్‌లు ఉన్నాయో లేదో తెలియాలంటే తప్పకుండా మీ డివైజ్ చెక్ చేసుకోండి.

  •  మీరు పవర్ ఆఫ్ ఆప్షన్ చూసే వరకు పవర్ ఆఫ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
  •  ఇప్పుడు, సేఫ్ మోడ్ ఆప్షన్ కనిపించే వరకు పవర్ ఆఫ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
  •  సేఫ్ మోడ్‌లో, సెట్టింగ్‌లకు వెళ్లి యాప్‌ల కోసం చెక్ చేయండి.
  •  మీరు కొన్ని యాప్‌లను గుర్తించకపోతే.. అది స్పైవేర్ కావొచ్చు.
  •  ఈ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి, మీ ఆండ్రాయిడ్ డివైజ్ రీస్టార్ట్ చేసిన తర్వాత సేఫ్ మోడ్‌ను ఆఫ్ చేయండి.
  •  యాంటీ-స్పైవేర్ యాప్‌ (Avast, Norton 360, Kaspersky, McAfee లేదా AVG) వంటి పాపులర్ యాంటీవైరస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  •  మాల్వేర్ కోసం చెక్ చేయడానికి డివైజ్ ఫుల్ స్కాన్ చేయండి.
  •  సమస్యను పరిష్కరించడానికి స్క్రీన్‌పై సూచనలను అనుసరించండి.
  •  అడ్మిన్ యాక్సెస్‌తో యాప్‌లను చెక్ చేయండి.

Settings > Privacy > Other Security Settings > డివైజ్ మేనేజ్‌మెంట్ యాప్‌లకు వెళ్లండి. మీకు గుర్తుతెలియని యాప్‌ల కోసం మేనేజ్ ఆప్షన్ టోగుల్ చేయండి. మీరు ఇప్పటికీ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు మాల్వేర్ సోకినట్లు భావిస్తే.. ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఉత్తమం. మీ డేటా బ్యాకప్ తీసుకున్న తర్వాతే ఇలా చేయండి.

Read Also : Honor X7c Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో హానర్ X7c ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?