Tech Tips in Telugu : ఫేస్‌బుక్‌లో ఒకే అకౌంట్ నుంచి మల్టీపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ గైడ్..!

Tech Tips in Telugu : ఫేస్‌బుక్ యూజర్ల కోసం మెటా (Meta) సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మల్టీ పర్సనల్ (Facebook Multi Profiles) ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ గైడ్ మీకోసం..

Tech Tips in Telugu : ఫేస్‌బుక్‌లో ఒకే అకౌంట్ నుంచి మల్టీపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ గైడ్..!

Tech Tips in Telugu _ How to Create Multiple Profiles on Facebook from the Same Account

Tech Tips in Telugu : మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా? అయితే, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తమ ఫేస్‌బుక్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ఎనేబుల్ చేయడం ద్వారా ఒకే అకౌంట్లో మల్టీ పర్సనల్ ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. వాస్తవానికి.. (Facebook) ఇప్పుడు ఒకే అకౌంట్ కింద 4 అదనపు ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది. అయితే, ఒక్కో ఫేస్‌బుక్ ప్రొఫైల్ (Facebook Multi Profiles in Telugu) సొంత ప్రత్యేక గుర్తింపుతో యాక్సస్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌లో మల్టీ ప్రొఫైల్స్ :
ఈ అదనపు ప్రొఫైల్‌లు.. యూజర్ల ఆసక్తి, కమ్యూనిటీలు లేదా వ్యక్తిగత అకౌంట్‌కు సంబంధించిన విభిన్న అంశాలను సూచిస్తాయి. ఈ ప్రొఫైల్‌లలో ప్రతి ఒక్కటి సొంత స్నేహితుల జాబితా, న్యూస్ ఫీడ్‌ను కలిగి ఉంటాయి. మీరు ఒక్కొక్కరితో విభిన్న గ్రూపులు, పేజీలను ఫాలో చేయొచ్చు. అయితే, మీరు ఫేస్‌బుక్ అకౌంట్ కోసం సైన్ అప్ చేసినప్పుడు క్రియేట్ చేసిన మీ ప్రాథమిక ఫేస్‌బుక్ ప్రొఫైల్ తప్పనిసరిగా ఉండాలి.

Read Also : Tech Tips in Telugu : ChatGPT ఇప్పుడు మాట్లాడగలదు.. వినగలదు.. చూడగలదు.. ఈ కొత్త ఏఐ వాయిస్, ఇమేజ్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?

అంతేకాదు.. మీరు క్రియేట్ చేసిన ప్రొఫైల్ స్వతంత్రంగా డిలీట్ చేయడం కూడదని గమనించడం ముఖ్యం. మీ మొత్తం ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ చేయడం ద్వారా మాత్రమే డిలీట్ చేయలేరు. ఒకే ఫేస్‌బుక్ అకౌంట్లో మల్టీ ప్రొఫైల్‌లను క్రియేట్ చేయడమే కాదు.. ఒక ప్రొఫైల్ నుంచి మరో ప్రొఫైల్ మధ్య మారిపోవచ్చు.. ఈ సింపుల్ గైడ్ ఫాలో అయిపోండి..

Tech Tips in Telugu _ How to Create Multiple Profiles on Facebook from the Same Account

Tech Tips in Telugu : Multiple Profiles on Facebook Account

అదనపు ప్రొఫైల్‌లకు లాగిన్ చేయాలి :
మీ అన్ని ప్రొఫైల్‌లను యాక్సెస్ చేసేందుకు ఇప్పటికే ఉన్న మీ లాగిన్ క్రెడిన్షియల్స్ డేటాను ఉపయోగించవచ్చు. ఒకసారి అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మొదట్లో మీ ప్రధాన ప్రొఫైల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆపై కావలసిన అదనపు ప్రొఫైల్‌కు మారిపోవచ్చు. మీ మెయిన్ అకౌంట్ ద్వారా క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లు అదనపు ప్రొఫైల్‌లుగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. మీరు పూర్తిగా కొత్త ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసినట్టయితే.. మీ ప్రైమరీ అకౌంట్ నుంచి వేరుగా ఉంటుందని గమనించాలి.

అదనపు ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాలంటే? :
1. మీ ఫేస్‌బుక్ అకౌంట్లో లాగిన్ చేయండి.
ఫేస్‌బుక్ యాప్‌ (Facebook App)ని ఓపెన్ చేయండి లేదా ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ (www.facebook.com)కి వెళ్లి మీ ప్రస్తుత అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఉపయోగించి లాగిన్ చేయండి.

2. మెనూ (Menu) బటన్‌ను యాక్సెస్ చేయండి.
ఫేస్‌బుక్ ఇంటర్‌ఫేస్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న మెనూ బటన్‌పై క్లిక్ చేయండి.

3. మరో ప్రొఫైల్‌ని క్రియేట్ చేయండి :
మెనూ ఆప్షనల్లో మీరు ‘Create Another Profile’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు ఇప్పటికే అదనపు ప్రొఫైల్‌ని కలిగి ఉన్నా లేదా కొత్త పేజీల ఎక్స్ పీరియన్స్ (New Pages Experience) ఉపయోగిస్తుంటే.. మీ ప్రొఫైల్ పేరు పక్కన ‘Create Facebook Profile‘ని చూడవచ్చు. ఈ ఆప్షన్ వద్ద క్లిక్ చేయండి.

4. Get started (అకౌంట్ క్రియేషన్) :
‘Create Another Profile’ or ‘Create Facebook profile’ ఎంచుకున్న తర్వాత ప్రొఫైల్ క్రియేషన్ ప్రాసెస్‌లో ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. కంటిన్యూ చేసేందుకు ‘Get started’పై క్లిక్ చేయండి.

5. ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో చేయండి :
కొత్త ప్రొఫైల్‌ని క్రియేట్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి. మీరు ఈ అదనపు ప్రొఫైల్ కోసం ప్రొఫైల్ నేమ్ @usernameని ఎంచుకోవాలి. ఈ పేర్లు తప్పనిసరిగా Facebook కమ్యూనిటీ గైడ్‌లైన్స్ (Community Standards and Policies), పాలసీలకు అదనపు ప్రొఫైల్‌లు కట్టుబడి ఉండాలని గుర్తుంచుకోండి.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో కొత్త PVC కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

6. అవసరమైతే రిపీట్ చేయండి :
మీరు మరిన్ని అదనపు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లను క్రియేట్ చేయాలంటే పై స్టెప్స్ రిపీట్ చేయండి.

Tech Tips in Telugu _ How to Create Multiple Profiles on Facebook from the Same Account

Tech Tips in Telugu : How to Create Multiple Profiles

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ల మధ్య మారవచ్చు.. :
1. మెనూ బటన్‌ను యాక్సెస్ చేయండి :
మీ ఫేస్‌బుక్ అకౌంట్లో లాగిన్ అయినప్పుడు, రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న మెనూ బటన్‌పై క్లిక్ చేయండి.

2. మీ ప్రొఫైల్‌ని ఎంచుకోండి :
మీ పేరు పక్కన, మీకు డ్రాప్‌డౌన్ బాణం (▼) కనిపిస్తుంది. మీరు క్రియేట్ చేసిన ప్రొఫైల్‌ల జాబితాను బహిర్గతం చేసేందుకు ఈ బాణంపై క్లిక్ చేయండి.

3. మీ ప్రొఫైల్స్ జాబితాలో ఏదైనా ఎంచుకోండి :
మీరు జాబితా నుంచి ఉపయోగించాలనుకుంటున్న ప్రొఫైల్‌ను ఎంచుకోండి. మీరు యూనిక్ ఫ్రెండ్స్ లిస్ట్, ఫీడ్, సెట్టింగ్‌లతో ప్రొఫైల్‌కు మారిపోవచ్చు.

మీరు క్రియేట్ అన్ని ప్రొఫైల్‌లకు ఫేస్‌బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ (Facebook Community Standards) వర్తిస్తాయని గుర్తుంచుకోండి. మీ ప్రొఫైల్‌లలో ఏవైనా ఈ ప్రమాణాలను ఉల్లంఘిస్తే.. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ మొత్తానికే ఎఫెక్ట్ అవుతుందని గమనించాలి. మీ అకౌంట్ ప్రొఫైల్‌లను బాధ్యతాయుతంగా, ఫేస్‌బుక్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉయోగించాల్సి ఉంటుంది. లేదంటే మీ అకౌంట్‌పై పరిమితులు విధించవచ్చు లేదంటే ఏకంగా అకౌంట్ డిసేబుల్ అయ్యే అవకాశం ఉందని గమనించాలి.

Read Also : Tech Tips in Telugu : మీ ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో మల్టీపుల్ లింక్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!