Tech Tips in Telugu : మీ ఇంటర్నెట్ యాక్టివిటీని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ట్రాక్ చేస్తున్నాయా? వెంటనే ఇలా ఆపేయండి!

Tech Tips in Telugu : మెటా ఇటీవలే (Activity Off-Meta Technologies)ని ప్రవేశపెట్టింది. ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram)తో సహా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన డేటాను కంట్రోల్ చేసేందుకు ప్రైవసీ సెట్టింగ్ ద్వారా యూజర్లను అనుమతిస్తుంది.

Tech Tips in Telugu : మీ ఇంటర్నెట్ యాక్టివిటీని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ట్రాక్ చేస్తున్నాయా? వెంటనే ఇలా ఆపేయండి!

How to stop Instagram and Facebook from tracking your internet activity

Updated On : October 25, 2023 / 3:47 PM IST

Tech Tips in Telugu : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఉదాహరణకు.. కంపెనీ వినియోగదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది. ఆ డేటాను యాడ్ బెనిఫిట్స్ కోసం ఇతర కంపెనీలకు విక్రయిస్తుంది. మీరు బ్యాగ్‌ల కోసం సెర్చ్ చేస్తే.. కొన్ని క్షణాల తర్వాత వివిధ కంపెనీల నుంచి బ్యాగ్‌లకు సంబంధించిన యాడ్స్ మీరు గమనించే ఉంటారు. తద్వరా యూజర్ల ప్రైవసీ సమస్యలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మెటా యూజర్ల ప్రైవసీ దృష్ట్యా అనేక కొత్త విధానాలను అమల్లోకి తీసుకొస్తోంది.

అయితే, ప్రైవసీని మరింత బలోపేతం చేసేందుకు వినియోగదారులకు వారి ఆన్‌లైన్ యాక్టివిటీని కంట్రోల్ అందించడానికి, మెటా యాక్టివిటీ ఆఫ్-మెటా టెక్నాలజీ (Activity Off-Meta Technologies)ని తీసుకొచ్చింది. మెటా ప్లాట్‌ఫారమ్‌లతో యాప్‌లు, వెబ్‌సైట్‌లు షేర్ చేసే డేటాను ట్రాక్ చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు యూజర్లను ప్రైవసీ సెట్టింగ్ అనుమతిస్తుంది.

Read Also : Tech Tips in Telugu : ఫేస్‌బుక్‌లో ఒకే అకౌంట్ నుంచి మల్టీపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ గైడ్..!

వ్యాపారాలు, సంస్థలతో వారి యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను విజిట్ చేయడం వంటి సమాచారం ఇందులో ఉంటుంది. మెటాకు ఏ వ్యాపారాలు డేటాను పంపుతున్నాయో చూసేందుకు నిర్దిష్టమైన వాటిని డిస్‌కనెక్ట్ చేయడానికి లేదా మొత్తం డేటాను క్లియర్ చేయడానికి యూజర్లు ఈ టూల్ ఉపయోగించవచ్చు.

మీ ఇంటర్నెట్ యాక్టివిటీని ఇన్‌స్టాగ్రామ్ ట్రాక్ చేయకుండా ఆపాలంటే? :

* ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* బాటమ్ రైటమ్ కార్నర్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటోను Tap చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మూడు అడ్డ గీతలపై Tap చేయండి.
* ‘Settings & Privacy’ ఎంచుకోండి.
Activity’పై నొక్కండి, ఆపై ‘Activity Off Meta Technologies’ నొక్కండి.
ఇతర యాప్‌లు, వెబ్‌సైట్‌లలో మీ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా Instagramని కంట్రోల్ చేసేందుకు ‘Disconnect Future Activity’ని టోగుల్ చేయండి.
మీ గత యాక్టివిటీని మేనేజ్ చేయాలనుకుంటే మీరు ఈ కింది వాటిని ఫాలో చేయొచ్చు.

How to stop Instagram and Facebook from tracking your internet activity

Tech Tips in Telugu : How to stop Facebook from tracking

Activity Off Meta Technologies’ పేజీ నుంచి ‘Your Information and Permissions’ ఆపై ‘Your Activity off Meta Technologies’పై Tap చేయండి.
ఈ పేజీలో, మీరు వీటిని మార్చుకోవచ్చు.
* మీ ’Recent Activity‘ చూడండి.
* నిర్దిష్ట యాప్ యాక్టివిటీని Disconnect చేయండి.
* పాత డేటాను Clear చేయండి.
* బిజినెస్ డేటాను షేర్ చేయకుండా Manage future activity ద్వారా కంట్రోల్ చేయండి.
మీరు ‘Manage Future Activity’, ‘Disconnect Future Activity’ ఎంచుకుంటే, మీ గత యాక్టివిటీ కూడా క్లియర్ అవుతుంది.

మీ ఇంటర్నెట్ యాక్టివిటీని ఫేస్‌బుక్ ట్రాక్ చేయకుండా ఆపాలంటే? :

మీ ‘Facebook’ ప్రొఫైల్‌కి వెళ్లి టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్‌పై క్లిక్ చేయండి.
Settings & Privacy’ ఆపై ‘Settings’ ఎంచుకోండి.
లెఫ్ట్ కాలమ్‌లో ‘Your Facebook Information’ ఆపై ‘Off-Facebook Activity’పై క్లిక్ చేయండి.
‘మీ Manage Your Off-Facebook Activity’ ఆపై ‘Manage Future Activity‘పై క్లిక్ చేయండి.
ఇతర యాప్‌లు, వెబ్‌సైట్‌లలో మీ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా Facebookని ఆపేందుకు ‘Future Off-Facebook Activity’ని టోగుల్ చేయండి.
మీరు ‘Manage Your Off-Facebook Activity’ బటన్‌పై క్లిక్ చేసి, ఆపై ‘Manage Activity’పై క్లిక్ చేయడం ద్వారా ఫేస్‌బుక్ నుంచి నిర్దిష్ట యాప్‌లు, వెబ్‌సైట్‌లను డిస్‌కనెక్ట్ అయ్యేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు.

పైన పేర్కొన్న సెట్టింగ్‌లు మీ డేటాను ట్రాక్ చేయడంలో మీకు ఉపయోగపడతాయి. మెటా ఇప్పటికీ మీ గురించి డేటాను థర్డ్ పార్టీ అడ్వైటైజర్ల వంటి ఇతర మూలాధారాల నుంచి సేకరించగలదు. మీ ప్రైవసీని మరింత ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ లేదా VPNని ఉపయోగించవచ్చు.

Read Also : Tech Tips in Telugu : గూగుల్ సెర్చ్‌లో మీ పర్సనల్ డేటాను ఎలా తొలగించాలో తెలుసా? ఇదిగో సింపుల్ గైడ్ మీకోసం..!