Samsung Galaxy F62 : సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌

అమ్మకాలు పెంచుకునేందుకు మొబైల్ తయారి కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరోవైపు ఈ కామర్స్ సంస్థలు కూడా మొబైల్ ఫోన్స్ పై పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు తమ కస్టమర్లకోసం భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఇక తాజాగా సామ్‌సంగ్ తన మొబైల్ శ్రేణిలోని కొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది.

Samsung Galaxy F62 : సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌

Samsung Galaxy F62

Updated On : August 5, 2021 / 5:43 PM IST

Samsung Galaxy F62 : అమ్మకాలు పెంచుకునేందుకు మొబైల్ తయారి కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరోవైపు ఈ కామర్స్ సంస్థలు కూడా మొబైల్ ఫోన్స్ పై పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు తమ కస్టమర్లకోసం భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఇక తాజాగా సామ్‌సంగ్ తన మొబైల్ శ్రేణిలోని కొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎఫ్62 6 జీబీ ర్యామ్ ధర 23,999 ఉండగా ప్రస్తుతం దానిపై రూ.6000 తగ్గించి 17,999 రూపాయలకు అందిస్తుంది. ఇక ఇదే మోడల్ లో 8జీబీ ర్యామ్ ఫోన్ ధర ఫిబ్రవరి నెలలో రూ.25,999గా ఉంది. దీనిపై కూడా రూ. 6,000 తగ్గించి రూ.19,999 అందిస్తుంది. ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారు సామ్‌సంగ్ ఇండియా వెబ్ సైట్‌లో బుక్ చేస్తే మ‌రో 2500 రూపాయ‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేస్తే వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక ఈ ఫోన్ గురించి చెప్పాలి అంటే… గెలాక్సీ ఎఫ్ 62 వ‌న్ యూఐ 3.1 బేస్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పాటు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమోరీ, ఆక్టా కోర్ ఎక్సినోస్ 9825 ఎస్ఓసీ, 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెనుక‌, ముందు కెమెరాలు రెండూ 4కే వీడియోను రికార్డు చేసే కెపాసిటినీ క‌లిగి ఉంటాయి.

ఇన్ని ఫీచర్స్ ఉన్న ఇతరుల కంపెనీల ఫోన్స్ మార్కెట్లో రూ.20 వేలకు పైనే ఉన్నాయి. ఇక ఈ సేల్ ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని సామ్‌సంగ్ ప్రతినిధులు తెలిపారు.