Netflix Ban : నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూడు పనులు చేస్తే.. మీ అకౌంట్ బ్యాన్ అయినట్టే..!
Netflix Ban : ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫిక్స్ వినియోగదారులకు అలర్ట్. నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి తప్పులు చేయరాదు..

If You Do These Three Things, You Can Get Banned From Netflix
Netflix Ban : ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫిక్స్ వినియోగదారులకు అలర్ట్. నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి తప్పులు చేయరాదు.. లేదంటే.. మీ అకౌంట్ పూర్తిగా బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ యూజర్లు తమ అకౌంట్ పాస్ వర్డులను షేర్ చేయడాన్ని నిషేధించింది. నెట్ ఫ్లిక్స్ నిబంధనలకు విరుద్ధంగా పాస్ వర్డులను షేరింగ్ చేస్తే వారి అకౌంట్ బ్యాన్ చేసేస్తుంది. ఓటీటీ దిగ్గజం Netflix ఇలాంటి యూజర్ల ప్రవర్తనను ఎంతమాత్రం ఊపేక్షించదు. వాస్తవానికి, పాస్వర్డ్ షేరింగ్‌ను కంట్రోల్ చేయడానికి స్ట్రీమింగ్ దిగ్గజం పెరూ, చిలీ కోస్టారికాలో ఇప్పటికే ఒక టెస్టింగ్ నిర్వహించింది.
మీరు స్ట్రీమింగ్ దిగ్గజం నిబంధనలను ఉల్లంఘిస్తే.. మీరు మీ అకౌంట్ యాక్సస్ కోల్పోతారు. లేదా బ్యాన్ విధించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఇటీవల 2లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయిందని నివేదించింది. కంపెనీ కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను యాడ్స్‌తో ప్రారంభించాలని కూడా యోచిస్తోంది. ఇప్పటికే ఉన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ల కంటే చౌకగా ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్ ఎక్కువ మంది ఫాలోవర్లను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మీరు మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ మూడు పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
VPNని వాడొద్దు :
మీరు VPN వాడుతున్నారా? ఆన్లైన్లో ప్రైవసీ కోసం యూజర్లు ఎక్కువగా VPN వినియోగిస్తుంటారు. ప్రధానంగా ఆన్లైన్ యాక్టివిటీని హైడ్ చేస్తుంది. మీ నెట్‌వర్క్‌ను సైబర్ నేరగాళ్ల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైనా Wi-Fi నెట్‌వర్క్‌లో మీ IP అడ్రస్, బ్రౌజింగ్ హిస్టరీ, వ్యక్తిగత డేటాను కూడా హైడ్ చేయగలదు. ప్రైవసీ ఆధారితమైనప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ యూజర్లు VPN నెట్‌వర్క్‌లో యాప్‌ను బ్రౌజ్ చేయరాదు.

If You Do These Three Things, You Can Get Banned From Netflix
మీరు వేరే దేశంలో ఉన్నారని నమ్మేలా VPNలతో ప్రయత్నించవద్దు.. ఇలా చేస్తే అది Netflix ప్రక్రియకు వ్యతిరేకమని గుర్తించుకోండి. మీరు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ప్రాథమికంగా మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసిన దేశంలోనే యాక్సెస్ చేయవచ్చు. మా సర్వీసును అందించే భౌగోళిక స్థానాల్లో మాత్రమే కంటెంట్‌కు లైసెన్స్ కలిగి ఉన్నామని Netflix నిబంధనల్లో పేర్కొంది. VPN నెట్‌వర్క్‌లో నెట్‌ఫ్లిక్స్‌ని బ్రౌజ్ చేస్తున్నట్టయితే.. VPNలో దాన్ని ఉపయోగించరాదు. అందుకు మీకు ఒక పాప్-అప్ కూడా వస్తుంది. మీరు ఆ రిమైండర్లను విస్మరిస్తే మాత్రం.. మీ నెట్ ఫ్లిక్స్ అకౌంట్ బ్యాన్ ఎదుర్కొనే అవకాశం ఉంది.
నెట్‌ఫ్లిక్స్ వర్జినల్ కంటెంట్‌ని వాడొద్దు :
ఏదైనా కంటెంట్ ఆధారిత యాప్ లేదా వెబ్సైట్లో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ దిగ్గజం అందించే కంటెంట్ డుప్లికేట్ చేసే వారిపై కంపెనీ కఠిన చర్యలు తీసుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా ఆర్కైవ్ చేయడం, రీపబ్లీష్ చేయడం, ఇతర సైట్లలో పోస్టు చేయడం, మార్చడం, లైసెన్స్ మార్చే యూజర్లపై నెట్ ఫ్లిక్స్ నిఘా ఉంచుతుంది. మీరు నిబంధనలను ఉల్లంఘిస్తే నెట్ ఫ్లిక్స్ సర్వీసును నిలిపివేస్తుంది లేదా మీ అకౌంట్ రిస్ట్రిక్స్ చేస్తుందని కంపెనీ బ్లాగులో తెలిపింది.
Read Also : Netflix Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై పాస్వర్డ్ షేర్ చేస్తే చెల్లించాల్సిందే..!