T-Hub Chhotu QR Code : టి-హబ్ ‘ఛోటు’ సరికొత్త క్యూఆర్ కోడ్ వచ్చేసింది.. పక్కా లోకల్.. పక్కా ఆన్‌లైన్..!
T-Hub Chhotu QR Code : టి-హబ్ ఛోటు వినూత్న క్యూఆర్ కోడ్ ప్రారంభించింది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా లోకల్ షాపుల నుంచి అన్ని రకాల ఆన్‌లైన్ పేమెంట్లు చేసుకోవచ్చు.

Hyderabad startup T-Hub Chhotu launches innovative QR code, Add to Cart in Local Shop
T-Hub Chhotu QR Code : ప్రముఖ హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ టి-హబ్ స్టార్టప్ ‘ఛోటు’ క్యూఆర్ కోడ్‌ను ప్రారంభించింది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కస్టమర్‌లు సులభంగా సెర్చ్ చేయొచ్చు. అలాగే బ్రౌజ్ చేయవచ్చు. కార్టులను యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్‌ను స్వీకరించిన తర్వాత దుకాణదారుడు బిల్లును పంపి రియల్ లైఫ్ మాదిరిగానే పేమెంట్లు తీసుకుంటారు.
పక్కా లోకల్, పక్కా ఆన్‌లైన్ సర్వీసు :
ఈ సర్వీసు నేరుగా వాట్సాప్‌లో, తెలుగులో లేదా ఏదైనా భారతీయ భాషలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి-హబ్ సీఈఓ ఎం శ్రీనివాసరావు (ఎంఎస్ఆర్) హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ (CIO) డాక్టర్ శాంత థౌతం, ఛోటు వ్యవస్థాపకులు వై రవి, వంశీ పంజాలతో పాటు విశిష్ట అతిథులు కూడా ఉన్నారు.
Read Also : Car Insurance Claim : వరదల్లో దెబ్బతిన్న కార్లు, ద్విచక్ర వాహనాలకు బీమా క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలో తెలుసా?
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఇప్పటికే వెయ్యికి పైగా కిరాణా, బేకరీ, కూరగాయల షాపులు ఆన్‌లైన్ అయ్యాయి. కస్టమర్లు chotu.com నుంచి చిటికెలో ఫ్రీ ఆన్‌లైన్ షాపును క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. కేవలం వాట్సాప్ ఉంటే చాలు.. ఫ్రీ ట్రయల్ వ్యవధి తర్వాత నెలవారీ అద్దె కేవలం రూ.99 నుంచి ప్రారంభమవుతుంది.
యువకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా :
ఈ కార్యక్రమంలో టి-హబ్ సీఇఓ మాట్లాడుతూ.. ‘టి-హబ్ వినూత్న ఆలోచనలతో యువకులను ప్రోత్సహిస్తోంది. భారత్‌లో మొత్తం 1.3 కోట్ల కిరాణా షాప్‌లు ఉన్నాయి. మిగతా రకాల షాపులను కలిపితే ఆ సంఖ్యా ఇంకా పెద్దగా ఉంటుంది. ఫోన్‌పే, పేటీఎం వద్దనే చెరో 3.5 కోట్ల మెర్చంట్లు ఉన్నారు. యూపీఐతో పేమెంట్లు చాలా సులువు అయ్యాయి. కానీ, ఇంకా ఈ-కామర్స్ లోకల్ షాప్‌లు అందుబాటులోకి రాలేదు. ఛోటు క్యూఆర్ కోడ్ సర్వీసు ఈ వ్యత్యాసాన్ని తగ్గించగలదని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

T-Hub Chhotu innovative QR code
త్వరలో అన్ని భారతీయ భాషల్లోకి :
ఛోటు సహ వ్యవస్థాపకుడు వైరవి మాట్లాడుతూ.. ‘ఛోటు క్యూఆర్‌తో ప్రతి లోకల్ షాప్ ఆన్‌లైన్ చేయడమే లక్ష్యం. ఆర్డరింగ్, బిల్లింగ్, పేమెంట్స్ వాట్సాప్‌లో చాట్ మాదిరిగా అనిపిస్తుంది. షాప్‌లో ధరలు, కొనుగోళ్లు, పేమెంట్ల పూర్తి కంట్రోల్ లోకల్ షాప్‌లదే’ అని అన్నారు. మరో సహ వ్యవస్థాపకుడు వంశీ పంజాల మాట్లాడుతూ.. ఛోటు క్యూఆర్ వాకిన్ కస్టమర్లను రిపీట్ ఆన్లైన్ కస్టమర్లుగా మార్చగలదు. పాన్ ఇండియా సినిమాలకు హైదరాబాద్ పుట్టినిల్లు. ముందుగా తెలుగు రాష్ట్రాలలో ప్రారంభిస్తున్నాం.
అతి త్వరలో అన్ని భారతీయ భాషలలో దుకాణాలను ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు. రవి, వంశీ ఇద్దరూ ఐఐబీమ్ బెంగళూరు నుంచి ఎంబిఏ చేశారు. అంతకు ముందు ఐఐటీ ఢిల్లీ, ఉస్మానియాలో చదువుకున్నారు. వీరికి మైక్రోసాఫ్ట్ ఎయిర్‌టెల్, జియోలో 30 ఏళ్ల నాయకత్వ అనుభవం ఉంది. భారత్‌లో ప్రతి లోకల్ షాప్ ఆన్‌లైన్‌లోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌లో లోకల్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ఛోటు మార్చగలదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.